జుట్టు సమస్యలకు మునగాకు ప్యాక్..! ఆరోగ్యమే కాదు అందానికీ మంచిదట.. ఎలా వాడాలంటే..
మునగాకు.. ఆరోగ్యానికి చాలా మంచిదని మనందరికీ తెలిసిందే. అయితే, కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాదు. జుట్టుని పెంచడంలో, జుట్టుని బలంగా చేయడంలో కూడా మునగాకు ముందు వరుసలో ఉంటుందని మీకు తెలుసా..? మునగలో ప్రోటీన్, విటమిన్స్, బేటా కెరోటిన్, అమైనో యాసిడ్స్‌లు ఉంటాయి. అంతేకాదు..మునగలో యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి. దీని వల్ల డాండ్రఫ్‌ని దూరం చేస్తుంది. స్కాల్ప్ దురదని తగ్గిస్తుంది. సోరియాసిస్, తామరా వంటి బ్యాక్టిరీయల్ సమస్యల్ని దూరం చేస్తుంది. మరిన్ని లాభాలు, ఎలా వాడాలో ఇక్కడ చూద్దాం..

మునగాకులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. మునగాకులో విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఇ, ఐరన్, జింక్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి జుట్టును మూలాల నుంచి బలంగా మార్చుతాయి. మునగాకు రసాన్ని కొబ్బరి నూనెలో కలిపి మరిగించి తలకు రాసుకోవాలి. ఇలా రాసుకోవడం వల్ల జుట్టు బాగా పెరుగుతుంది. మునగాకు రసం పోషకాలతో నిండి ఉంటుంది. ఈ రసాన్ని నేరుగా తలకు రాసుకుంటే జుట్టు రాలడం తగ్గుతుంది.
లేదంటే, మునగాకులను పేస్ట్ చేసి పెరుగులో కలిపి తలకు మాస్క్‌లా వేసుకోండి. ఇది జుట్టుకు తేమని అందిస్తుంది. దీంతో జుట్టు మూలాల నుంచి బలంగా మారుతుంది. మునగాకు రసంలో ఉసిరి రసం కలిపి తలకు రాసుకుంటే జుట్టు బాగా ఎదుగుతుంది. స్కాల్ప్ హెల్త్ కూడా మెరుగుపడుతుంది. మునగాకుని పొడి చేసి హెయిర్ ప్యాక్‌గా అప్లై చేసుకోండి. ఈ ప్యాక్ అప్లై చేయడం వల్ల జుట్టు బలంగా, మృదువుగా మారుతుంది.
మునగాకు పొడిలో తేనె కలిపి బాగా మిక్స్ చేయాలి. దీన్ని తలకు రాసుకుంటే జుట్టుకు కావాల్సిన పోషకాలు అందుతాయి. జుట్టు బాగా ఎదుగుతుంది. మునగాకు రసాన్ని ఖాళీ కడుపుతో తాగితే రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. దీంతో జుట్టు కుదుళ్లు బలంగా మారుతాయి. స్కాల్ప్ హెల్తీగా మారుతుంది. మునగాకు పేస్ట్‌లో నిమ్మరసం కలిపి పేస్ట్ తయారు చేయాలి. మునగాకు, నిమ్మరసం మాస్క్ కలిపి రాసుకుంటే చుండ్రు కూడా తగ్గుతుంది.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








