Srikanth: హీరో శ్రీకాంత్ చెల్లెలు కూడా తెలుగులో స్టార్ నటి అని తెలుసా? మహేష్, ప్రభాస్‌లతో సినిమాలు చేసింది
టాలీవుడ్ హీరో శ్రీకాంత్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. కేవలం హీరోగానే కాకుండా విలన్ గా, సహాయక నటుడిగానూ మెప్పించాడీ హ్యాండ్సమ్ యాక్టర్. ప్రస్తుతం అతని కుమారుడు రోషన్ మేక కూడా హీరోగా రాణిస్తున్నాడు. అయితే శ్రీకాంత్ చెల్లెలు కూడా తెలుగులో స్టార్ నటి అన్న విషయం చాలా మందికి తెలియదు.

టాలీవుడ్ లో ఉన్న హ్యాండ్సమ్ హీరోల్లో శ్రీకాంత్ కూడా ఒకరు. కెరీర్ ప్రారంభంలో విలన్ గా నటించిన అతను ఆ తర్వాత హీరోగానూ సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు ట్రెండ్ కు తగ్గట్టుగా విలన్ గా, సహాయక నటుడిగానూ మెప్పిస్తున్నాడు. ఇక శ్రీకాంత్ ఫ్యామిలీలో చాలా మందికి సినిమా ఇండస్ట్రీతో అనుబంధం ఉంది. శ్రీకాంత్ సతీమణి ఊహా ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్ గా రాణించింది. తన అందం, అభినయంతో తిరుగులేని నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఇక శ్రీకాంత్ కుమారుడు రోషన్ నిర్మలా కాన్వెంట్ సినిమాతో హీరోగా మారాడు. పెళ్లి సందడి సినిమాతో సక్సెస్ అందుకున్నాడు. ఇప్పుడు ఛాంపియన్ సినిమాతో మరోసారి మన ముందుకు వచ్చాడు. ఇక శ్రీకాంత్ సోదరుడు అనిల్ కుమార్ కూడా ఇండస్ట్రీ లోకి హీరో గా అడుగుపెట్టాడు. ‘ప్రేమించేయి ఎందుకమ్మా’ అనే సినిమాతో హీరోగా అదృష్టం పరీక్షించుకున్నాడు. ఆ తర్వాత శ్రీకాంత్ నటించిన కొన్ని సినిమాలకు నిర్మాతగా వ్యవహరించాడు. అయితే శ్రీకాంత్ చెల్లెలు కూడా టాలీవుడ్ లో స్టార్ నటి అన్న విషయం చాలా మందికి తెలియదు. ఇంతకీ ఆమె మరెవరో కాదు అనితా చౌదరి.. ఇలా పేరు చెబితే గుర్తు పట్టలేరు కానీ.. ప్రభాస్ నటించిన ఛత్రపతి సినిమాలో ‘ఓ సూరీడు.. బస్సుకు యాలైతాందిరా యాడికి పోయావ్’ అంటూ అంధురాలి పాత్రలో కనిపించిన నటి అంటే ఇట్టే గుర్తుకు వస్తోంది.
తెలుగులో దాదాపు 50 కు పైగా సినిమాల్లో నటించింది అనిత. రాజా, మురారి, సంతోషం, ఆనందం, నువ్వే నువ్వే, గోల్ మాల్, ఛత్రపతి, ఉయ్యాల జంపాల, మన్మథుడు, నిన్నే ఇష్టపడ్డాను, కేరింత, గురు, జాంబి రెడ్డి తదితర సూపర్ హిట్ సినిమాల్లో వివిధ పాత్రలు పోషించిందీ అందాల తార. అలాగే కొన్ని టీవీ షోల్లోనూ సందడి చేసింది. ఇటీవల సంచలన విజయాలు సాధించిన లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి సినిమాల్లో హీరోకు తల్లిగా కనిపించి మరోసారి అందరి మన్ననలు అందుకుంటోంది.
అనితా చౌదరి ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..
View this post on Instagram
సినిమాల సంగతి పక్కన పెడితే.. అనిత హీరో శ్రీకాంత్ కు చెల్లెలు వరుస అవుతుంది. ఆమె కృష్ణ చైతన్య అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కృష్ణ చైతన్య శ్రీకాంత్‌కు చాలా దగ్గరి బంధువు అవుతాడు. వీరి పెళ్లి కూడా శ్రీకాంతే దగ్గరుండి జరిపించాడట. ఈ విషయాన్ని అనితా చౌదరీ స్వయంగా ఓ ఇంటర్వూలో వెల్లడించింది. అలా శ్రీకాంత్‌కు అనితా చౌదరీ వరసకు సిస్టర్ అవుతుంది. ప్రస్తుతం అనిత, కృష్ణ చైతన్య దంపతులకు ఒక బాబు ఉన్నాడు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




