AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Benefits Of Jaggery: చలికాలంలో బెల్లం తినడం వల్ల ఎన్ని లాభాలో.. గుండె జబ్బులు పరార్‌!

చలికాలంలో బెల్లం తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అన్ని ఇన్నీకావు. పంచదారకు బదులుగా బెల్లం తినడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. బెల్లంలోని పోషకాలను పరిశీలిస్తే ఆ విషయం అవగతమవుతుంది. అందుకే అనేక మంది పంచదారకు బదులు బెల్లంను స్వీట్లలో ఉపయోగిస్తారు. చలికాలంలో బెల్లం తినడం ఔషధం లాంటిది. చలికాలంలో బెల్లం తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

Benefits Of Jaggery: చలికాలంలో బెల్లం తినడం వల్ల ఎన్ని లాభాలో.. గుండె జబ్బులు పరార్‌!
Benefits Of Consuming Jaggery
Srilakshmi C
|

Updated on: Dec 04, 2023 | 8:00 PM

Share

చలికాలంలో బెల్లం తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అన్ని ఇన్నీకావు. పంచదారకు బదులుగా బెల్లం తినడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. బెల్లంలోని పోషకాలను పరిశీలిస్తే ఆ విషయం అవగతమవుతుంది. అందుకే అనేక మంది పంచదారకు బదులు బెల్లంను స్వీట్లలో ఉపయోగిస్తారు. చలికాలంలో బెల్లం తినడం ఔషధం లాంటిది. చలికాలంలో బెల్లం తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

బెల్లంలో పోషకాలు

మన శరీరానికి అవసరమైన మూలకాలు బెల్లంలో లభిస్తాయి. విటమిన్ ఎ, బి, సుక్రోజ్, గ్లూకోజ్, ఐరన్, కాల్షియం, భాస్వరం, పొటాషియం, జింక్, మెగ్నీషియం వంటి ఎన్నో పోషకాలు ఇందులో ఉంటాయి. చలికాలంలో బెల్లం శరీరానికి పవర్ బూస్టర్‌గా పనిచేస్తుంది.

గుండె ఆరోగ్యం కోసం

బెల్లంలో ఉండే సహజ చక్కెరలు, యాంటీఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. దీనిలోని పొటాషియం, మెగ్నీషియం కారణంగా బెల్లం గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. చలికాలంలో చాలా మందికి గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. అలాంటప్పుడు బెల్లం తింటే గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

ఇవి కూడా చదవండి

రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తుంది

బెల్లంలో ఉండే యాంటీకోగ్యులెంట్ గుణాలు రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తాయి. శరీరంలోని అన్ని భాగాల నుంచి రక్తం సిరల ద్వారా సాఫీగా ప్రవహిస్తుంది. ఇది మొత్తం శరీరానికి చాలా మేలు చేస్తుంది.

కొలెస్ట్రాల్ తగ్గుతుంది

పంచదారకు బదులు బెల్లం తినే వారి శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. ఇది ఊబకాయాన్ని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.

రోగనిరోధక శక్తి పెరుగుతుంది

శీతాకాలంలో రోగనిరోధక శక్తిని పెంపొందిచే ఆహారాలు తినాలి. లేదంటే జలుబు, దగ్గు, జ్వరం వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అదేవిధంగా, రోగనిరోధక శక్తి బలహీనంగా ఉంటే, త్వరగా అనారోగ్యానికి గురవుతారు. కాబట్టి ప్రతిరోజూ కనీసం ఒక బెల్లం ముక్కను తినడం అలవాటు చేసుకోండి.

శరీరానికి తక్షణ శక్తి

బెల్లంలో లభించే పోషకాల కారణంగా, శరీరానికి తగినంత శక్తిని అందిస్తుంది. బెల్లం తినడం వల్ల దైనందిన జీవితంలో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవడానికి శక్తి లభిస్తుంది.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం క్లిక్‌ చేయండి.

సచిన్, గంగూలీతోపాటు దుమ్మురేపినోడు ఇలా అరెస్ట్ అయ్యాడేంటి?
సచిన్, గంగూలీతోపాటు దుమ్మురేపినోడు ఇలా అరెస్ట్ అయ్యాడేంటి?
వావ్‌ రోజుకో చిన్న ముక్క అల్లం తింటే ఇన్ని లాభాలా..? ఈ సీజన్‌లో
వావ్‌ రోజుకో చిన్న ముక్క అల్లం తింటే ఇన్ని లాభాలా..? ఈ సీజన్‌లో
మ్యాగీ అమ్మి ఒక్కరోజూలో రూ.21వేల సంపాదించిన యువకుడు
మ్యాగీ అమ్మి ఒక్కరోజూలో రూ.21వేల సంపాదించిన యువకుడు
అరటిపండు మధుమేహులకు మంచిదేనా..? తింటే ఏమౌతుందో తెలిస్తే..
అరటిపండు మధుమేహులకు మంచిదేనా..? తింటే ఏమౌతుందో తెలిస్తే..
OTTని షేక్ చేస్తోన్న తెలుగు హారర్ థ్రిల్లర్..IMDBలోనూ 8.1 రేటింగ్
OTTని షేక్ చేస్తోన్న తెలుగు హారర్ థ్రిల్లర్..IMDBలోనూ 8.1 రేటింగ్
వేస్ట్ నుండి బెస్ట్.. పారేసే మాత్రలతో ఇన్ని ప్రయోజనాలా?
వేస్ట్ నుండి బెస్ట్.. పారేసే మాత్రలతో ఇన్ని ప్రయోజనాలా?
వందే భారత్ స్లీపర్ రైలులో నాన్ వెజ్ ఉంటుందా..? రైల్వేశాఖ నుంచి..
వందే భారత్ స్లీపర్ రైలులో నాన్ వెజ్ ఉంటుందా..? రైల్వేశాఖ నుంచి..
ఈ అందమైన మసాలా సుగంధ ద్రవ్యాల రాజు..! ఆ సమస్యల పాలిట లక్ష్మణరేఖ!!
ఈ అందమైన మసాలా సుగంధ ద్రవ్యాల రాజు..! ఆ సమస్యల పాలిట లక్ష్మణరేఖ!!
పురపోరుకు నగారా..! పార్టీల్లో హైరానా..
పురపోరుకు నగారా..! పార్టీల్లో హైరానా..
ఈ సమయంలో అరటిపండు అస్సలు తినొద్దా.. ఈ నిజాలు తెలిస్తే మీరు షాక్..
ఈ సమయంలో అరటిపండు అస్సలు తినొద్దా.. ఈ నిజాలు తెలిస్తే మీరు షాక్..