AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tips for Sugar Test: షుగర్ టెస్ట్ చేయించుకునేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి!

ఇప్పుడున్న లైఫ్ స్టైల్ కారణంగా చాలా మంది షుగర్ తో ఇబ్బంది పడుతూ ఉంటారు. వయసుతో సంబంధం లేకుండా అందరూ డయాబెటీస్ తో బాధ పడుతున్నారు. ఒక్కసారి మధు మేహం వచ్చిందంటే.. అది అంత తేలిగ్గా తగ్గదు. ఇప్పటివరకూ డయాబెటీస్ కు చికిత్స కూడా లేదు. సరైన ఆహారం తీసుకుంటూ చక్కెర వ్యాధిని కంట్రోల్ చేసుకోవడం చేసుకోవాలి. షుగర్ ఉన్న వారు తరచూ ఖచ్చితంగా బ్లడ్ టెస్టులు చేయించుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ రక్త పరీక్షలు..

Tips for Sugar Test: షుగర్ టెస్ట్ చేయించుకునేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి!
Diabetes
Chinni Enni
| Edited By: |

Updated on: Dec 04, 2023 | 8:20 PM

Share

ఇప్పుడున్న లైఫ్ స్టైల్ కారణంగా చాలా మంది షుగర్ తో ఇబ్బంది పడుతూ ఉంటారు. వయసుతో సంబంధం లేకుండా అందరూ డయాబెటీస్ తో బాధ పడుతున్నారు. ఒక్కసారి మధు మేహం వచ్చిందంటే.. అది అంత తేలిగ్గా తగ్గదు. ఇప్పటివరకూ డయాబెటీస్ కు చికిత్స కూడా లేదు. సరైన ఆహారం తీసుకుంటూ చక్కెర వ్యాధిని కంట్రోల్ చేసుకోవడం చేసుకోవాలి. షుగర్ ఉన్న వారు తరచూ ఖచ్చితంగా బ్లడ్ టెస్టులు చేయించుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ రక్త పరీక్షలు చేయించుకునేటప్పుడు చాలా మంది కొన్ని రకాల తప్పులను చేస్తూ ఉంటారు. దీని వల్ల షుగర్ లెవల్స్ కూడా మార్పులు వస్తాయి. మరి షుగర్ టెస్టులు చేయించుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

శుభ్రంగా చేతులు వాష్ చేసుకోవాలి:

చాలా మంది చక్కెర టెస్ట్ చేయించుకునేటప్పుడు చేతులను సరిగ్గా శుభ్రం చేసుకోరు. మీరు మంచి ఫలితాలను పొందాలంటే.. చేతులను ఖచ్చితంగా సబ్బుతో, వేడి నీటితో కడుక్కోవాలి. ఆపై చేతులు బాగా ఆరాక టెస్టులు చేయించుకోవాలి. ఈలోపు ఎలాంటి వస్తువులను పట్టుకోక పోవడమే బెటర్.

రాత్రి మాత్రమే చేయించుకోవాలి:

చాలా మంది షుగర్ టెస్ట్ అనగానే పరగడుపు లేదా మధ్యాహ్నం చేయించుకుంటారు. కానీ రాత్రి ఆహారం తిన్న తర్వాత మాత్రమే డయాబెటీస్ చెక్ చేయించుకుంటే మంచిది. దీని వల్ల ఉత్తమమైన ఫలితాలు పొందవచ్చు. రాత్రి చేయించు కోవడం వల్ల రక్తంలో షుగర్ ఎంత ఉందో తెలుస్తుంది. దాని బట్టి మెడిసిన్ వాడుకోవాలి.

ఇవి కూడా చదవండి

తిన్న తర్వాత ఈ సమయానికి చేయించుకోవాలి:

సాధారణం ఎవరైనా తిన్న గంట లేదా గంటన్నర తర్వాత చక్కెర పరీక్షను చేయించుకుంటారు. అస్సలు అలా చేయవద్దు. తిన్నాక.. రెండు గంటల తర్వాతనే ఈ పరీక్ష చేయించుకోవాలి. అప్పుడే బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి.

గ్లూకోజ్ మీటర్ సరిగ్గా ఉపయోగించాలి:

చాలా మంది గ్లూకోజ్ మీటర్ ని సరిగ్గా ఉపయోగించరు. దీని వలన సరైన ఫలితం పొందలేరు. కాబట్టి వైద్యుల సలహాల, సూచనల మేరకు గ్లూకోజ్ మీటర్ ని యూజ్ చేయాలి.

మధు మేహం ఎందుకు వస్తుంది:

కొవ్వు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవడం, శారీరక శ్రమ తగ్గడం, సరైన వేళల్లో భోజనం చేయకపోవడం, సరిపడినంతగా నిద్ర లేక పోవడం వల్ల ఈ మధు వేహం అనేది వస్తుంది. అదే విధంగా కొంత మందికి వంశ పారం పర్యంగా కూడా వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.