AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వర్షాకాలంలో భారతదేశంలో చూడాల్సిన ఐదు అద్భుతమైన బీచ్‌లు ఇవే!

వర్షాకాలం వస్తే చాలా చాలా మంది పర్యాటకులు ఎంజాయ్ చేయడానికి పొగ మంచుతో కూడిన పర్వతాలు, లేదా పచ్చటి ప్రకృతి ఉన్న ప్రదేశాలకు వెళ్లి ఎంజాయ్ చేయాలని అనుకుంటారు. కానీ వర్షాకాలంలో పైన నీలి ఆకాశం, కింద ఇసుక తెన్నెలు , ఎగిసిపడే అలలు, చిన్న చిన్న చిరుజల్లుల మధ్య ఎంజాయ్ చేస్తే ఆ ఆనందమే వేరే లెవల్ ఉంటుందంట. అందుకే తప్పకుండా వర్షాకాలంలో బీచ్ కు వెళ్లాలంట. అయితే వానాకాలంలో భారత దేశంలో తప్పక సందర్శించవలసిన బెస్ట్ బీచ్‌లు ఏవో ఇప్పుడు చూద్దాం.

Samatha J
|

Updated on: Jun 06, 2025 | 9:08 PM

Share
పలోలెం బీచ్ ఇది గోవాలో ఉన్న అతి సుందరమైన బీచ్. ఇక్కడి ప్రదేశం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుందంట. అంతే కాకుండా వర్షాకాలంలో ఇక్కడ జనసాంధ్రత చాలా తక్కువ ఉంటుందంట. దీంతో కొబ్బరి చెట్లు, చిరు జల్లుల మధ్య ఇక్కడ చాలా ఆనందంగా స్నేహితులతో ఎంజాయ్ చేవచ్చునంట. అందుకే తప్పకుండా వానాకాలంలో గోవాలోని పలోలెం బీచ్ చూడాల్సిందేనంట.

1 / 5
కేరళ ట్రిప్ అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు మీరే చెప్పండి. అందమైన టూరిస్ట్ ప్లేసెస్ లో కేరళ ముందుంటుంది. అయితే కేరళలోని ఎర్రటి కొండల పై ఉన్న వర్కాల బీచ్ వర్షాకాలంలో చూడటానికి చాలా అద్భుతమైన ప్రదేశం అంట. కొబ్బరి చెట్లు, చల్లటి వాతావరణం, ఎర్రటి కొండల మధ్య ఎంజాయ్ చేయాలి అనుకునే వారికి ఇది బెస్ట్ ప్లేస్ అంట.

2 / 5
కేరళలోని ఈ బీచ్ కాకుండా వర్షాకాలంలో చూడాల్సిన మరో బీచ్ కూడా ఉన్నదంట. అదే కోవలం బీచ్. లైట్ హౌస్, అలాగే అర్ధ చంద్రాకార తీర ప్రాతంతో ఉండే అద్భుతమైన తీర ప్రదేశాలలో ఇదొక్కటి. వర్షాకాలంలో ఈ బీచ్ చూడటానికి రెండు కళ్లు చాలవంట. అందుకే దక్షిణ భారతదేశంలో ఉన్న అందమైన బీచ్ లలో ఈ కోవలం బీచ్ ఒకటి కాబట్టి తప్పకుండా వర్షాకాలంలో ఇక్కడికి వెళ్లాలంట.

3 / 5
హైదరాబాద్ కు చాలా దగ్గరగా ఉండే బీచ్‌లలో కర్ణాటకలో ని కుడ్లే బీచ్ ఒకటి. ఇది చూడటానికి సీ ఆకారంలో ఉంటుంది. ఇక్కడ చుట్టూ కొబ్బరి చెట్లు, ఉత్కంఠభరితమైన సూర్యోదయం, సూర్యస్తమయానికి ప్రసిద్ధఇ చెందినది. అందుకే వర్షాకాలంలో ఎంజాయ్ చేయాలి అనుకున్నవారు తప్పకుండా కర్ణాటకలోని కుడ్లే బీచ్ కు వెళ్లాల్సిందే అంటున్నారు టూరిస్ట్‌లు.

4 / 5
శివాలయానికి చాలా దగ్గర ఉండే బీచ్ అంటే అందరికీ టక్కున గుర్తు వచ్చేది మహారాష్ఠ్రలోని వెల్నేశ్వర్ బీచ్. వర్షాకాలంలో ఈ బీచ్ చాలా ప్రశాంతంగా ఉండటమే కాకుండా చూడటానికి కూడా చాలా బాగుంటుందంట. అందుకే వానాకాలంలో తప్పకుండా ఈ బీచ్ చూడాలంట.

5 / 5