Urinary Health: రోజుకు ఎన్నిసార్లు మూత్ర విసర్జన చేయాలి..? లేదంటే, మీ హెల్త్ రిస్క్‌లో ఉన్నట్టే..!
రోజుకు ఎన్నిసార్లు మూత్ర విసర్జన చేయాలి? ఇది నీటి వినియోగం, వయస్సుపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా 4-10 సార్లు. తరచుగా లేదా తక్కువగా మూత్ర విసర్జన చేయడం నిర్జలీకరణం, డయాబెటిస్, కిడ్నీ సమస్యలు, UTI లేదా ప్రోస్టేట్ విస్తరణ వంటి ఆరోగ్య సమస్యలకు సంకేతం కావచ్చు. మీ మూత్ర అలవాట్లలో మార్పులు గమనిస్తే వైద్యుడిని సంప్రదించడం ముఖ్యం.

ఒక వ్యక్తి రోజుకు ఎన్నిసార్లు మూత్ర విసర్జన చేస్తాడనేది మూత్రాశయ సామర్థ్యం, రోజంతా వారు ఏం తాగుతారు..? ఎంత తాగుతున్నారు.. ? వారి వయస్సు వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. అందువల్ల ఒక వ్యక్తి ఎన్నిసార్లు మూత్ర విసర్జన చేస్తారు అనేది సాధారణంగా అందరికీ భిన్నంగా ఉంటుంది. అయితే, వారు మూత్ర విసర్జన చేసే సంఖ్య అవసరమైన దానికంటే ఎక్కువ లేదా తక్కువగా ఉంటే అది కూడా ఒక సమస్యే. కాబట్టి, ఒక సాధారణ వ్యక్తి 24 గంటల్లో ఎన్నిసార్లు మూత్ర విసర్జన చేస్తాడనేది ఇక్కడ తెలుసుకుందాం..
రోజుకు ఎన్నిసార్లు మూత్ర విసర్జన చేయడం మంచిది..?
సాధారణంగా ఒక వ్యక్తి రోజుకు 4 నుండి 10 సార్లు మూత్ర విసర్జన చేయడం కామన్. ఇది త్రాగే నీటి పరిమాణం, తీసుకునే పానీయాల రకాలను బట్టి ఉంటుంది. చాలా తక్కువగా లేదా ఎక్కువగా మూత్ర విసర్జన చేయడం సమస్యకు సంకేతం.
ఒలిగురియా అంటే రోజుకు నాలుగు సార్లు కంటే తక్కువ మూత్ర విసర్జన చేయడం. లేదంటే 400 మి.లీ కంటే తక్కువ మూత్రం ఉత్పత్తి చేయడంగా చెబుతారు. తక్కువగా మూత్ర విసర్జన చేయడం అనేక ఆరోగ్య సమస్యలకు సంకేతం.
నిర్జలీకరణం – తక్కువసార్లు మూత్ర విసర్జన చేయడం నిర్జలీకరణానికి సంకేతం. మీరు రోజంతా తగినంత నీరు తాగకపోతే నిర్జలీకరణం జరుగుతుంది.
కిడ్నీ సమస్యలు – మూత్రపిండాలు సరిగ్గా పనిచేయకపోతే, మూత్రవిసర్జనకు సంబంధించిన సమస్యలు సంభవించవచ్చు. ఇది కూడా కిడ్నీలో రాళ్లకు దారి తీస్తుంది.
మూత్ర నాళంలో అడ్డంకులు – మూత్రాశయం లేదా మూత్రనాళంలో ఏదైనా అడ్డంకులు ఉంటే, అప్పుడు మూత్రం తక్కువగా బయటకు వస్తుంది.
విస్తరించిన ప్రోస్టేట్ – పురుషులలో విస్తరించిన ప్రోస్టేట్ మూత్రవిసర్జనకు ఆటంకం కలిగిస్తుంది. దీనివల్ల అరుదుగా మూత్రవిసర్జన జరుగుతుంది. కొన్నిసార్లు, మూత్రం చుక్క చుక్కగా బయటకు వస్తుంది.
మూత్ర సంక్రమణ – మూత్ర నాళాల ఇన్ఫెక్షన్ కూడా మూత్రవిసర్జనకు సంబంధించిన సమస్యలను కలిగిస్తుంది. దీంతో మూత్రం తక్కువగా లేదా ఎక్కువగా ఉండవచ్చు.
మందుల దుష్ప్రభావాలు – మందుల దుష్ప్రభావాలు కూడా తక్కువ మూత్రవిసర్జనకు కారణమవుతాయి.
అధిక మూత్రవిసర్జనకు కారణమేమిటి?
10 సార్లకు పైగా మూత్ర విసర్జన చేయడం, లేదంటే ఎక్కువ మూత్ర విసర్జన చేయడం అనేక ఆరోగ్య సమస్యల వల్ల సంభవించవచ్చు.
ఎక్కువ ద్రవాలు తీసుకోవడం – ఒక వ్యక్తి రోజంతా ద్రవాలు తీసుకుంటూ ఉంటే, అతను తరచుగా మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంది.
చలి వాతావరణం – శీతాకాలంలో చెమట తక్కువగా ఉంటుంది. దీని కారణంగా మూత్రం ద్వారా ద్రవాలు విడుదలవుతాయి. అప్పుడు తరచుగా మూత్రానికి వెళ్లాల్సి వస్తుంది.
డయాబెటిస్ – తరచుగా మూత్రవిసర్జన లేదా అధిక మూత్రవిసర్జన మధుమేహానికి సంకేతం కావచ్చు.
మూత్ర సంక్రమణ – ఒక వ్యక్తికి మూత్ర సంక్రమణ ఉంటే, అతనికి తరచుగా మూత్రవిసర్జన కూడా ఉండవచ్చు.
ప్రోస్టేట్ విస్తరణ – ప్రోస్టేట్ పెరిగినప్పుడు, మూత్రాశయాన్ని ఒకేసారి ఖాళీ చేయలేము. దీని కారణంగా ఆ వ్యక్తి తరచుగా మూత్ర విసర్జన చేయాల్సి రావచ్చు.
మూత్రపిండాల్లో రాళ్లు – మూత్రాశయం లేదా మూత్రపిండాలలో రాళ్లు ఉంటే మూత్ర విసర్జన తరచుగా పెరుగుతుంది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




