AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chanakya Niti: మీకు సక్సెస్ కావాలా? ఈ 5 రూల్స్ పాటిస్తే.. టాప్ పొజిషన్ మీదే

ఏదైనా పని ప్రారంభించినప్పుడు చిన్న విజయానికే పొంగిపోకూడదని.. ఉన్నత స్థాయికి చేరుకునేందుకు ప్రణాళికలు విస్తృతం చేయాలని చాణక్యుడు చెబుతున్నారు. భవిష్యత్ కోసం మీరు చేయబోయే ప్రణాళికలను ఎప్పుడూ రహస్యంగా ఉంచాలని అంటున్నారు. జీవితంలో విజయం సాధించేందుకు చాణక్యుడు చెప్పిన 5 నియమాల గురించి తెలుసుకుందాం.

Chanakya Niti: మీకు సక్సెస్ కావాలా? ఈ 5 రూల్స్ పాటిస్తే.. టాప్ పొజిషన్ మీదే
Chanakya Niti
Rajashekher G
|

Updated on: Jan 16, 2026 | 6:05 PM

Share

ఆచార్య చాణక్యుడు గొప్ప ఆర్థికవేత్త, దౌత్యవేత్త. ఆర్థిక, నీతి శాస్త్రం పుస్తకాల ద్వారా ఆయన మనుషులు ఎదుర్కొంటున్న అనేక ఆర్థిక, వ్యక్తిత్వ సమస్యలకు పరిష్కారం చూపారు. జీవితంలో విజయం సాధించాలని కోరుకునేవారికి కొన్ని లక్షణాలు ఉండాలని చాణక్యుడు చెబుతున్నారు. ఆ లక్షణాలు లేకుంటే విజయం సాధ్యం కాదని అంటున్నారు.

ఏదైనా పని ప్రారంభించినప్పుడు చిన్న విజయానికే పొంగిపోకూడదని.. ఉన్నత స్థాయికి చేరుకునేందుకు ప్రణాళికలు విస్తృతం చేయాలని చాణక్యుడు చెబుతున్నారు. భవిష్యత్ కోసం మీరు చేయబోయే ప్రణాళికలను ఎప్పుడూ రహస్యంగా ఉంచాలని అంటున్నారు. జీవితంలో విజయం సాధించేందుకు చాణక్యుడు చెప్పిన 5 నియమాల గురించి తెలుసుకుందాం.

సమయం

ఏ వ్యక్తి జీవితంలోనైనా సమయం చాలా ముఖ్యమైనది. మీరు సమయాన్ని ఆపలేరు. కానీ, మీరు దానినిన ఎలా ఉపయోగించుకుంటారో మీ చేతుల్లోనే ఉంది. మీరు సమయాన్ని ఎంత బాగా ఉపయోగిస్తే.. మీరు అంత ధనవంతులు అవుతారని చాణక్యుడు స్పష్టం చేస్తున్నారు.

శాంతి

మీరు మీ విజయాన్ని డబ్బుతో మాత్రమే కొలిస్తే.. మీ జీవితంలో మీకు ఎప్పటికీ శాంతి లభించదని చాణక్యుడు చెబుతున్నారు. విజయం అంటే మనశ్శాంతి, కాబట్టి డబ్బును వృథా చేయవద్దని.. మనశ్శాంతి కోసం దేవుడికి లొంగిపోవాలని చాణక్యుడు సూచిస్తున్నారు.

ప్రేమ

ప్రేమ ప్రపంచాన్ని జయించగలదని చాణక్యుడు చెప్పారు. కాబట్టి, ఎవరి పట్ల ద్వేష భావాలను పెంచుకోకండి. అందరికీ అంతా బాగానే ఉంటుందని గర్తుంచుకోండి. జీవితంలో మీకు ఎప్పటికీ ఏమీ లోటు ఉండదు.

రహస్య ప్రణాళికలు

మీరు కొత్త పని ప్రారంభించాలనుకున్నప్పుడు.. అలాంటి పరిస్థితిలో మీరు మీ ప్రణాళికలను ఎవరికీ చెప్పకూడదు. మీరు మీ ప్రణాళికలను ఇతరులకు చెబితే.. మీ శత్రువులైనవారు మీ పనిలో విజయం సాధించనివ్వరు. కాబట్టి, మీరు విజయం సాధించే వరకు మీ ప్రణాళికలను రహస్యంగా ఉంచాలని చాణక్యుడు చెప్పారు. మౌనంగా కష్టపడి పని చేస్తూ ఉండండి.. మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారని స్పష్టం చేశారు.

ప్రజా సంబంధాలు

సమాజంలోని మంచి, చెడు వ్యక్తుల గురించి మీరు తెలుసుకునేలా వీలైనంత వరకు ప్రజా సంబంధాలను పెంచుకోవాలని చాణక్యుడు చెబుతున్నారు. మీ జీవితంలో చెడ్డవారికి ఎప్పుడూ స్థానం ఇవ్వకండి. కానీ, మీ జీవితాంతం మీరు కలిసే మంచి వ్యక్తులను మీతో ఉంచుకోండి అని చాణక్యుడు సూచిస్తున్నాడు.

Note: ఈ వార్తలోని సమాచారం అందుబాటులో ఉన్న వనరుల నుంచి సేకరించి పాఠకుల కోసం అందించడం జరిగింది.