పండక్కి అందంగా, మచ్చలేని ముఖంతో మెరిసిపోవాలనుకుంటున్నారా..? ఇలా చేస్తే సింపుల్..!
దీపావళి పండగక్కి మీరు అందంగా మెరిసే చర్మంతో కనిపించాలనుకుంటున్నారా..? అయితే, ఇంట్లోనే కొన్ని సింపుల్ టిప్స్ పాటించటం ద్వారా మీరు కోరుకున్న అందాన్ని పొందుతారు. ఇందుకోసం రెండే రెండు పదార్థాలు ఉంటే సరిపోతుంది. అవేంటంటే.. ఒకటి నిమ్మకాయ, రెండు పెరుగు. అవును నిమ్మకాయ పెరుగుతో చర్మం మెరిసిపోయేలా చేసుకోవచ్చుని నిపుణులు చెబుతున్నారు. అదేలాగో ఇక్కడ చూద్దాం..

పండగ వేళ ప్రతి ఒక్కరూ మెరిసే, అందమైన చర్మంతో ఆకర్షణీయంగా కనిపంచాలని కోరుకుంటారు. అయితే ఎండ, అసమతుల్య ఆహారం కారణంగా చర్మపు రంగు అసమానంగా మారుతుంది. దీనికి ఒక సహజమైన పరిష్కారం ఉంది. దీని కోసం పెరుగు, నిమ్మకాయ ఉంటే సరిపోతుంది. పెరుగులో నిమ్మకాయ కలిపి చిక్కటి మిశ్రమం తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమంతో ముఖానికి ఫేస్ ప్యాక్ వేయటం ద్వారా ముఖం మీద మచ్చలు తొలగిపోతాయి. పెరుగులో లాక్టిక్ ఆమ్లం ఉంటుంది. ఇది మచ్చలను తగ్గించడంలో సాయపడుతుంది.
ఇందుకోసం ఒక గిన్నెలో రెండు చెంచాల పెరుగు తీసుకోండి. దానికి ఒక చెంచా నిమ్మరసం వేసి బాగా కలపండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి తేలికగా, మృదువుగా మసాజ్ చేయండి. పది నుంచి పదిహేను నిమిషాల పాటు అలాగే ఉంచండి. ఆ తర్వాత ముఖాన్ని నీటితో వాష్ చేసుకోండి. దీని వల్ల మచ్చలు, ముడతల సమస్య తొలగిపోతుంది. అంతేకాకుండా ముఖంలో గ్లో కూడా వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ ప్యాక్ వారానికి 2 నుంచి 3 సార్లు ఉపయోగించండి. మరింత ఎఫెక్టివ్‌గా ఉండాలనుకుంటే తేనెను కూడా ఉపయోగించవచ్చు.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది.)
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








