AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Beauty Tips: పండగవేళ అందంగా కనిపించాలంటే.. టమాటాతో ఇలా స్క్రబ్‌ చేసి చూడండి..మెరిసిపోతారంతే..!

టమాటాలోని లైకోపీన్ ఇది మన చర్మానికి మంచి పోషణ అందిస్తుంది. టమాటాతో స్క్రబ్ తయారు చేసుకోవడం వల్ల మెరిసే మచ్చలేని అందం మీ సొంతం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ట‌మాట‌లో ఉండే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి, సహజ ఆమ్లాలు మీ చర్మాన్ని కాపాడుతాయి. ఖరీదైన బ్యూటీ ప్రొడ‌క్ట్స్ కంటే టమాటాలతో తయారు చేసిన ప్రత్యేక ఫేస్ ప్యాక్‌, స్క్రబ్‌లు బాగా ఉప‌యోగ‌ప‌డ‌తాయి.

Beauty Tips: పండగవేళ అందంగా కనిపించాలంటే.. టమాటాతో ఇలా స్క్రబ్‌ చేసి చూడండి..మెరిసిపోతారంతే..!
Tomato Face Packs
Jyothi Gadda
|

Updated on: Oct 01, 2025 | 2:19 PM

Share

టమాటా.. కేవలం కూరగాయ మాత్రమే కాదు..ఆరోగ్యంతో పాటు అందాన్ని కూడా రెట్టింపు చేసే అద్బుత ఔషధం. చర్మ సౌందర్యాన్ని పెంచడంలో టమాటా దివ్యౌషధంగా పనిచేస్తుంది. టమాటాలోని లైకోపీన్ ఇది మన చర్మానికి మంచి పోషణ అందిస్తుంది. టమాటాతో స్క్రబ్ తయారు చేసుకోవడం వల్ల మెరిసే మచ్చలేని అందం మీ సొంతం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ట‌మాట‌లో ఉండే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి, సహజ ఆమ్లాలు మీ చర్మాన్ని కాపాడుతాయి. ఖరీదైన బ్యూటీ ప్రొడ‌క్ట్స్ కంటే టమాటాలతో తయారు చేసిన ప్రత్యేక ఫేస్ ప్యాక్‌, స్క్రబ్‌లు బాగా ఉప‌యోగ‌ప‌డ‌తాయి.

టమాటా, అరటిపండుతో స్క్రబ్ చేసుకోవచ్చు. టమాటా, అరటిపండు రెండిటినీ గుజ్జులా మిక్స్ చేసి ముఖాన్ని బాగా స్క్రబ్ చేసుకోవాలి. దీనితో చర్మం మృదువుగా మారుతుంది. అరటిపండులో ఉన్న పొటాషియం, విటమిన్స్ చర్మానికి బాగా అందుతాయి.

మరో విధానంలో టమాటా, తేనె కలిపి ముఖాన్ని స్క్రబ్ చేసుకోవచ్చు. ఇందులో కాస్త కోకో పౌడర్ కూడా కలపాలి. దీంతో మన చర్మంపై ఉంటే డెడ్‌ స్కిన్ సేల్స్ కూడా తొలగిపోయి ముఖానికి పునరుజ్జీవనం అందిస్తుంది. తేనే ముఖానికి నేచురల్‌గా గ్లాసీ స్కిన్‌ అందిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఇక టమాటాతో అద్బుతమైన ఫేస్‌ప్యాక్‌ కూడా తయారు చేసుకోవచ్చు. ఇందుకోసం 1 టమోటా, 1 టీస్పూన్ తేనె, 1 చిటికెడు పసుపు, 1 టీస్పూన్ నిమ్మరసం తీసుకోవాలి. ఇందుకోసం ముందుగా తాజా టమోటాను బాగా కడిగి తొక్క తీసేసుకోవాలి. . ఇప్పుడు దాన్ని గుజ్జును వేరు చేసి మెత్త‌గా పేస్ట్‌లాగా చేసుకుని అందులో ఒక టీస్పూన్ తేనె, చిటికెడు పసుపు కలుపుకోవాలి. తేనె చర్మానికి తేమను, మెరుపును ఇస్తుంది, పసుపు సహజ యాంటీ బాక్టీరియల్ ఏజెంట్‌గా పనిచేస్తుంది.

ఇక ఒక‌వేళ మీ చర్మం జిడ్డుగా ఉంటే నిమ్మ‌ర‌సం కూడా క‌లుపుకోండి. ఇలా త‌యారు చేసుకున్న మిశ్ర‌మాన్ని నుదిటిపై, బుగ్గ‌ల‌పై బాగా అప్లై చేయండి. క‌ళ్ల‌లోకి వెళ్ల‌కుండా జాగ్ర‌త్త తీసుకోండి. ఇలా 20 నుంచి 30 నిమిషాలు ఉంచిన త‌ర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని క‌డుక్కోవాలి. తరచూ ఇలా చేయడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. చర్మానికి గులాబీ రంగు వస్తుంది.

ట‌మాట‌లో సహజ ఆమ్లాలు, విటమిన్ సి ఉంటాయి. ఇవి చర్మపు రంగును కాంతివంతం చేస్తాయి, మెరిసేలా చేస్తాయి. ఇది చ‌ర్మానికి గులాబీ రంగును ఇస్తాయి. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు చ‌ర్మంపై మ‌చ్చ‌ల‌ను తొలగించడంలో సహాయపడతాయి.

ఇది మొటిమలను కూడా త‌గ్గించ‌డంలో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. టమోటాలలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది చర్మాన్ని హైడ్రేట్ చేసి సాఫ్ట్‌గా చేస్తుంది. చ‌నిపోయిన చర్మ కణాలను తొలగించడంలో ట‌మాట ఫేస్ ప్యాక్‌ సహాయపడుతుంది. చర్మం వడదెబ్బకు గురైతే, టమోటా ఫేస్ ప్యాక్ మీకు ఉపశమనం కలిగిస్తుంది. చికాకు త‌గ్గ‌డంతో పాటు చ‌ర్మం చ‌ల్ల‌బ‌డుతుంది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.