AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Moringa Seeds: ఒత్తైన, మెరిసే జుట్టు కావాలా.. మునగ విత్తనాలు ట్రై చేయండి.. ఎలా ఉపయోగించాలంటే..

మునగాకు మునగ కాయ, మునగపుప్వ్వులో మాత్రమే కాదు మునగ విత్తనాల్లో కూడా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా జుట్టు పెరిగేందుకు మునగ విత్తనాలు ఎంతగానో ఉపయోగపడతాయి. జుట్టు పెరుగుదల కోసం రసాయనాలతో నిండిన ఉత్పత్తులతో విసిగిపోయివారు జుట్టు పెరుగుదల కోసం మునగ గింజలను ఉపయోగించండి. పురాతన ఆయుర్వేదంలో వీటిని జుట్టు పెరుగుదల కోసం ఉపయోగించేవారు. ఈ రోజు ఎలా వాటిని ఉపయోగించాలో తెలుసుకుందాం..

Moringa Seeds:  ఒత్తైన, మెరిసే జుట్టు కావాలా.. మునగ విత్తనాలు ట్రై చేయండి.. ఎలా ఉపయోగించాలంటే..
Moringa Seeds
Surya Kala
|

Updated on: Jun 06, 2025 | 8:32 PM

Share

మునగ గింజలలో కూడా పోషకాలు సమృద్ధిగా ఉన్నాయి. ఇవి జుట్టుకు అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తాయి. వీటిల్లో జింక్, ఐరన్, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్లు A, E , C లు అధికంగా ఉన్నాయి. ఇవన్నీ ఆరోగ్యకరమైన జుట్టు, బలమైన జుట్టు కుదుళ్లకు కీలకమైనవి. జింక్ జుట్టు కుదుళ్ల మరమ్మత్తును చేస్తుంది. ఐరెన్ తల చర్మంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఒమేగా-3లు జుట్టు పొడిబారడం తగ్గిస్తుంది. ఈ పోషకాలు కలిపి జుట్టు పెరుగుదలను ప్రేరేపిస్తాయి. జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. సహజమైన మెరుపును ఇస్తాయి. మీరు సహజంగా జుట్టును పెంచుకోవాలంటే మునగ గింజలను ట్రై చేయండి.

​మోరింగ సీడ్ ఆయిల్ స్కాల్ప్ మసాజ్: మునగ గింజలు నూనె రూపంలో కూడా దొరుకుతుంది. ఇది జుట్టుకు అత్యంత ప్రభావవంతమైన నూనె. మునగ గింజల నూనె తేలికైనది, జిడ్డు లేనిది, యాంటీఆక్సిడెంట్లు, పోషకాలతో నిండి ఉంది.

ఈ నూనెను ఎలా ఉపయోగించాలంటే రెండు టేబుల్ స్పూన్ల మునగ గింజల నూనెను వేడి చేయండి. జుట్టును విభాగాలుగా విడదీసి, నేరుగా నూనెను తలకు అప్లై చేయండి. రక్త ప్రసరణను పెంచడానికి 5-10 నిమిషాలు వృత్తాకారంగా సున్నితంగా మసాజ్ చేయండి. కనీసం 1 గంట లేదా రాత్రంతా అలాగే ఈ నూనెని ఉంచండి. తర్వాత తేలికపాటి షాంపూతో జుట్టుని శుభ్రం చేసుకోండి. ఇలా వారానికి రెండు సార్లు చేయడం వలన జుట్టు మందంగా ఒత్తుగా పెరుగుతుంది.

ఇవి కూడా చదవండి

మునగ గింజల హెయిర్ మాస్క్: మునగ గింజల పొడిని ఉపయోగించడం వల్ల నిస్తేజంగా, పెళుసుగా ఉండే జుట్టు కుదుళ్ళను పునరుద్ధరించవచ్చు. జుట్టులోని తేమ సమతుల్యతను పునరుద్ధరించవచ్చు.

ఎలా ఉపయోగించాలంటే .. 2 టేబుల్ స్పూన్ల మునగ గింజల పొడి, 1 టేబుల్ స్పూన్ కలబంద జెల్ లేదా పెరుగు, 1 టేబుల్ స్పూన్ తేనె తీసుకుని దీనిలో కొన్ని చుక్కల రోజ్మేరీ ఎసెన్షియల్ ఆయిల్ వేసుకుని వీటన్నిటిని మెత్తని పేస్ట్‌లా కలపండి. ఈ మిశ్రమాన్ని తలకు.. జుట్టు పొడవునా సమానంగా అప్లై చేయండి. తర్వాత 30-45 నిమిషాలు అలాగే ఉంచండి. అనంతరం జుట్టుని చల్లటి నీరు, తేలికపాటి షాంపూతో శుభ్రం చేసుకోండి. ఈ మాస్క్ పొడిబారిన తలకు ఉపశమనం కలిగిస్తుంది. జుట్టు కుదుర్లను బలపరుస్తుంది. జుట్టు ఊడిపోకుండా నిరోధిస్తుంది. జుట్టు పల్చబడటంతో ఇబ్బంది పడుతున్నవారికీ ఇది బెస్ట్ టిప్.

మునగ గింజలు తినండి.. తినే ఆహారం కూడా జుట్టు పెరుగుదలను ప్రభావితం చేస్తుంది. మునగ గింజలు తినడం వలన శరీరం లోపలి నుంచి పోషణ లభించి జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

ఎలా తినాలంటే.. ఖాళీ కడుపుతో ప్రతిరోజూ 1-2 విత్తనాలతో ప్రారంభించండి. వాటిని పచ్చిగా తినండి లేదా గోరువెచ్చని నీటితో వేసుకుని తెసుకోండి. అంతేకాదు మునగ విత్తనాలను చూర్ణం చేసి స్మూతీలు, సూప్‌లు లేదా సలాడ్‌లకు కూడా జోడించవచ్చు. ఇలా తీసుకోవడం వలన కాలక్రమేణా పోషకాల శోషణ, హార్మోన్ల సమతుల్యత , రక్త ప్రసరణను పెంచుతుంది,ఇవన్నీ జుట్టు పెరుగుదలకు కీలకమైనవి.

హెచ్చరిక: మునగ గింజలు శక్తివంతమైనవి. తక్కువ పరిమాణంలో ప్రారంభించే మందు వైద్యుడిని సంప్రదించండి, ముఖ్యంగా గర్భవతి లేదా మందులు తీసుకునేవారు తప్పని సరిగా వైద్య సలహా తీసుకోవాలి.

జుట్టు పెరుగుదల కోసం ఎలా జుట్టు సంరక్షణ దినచర్యలో భాగంగా మునగ గింజలను చేర్చుకోవడం వలన బలమైన, ఆరోగ్యకరమైన జుట్టును పొందడానికి సహజమైన, ఖర్చుతో కూడుకున్న మార్గం. మునగ గింజల నూనెను రాసుకున్నా, మాస్క్ తయారు చేసుకున్నా, స్మూతీలుగా తీసుకున్నా ఫలితం కనిపించాలంటే విడవకుండా 4-6 వారాల ఉపయోగించాలీ. అప్పుడే తగిన ఫలితం కనిపిస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)