Amalapuram: కేజీ ప్లాస్టిక్ ఇస్తే.. కేజీ ఆలుగడ్డలు లేదా ఉల్లిగడ్డలు..
స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా అమలాపురం పట్టణాన్ని స్వచ్ఛంగా మార్చేందుకు బండారులంకకు చెందిన సత్యనారాయణ రాజు వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇంట్లో ఉన్న ప్లాస్టిక్ చెత్తను తీసుకొస్తే ఉచితంగా కూరగాయలు, తినుబండారాలు అందిస్తూ పర్యావరణ పరిరక్షణకు ప్రజలను భాగస్వాముల్ని చేస్తున్నారు.

స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా అమలాపురం పట్టణాన్ని స్వచ్ఛంగా తీర్చిదిద్దేందుకు అమలాపురంలో “నేను సైతం” అంటూ ముందుకు వచ్చడు ఒక వ్యక్తి.ఇంట్లో ఉన్నప్లాస్టిక్ చెత్త తీసుకురండి.. ఉచితంగా కూరగాయలు, తిను బండారులు తీసుకెళ్లండి ఒక స్టాల్‌నే ఏర్పాటు చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం బండారులంకకు చెందిన సత్యనారాయణ రాజు తన ఫౌండేషన్ ద్వారా వినూత్న కార్యక్రమం చేపట్టారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి, పర్యావరణ పరిరక్షణకు తోడ్పడే లక్ష్యంతో ఒక కిలో ప్లాస్టిక్ బాటిళ్లకు ఒక కిలో బంగాళదుంపలు, ఉల్లిపాయలు లేదా తిను బండారాలు ఉచితంగా అందించే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రభుత్వం చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛ్ ఆంధ్రప్రదేశ్‌కు తన వంతు తోడ్పాటు చేయాలని ద్వారకామాయి ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ బాటిళ్లు, చెత్త సామగ్రిని తీసుకుని, వాటికి బదులుగా ఉచితంగా కూరగాయలు అందజేస్తున్నామని తెలిపారు.
ఈ సందర్భంగా సత్యనారాయణ రాజు మాట్లాడుతూ సేకరించిన ప్లాస్టిక్ వ్యర్థాలను పూర్తిగా రీసైక్లింగ్ చేసి, పర్యావరణానికి హాని కలగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అమలాపురం పట్టణాన్ని “స్వచ్ఛ అమలాపురం”గా మార్చేందుకు తమవంతు కృషి కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో ప్లాస్టిక్ వ్యర్థాలపై అవగాహన పెరగడంతో పాటు, స్వచ్ఛతపై బాధ్యతాభావం పెరుగుతుందని తెలిపారు. ప్లాస్టిక్ వ్యర్ధాలకు, కూరగాయలు తినుబండారాలు ఇస్తున్నారని తెలవడంతో స్థానికంగా ఉన్న ప్రజలందరూ ఇంట్లో ఉన్న ప్లాస్టిక్ సామాన్లు తీసుకువచ్చి.. ఉచితంగా కూరగాయలు తిను బండారాలు తీసుకుని వెళ్లారు. గతంలో పాత సామాన్లకు పాత ప్లాస్టిక్స్ వస్తువులకు ఇంటింటికి తిరిగి బఠానీలు మరమరాలు లేదా ముగ్గు వంటివి ఇచ్చేవారు. ఇక ప్లాస్టిక్ నిషేధించేందుకు సత్యనారాయణ రాజు చేపట్టిన ప్లాస్టిక్ ఇచ్చుకో ఉచితంగా కూరగాయలు పుచ్చుకో.. అంటూ చేపట్టిన కార్యక్రమాన్ని పలువురు అభినందించారు.
