AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pradeep Ranganathan : తెలుగులో వరుస హిట్స్.. ప్రదీప్ రంగనాథన్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన టాలీవుడ్ హీరోయిన్..

ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో వరుస హిట్లతో దూసుకుపోతున్న యంగ్ హీరోలలో ప్రదీప్ రంగనాథన్ ఒకరు. అటు దర్శకుడిగా.. ఇటు హీరోగా సక్సెస్ అయిన ప్రదీప్.. ఇప్పుడు కొత్త సినిమాను పట్టాలెక్కించే పనిలో పడ్డారు. తాజాగా ఈ హీరోకు సంబంధించిన కొత్త సినిమా క్రేజీ ప్రాజెక్ట్ ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతుంది. ఇంతకీ ఆ విషయమేంటో తెలుసా.?

Pradeep Ranganathan : తెలుగులో వరుస హిట్స్.. ప్రదీప్ రంగనాథన్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన టాలీవుడ్ హీరోయిన్..
Pradeep Ranganathan
Rajitha Chanti
|

Updated on: Dec 25, 2025 | 12:41 PM

Share

దక్షిణాదిలో ఇప్పుడిప్పుడు విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకుంటున్న హీరో ప్రదీప్ రంగనాథన్. కంటెంట్ ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంచుకుంటూ అటు హీరోగా.. ఇటు దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ప్రదీప్ డైరెక్షన్ మేకింగ్, యాక్టింగ్ యూత్ ను తెగ ఆకట్టుకుంటున్నాయి. ఇటీవలే డ్యూడ్ సినిమాతో అటు తమిళం… ఇటు తెలుగులోనూ భారీ విజయాన్ని అందుకున్నాడు. యువత ఎక్కువగా కనెక్ట్ అంశాలను ప్రధానంగా తీసుకుని తెరకెక్కిస్తూ వరుస హిట్స్ అందుకుంటున్నాడు ప్రదీప్. ఇప్పటివరకు ఆయన హీరోగా నటించిన 3 సినిమాలు భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. అలాగే 2 చిత్రాలకు దర్శకత్వం వహించారు.

ఇవి కూడా చదవండి : Actor: ఒక్క సినిమాతోనే అమ్మాయిల డ్రీమ్ బాయ్‏గా.. వరుస హిట్లకు కేరాఫ్ అడ్రస్ ఈ హీరో.. క్రేజ్ చూస్తే..

ప్రదీప్ రంగనాథన్ 2019లో రవి మోహన్ నటించిన ‘కోమలి’ చిత్రంతో తమిళ సినిమాలో దర్శకుడిగా అరంగేట్రం చేశారు. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. ఆ తర్వాత 2022లో లవ్ టుడే సినిమాతో మరో హిట్ అందుకున్నారు. ఈ సినిమా ఏకంగా రూ.100 కోట్లు రాబట్టింది. ఆ తర్వాత మూడేళ్లు గ్యాప్ తీసుకున్న ఈ హీరో.. డ్రాగన్, డ్యూడ్ చిత్రాలతో మరోసారి అడియన్స్ ముందుకు వచ్చారు. ప్రస్తుతం LIK చిత్రంలో నటిస్తున్నారు విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఈనెల 18న రిలీజ్ కావాల్సి ఉండగా.. వాయిదా పడింది.

ఇవి కూడా చదవండి : Director: సక్సెస్ అంటే ఇది.. ఒకప్పుడు లారీ డ్రైవర్.. ఇప్పుడు గొప్ప డైరెక్టర్.. ఒక్క ప్లాపు లేని దర్శకుడు..

ఇదిలా ఉంటే.. ప్రదీప్ రంగనాథన్ ఇప్పుడు AGS సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఆయనే దర్శకత్వం వహించనున్నారట. ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభం కానుంది. ఇది సైన్స్ ఫిక్షన్ సినిమా అని చెబుతున్నారు. విజయ్ ‘ది కోడ్’ సహా సినిమాల్లో నటించిన మీనాక్షి చౌదరి ఈ సినిమాలో కథానాయికగా నటించనుందని సమాచారం. త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన రానుందని టాక్.

ఇవి కూడా చదవండి : 1000కి పైగా సినిమాలు.. సిల్క్ స్మిత కంటే ముందే ఇండస్ట్రీని శాసించిన హీరోయిన్.. చివరి రోజుల్లో ఎంతగా బాధపడిందంటే..

ఇవి కూడా చదవండి : Actress Srilakshmi : 500లకు పైగా సినిమాలు.. ఈ నటి మేనకోడలు తెలుగులో క్రేజీ హీరోయిన్.. 300 కోట్లు కొల్లగొట్టింది..