Optical Illusion: ఈ చిత్రంలో దాగిన 9 జంతువులు కనిపెడితే మీ చూపు డేగ చూపే.. 90 శాతం మంది ఫెయిల్
మన దృష్టికి, మెదడుకు పని కల్పించే ఆప్టికల్ ఇల్యూషన్లు, బ్రెయిన్ టీజర్లు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. అలాంటి పజిల్స్ పరిష్కరించడం కష్టమే అయినప్పటికీ.. ఈ సవాళ్లను ఎదుర్కోవడంలో ఆనందం భిన్నంగా ఉంటుంది. ఇప్పుడు చాలా కష్టమైన ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రం ఒకటి వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో ఎన్ని జంతువులు ఉన్నాయో మీరు గుర్తించాలి.

కొంతమందికి గమ్మత్తైన పజిల్స్ ను పరిష్కరించడంలో అమితమైన ఆసక్తి.. వాటిని చూస్తూ.. జవాబుని తెలుసుకునే ప్రయత్నంలో ఎంత సమయం గడిచిపోయిందో కూడా తెలియదు. చాలా మంది ఇలాంటి ఆప్టికల్ ఇల్యూషన్ పజిల్స్‌ను పరిష్కరించడానికి ఆసక్తి చూపుతారు. అయితే కొన్ని చిత్రాలను చూసిన వెంటనే సమాధానం కనుగొనడం కష్టం కావచ్చు. భ్రమలో చిక్కుకున్న సమాధానం కోసం ఎన్నిసార్లు ప్రయత్నించినా, సరైన సమాధానం దొరకదు. ఇప్పుడు కూడా ఇలాంటి గమ్మత్తైన ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రం వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో దాగి ఉన్న తొమ్మిది జంతువులను కనిపెట్టాలనే సవాలు ఇవ్వబడింది. మీరు ఈ పజిల్‌ను పరిష్కరించడానికి సిద్ధంగా ఉంటే ఒక్కసారి చిత్రాన్ని పరిశీలన శక్తితో చూడండి.
ఈ చిత్రంలో ఏముంది?
X ఖాతా @InterstingSTEM ద్వారా షేర్ చేయబడిన ఈ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రం పరిశీలన నైపుణ్యానికి పరీక్ష. ఈ చిత్రం “ఇది ఒక క్లాసిక్ బ్రెయిన్ టీజర్. మీరు ఎన్ని జంతువులను చూస్తున్నారో సమాధానం చెప్పండి అనే శీర్షికతో షేర్ చేశారు. ఈ చిత్రాన్ని చూసి అందులో ఎన్ని జంతువులు ఉన్నాయో చెప్పుకొండి చూద్దాం.” ఈ చిత్రంలోని జంతువులూ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. దీంతో పజిల్‌ను మరింత క్లిష్టతరం చేస్తుంది. దృష్టిని చిత్రంపై కేంద్రీకరించి సరైన సమాధానాన్ని ఊహించడానికి ప్రయత్నించండి. అయితే ఈ పజిల్‌ను పరిష్కరించడానికి సమయ పరిమితి లేదు.
ఆ వైరల్ పోస్ట్ ని ఇక్కడ చూడండి.
A classic brain teaser.
How many animals do you see? pic.twitter.com/Dp8Qk5SM9v
— Interesting STEM (@InterestingSTEM) August 1, 2025
ఈ సవాలును స్వీకరించారా?
ఈ చిత్రంలో ఒకదానికొకటి అనుసంధానించబడిన రేఖలు ఉన్నాయి. ఆ రేఖల్లో జంతువులు దాగి ఉన్నాయి. ఇలాంటి పజిల్స్‌ను పరిష్కరించేటప్పుడు చాలా శ్రద్ధ వహించడం ముఖ్యం. మీరు కూడా ఈ ఆప్టికల్ భ్రాంతి చిత్రాన్ని పరిశీలనగా చూస్తే నాలుగు నుంచి ఐదు జంతువులను సులభంగా గుర్తించవచ్చు. అయితే ఒకదానితో ఒకటి కలిసి తొమ్మిది జంతువులు దాగి ఉన్నాయి. కొంచెం ఓపికగా.. శ్రద్ధగా పరిశీలించి బొమ్మలో దాగున్న మొత్తం తొమ్మిది జంతువులను గుర్తించి అవి ఏమిటో చెప్పండి. కంటి చూపు ఎంత బాగుందో తెలుసుకోవడానికి ఇది సహాయపడుతుంది.
ఆగస్టు 1న షేర్ చేయబడిన ఈ పోస్ట్‌కు వేలాదిగా స్పందనలు వచ్చాయి. సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. నేను ఏడు జంతువులను చూశాను” అని ఒకరు.. ఇక్కడ నాలుగు జంతువులు మాత్రమే ఉన్నాయి” అని మరొకరు ఇలా రకరకాలుగా కామెంట్స్ చేస్తూ పజిల్ ని సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు.
ఇక్కడ సమాధానం ఉంది.
మీరు ఎంత ప్రయత్నించినా నాలుగు లేదా ఐదు జంతువుల కంటే ఎక్కువగా గుర్తించలేకపోతే.. చింతించకండి. ఈ చిత్రంలో దాగి ఉన్న తొమ్మిది జంతువులు ఏమిటో తెలుసుకుందాం.. ఈ చిత్రంలో ఒక ఎలుగుబంటి, ఒక ఆవు, ఒక తోడేలు, ఒక కుందేలు, ఒక కాకి, ఒక సీతాకోకచిలుక, ఒక నత్త, ఒక పక్షి దాగి ఉన్నాయి. ఈ చిత్రాన్ని ఏకాగ్రతతో చూడండి,..ఇప్పుడు చెప్పిన జంతువులన్నిటినీ గుర్తించవచ్చు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








