AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Monsoon Diet: వర్షాకాలంలో ఈ ఆహారాన్ని తింటే.. ఫుడ్ పాయిజన్ అయ్యే ప్రమాదం పొంచి ఉంది సుమా..

వర్షాకాలంలో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అయితే ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం కూడా ముఖ్యం. ఈ సీజన్‌లో ఫుడ్ పాయిజనింగ్ ప్రమాదం చాలా పెరుగుతుంది. అటువంటి పరిస్థితిలో వర్షాకాలంలో కొన్ని రకాల ఆహారపదార్థాలను తినవద్దు. ఎందుకంటే కొన్ని రకాల ఆహార పదార్ధాలను తినడం వలనా ఆరోగ్యానికి హానికరమ.

Monsoon Diet: వర్షాకాలంలో ఈ ఆహారాన్ని తింటే.. ఫుడ్ పాయిజన్ అయ్యే ప్రమాదం పొంచి ఉంది సుమా..
Monsoon Season
Surya Kala
|

Updated on: Jun 06, 2025 | 8:50 PM

Share

వర్షాకాలం ఆహ్లాదంగా, చల్లగా ఉంటుంది. అయితే ఈ కాలంలో ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఈ సమయంలో గాలిలో తేమ పెరుగుతుంది. ఇది బ్యాక్టీరియా , ఫంగస్ పెరుగుదల ప్రమాదాన్ని పెంచుతుంది. అందుకే వర్షాకాలంలో ఆహారం త్వరగా చెడిపోతుంది. ఫుడ్ పాయిజనింగ్, డయేరియా, టైఫాయిడ్, కలరా వంటి ఇన్ఫెక్షన్ల ప్రమాదం పెరుగుతుంది. ఈ సీజన్‌లో ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వర్షాకాలంలో కనిపించిన ప్రతిదీ తినడం సరైనది కాదు. కనుక వర్షాకాలంలో ఏ ఆహారపదార్ధాలను తినకూడదో నిపుణుల సలహా ఏమిటో తెలుసుకుందాం.. తద్వారా ఆరోగ్యంపై ఎటువంటి చెడు ప్రభావం ఉండదు. ఫుడ్ పాయిజనింగ్‌ను నివారించవచ్చు.

ఫుడ్ పాయిజనింగ్ అంటే ఏమిటి? ఫుడ్ పాయిజనింగ్ అనేది కలుషితమైన లేదా బ్యాక్టీరియా సోకిన ఆహారం లేదా నీటిని తీసుకోవడం వల్ల సంభవించే సాధారణ సమస్య. అదే సమయంలో ఇది తీవ్రమైన ఆరోగ్య సమస్య. ఇది సాధారణంగా వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి, జ్వరం, బలహీనత వంటి సమస్యలను కలిగిస్తుంది. వర్షాకాలం , వేసవి కాలంలో దీని ప్రమాదం మరింత పెరుగుతుంది. ఎందుకంటే తేమ, వేడి కారణంగా బ్యాక్టీరియా వేగంగా పెరుగుతుంది. దీనిని ఎలా నివారించాలో నిపుణులు చెప్పిన విషయాలు తెలుసుకుందాం.

నిపుణులు ఏమంటున్నారు? వర్షాకాలంలో వాతావరణం మారుతుందని, దీనివల్ల బ్యాక్టీరియా పెరిగే అవకాశాలు ఉంటాయని గంగారామ్ హాస్పిటల్ సీనియర్ డైటీషియన్ ఫరేహా షానమ్ అంటున్నారు. అటువంటి పరిస్థితిలో ప్రతి ఒక్కరూ తినే ఆహారం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. బయటి ఆహారం తినవద్దు. పండ్లు లేదా వండని ఆహారాలను, పచ్చి వస్తువులు వంటి వాటిని తినే సమయంలో జాగ్రత్త తీసుకోవాలి.

ఇవి కూడా చదవండి

ఫరేహా షానమ్ ఇంకా మాట్లాడుతూ స్ట్రీట్ ఫుడ్ కు దూరంగా ఉండాలి. ముఖ్యంగా పానీ పూరి, పుదీనా నీరు వంటి నీళ్ళు ఎక్కువగా ఉండేవి.. మారుతున్న వాతావరణంలో ఈ పదార్థాలు ఇన్ఫెక్షన్‌కు కారణమవుతాయి, దీనివల్ల చర్మ అలెర్జీలు కూడా వస్తాయి. వీలైతే వర్షాకాలంలో ఇంట్లో వండిన ఆహారాన్ని మాత్రమే తినాలని.. వీలైనంత వరకు నాన్-వెజ్‌కు దూరంగా ఉండాలని డైటీషియన్ ఫరేహా షానమ్ సూచించారు.

ఫుడ్ పాయిజనింగ్ అయినప్పుడు ఏమి తినాలి? త్రాగాలి? వర్షాకాలంలో మీకు లేదా ఇంట్లో ఎవరికైనా ఫుడ్ పాయిజన్ అయితే తినే ఆహారంలో కొన్ని విషయాలను చేర్చుకోవడం ద్వారా ఉపశమనం పొందవచ్చు. హెల్త్‌లైన్ ప్రకారం ఫుడ్ పాయిజనింగ్ వల్ల వాంతులు, విరేచనాల సమస్య ఏర్పడుతుంది. అప్పుడు శరీరంలో నీటి కొరత ఉంటుంది. శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడానికి ఎలక్ట్రోలైట్ , ద్రవ పదార్థాలను తీసుకోవాలి. దీనితో పాటు తక్కువ ఫైబర్, తక్కువ కొవ్వు ఉన్న ఆహారాన్ని తినాలి. బియ్యం, అరటిపండు, సాదా బంగాళాదుంపలు, ఓట్ మీల్ వంటి వాటిని తినే ఆహారంలో చేర్చుకోవాలి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..