AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీరు శాఖాహారులా.. ఈ కూరగాయలను తినే ఆహారంలో చేర్చుకోండి.. బలహీనమైన ఎముకలకు జీవం

ప్రోటీన్ శరీరానికి అవసరమైన పోషకం. ఇది ఎముకలను బలోపేతం చేస్తుంది. కండరాలను పెంచడంలో కూడా సహాయపడుతుంది. ఎక్కువ ప్రోటీన్ మాంసం, చేపలు, గుడ్లు. పాల ఉత్పత్తులలో లభిస్తుంది. అయితే శాఖాహారులకు ప్రోటీన్ లభించాలంటే ప్రోటీన్ ఉండే ఉత్తమమైన కూరగాయలున్నాయి. వీటిని తినే ఆహారంలో చేర్చుకోవడం వలన శరీరానికి తగినంత ప్రోటీన్ లభిస్తుంది. ఈ కూరగాయలు ఏమిటో తెలుసుకుందాం..

మీరు శాఖాహారులా.. ఈ కూరగాయలను తినే ఆహారంలో చేర్చుకోండి.. బలహీనమైన ఎముకలకు జీవం
ప్రోటీన్ లోపం మొదటి సంకేతం వాపు. చేతులు, కాళ్ళు లేదా పొత్తికడుపులో వాపు కనిపించవచ్చు. ప్రోటీన్ రక్తంలోని ద్రవాన్ని సమతుల్యంగా ఉంచుతుంది. దాని లోపం ఉన్నప్పుడు, కణజాలాలలో నీరు పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. శరీరం ఉబ్బుతుంది. ప్రోటీన్ కండరాలను నిర్మించడమే కాకుండా, మెదడును కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇందులో ఉండే అమైనో ఆమ్లాలు మెదడు రసాయనాలను (డోపమైన్, సెరోటోనిన్ వంటివి) తయారు చేయడంలో సహాయపడతాయి. వీటిలో లోపం ఉంటే, ఒక వ్యక్తి చిరాకు, విచారం, నిరాశకు గురవుతాడు.
Surya Kala
|

Updated on: Jun 06, 2025 | 6:17 PM

Share

ప్రస్తుతం ప్రజలకు ఆరోగ్యం, ఫిట్‌నెస్ గురించి అవగాహన రోజు రోజుకీ పెరుగుతుంది. దీంతో తాము తినే ఆహారంలో రకరకాల పోషకాలను చేర్చుకుంటున్నారు. వీటిల్లో ఒకటి ప్రోటీన్. అయితే చాలా మంది ప్రోటీన్ గుడ్లు, మాంసం వంటి నాన్ వెజ్ ఆహార పదార్ధాలతో పాటు పాలు, పాల ఉత్పత్తుల నుంచి మాత్రమే ప్రోటీన్ లభిస్తుందని నమ్ముతారు. ముఖ్యంగా శాఖాహారులు తరచుగా తమకు తగినంత ప్రోటీన్ లభించడం లేదని భావిస్తున్నారు. అయితే ప్రోటీన్ లభించే అద్భుతమైన కొన్ని కూరగాయలు ఉన్నాయి.

మన శరీరం మరమ్మత్తు, పెరుగుదలకు ప్రోటీన్ చాలా ముఖ్యమైన పోషకం. ఇది కండరాలను నిర్మించడంలో, రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో, ఎముకలను బలోపేతం చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఎవరికైనా కండరాల బలహీనత, కీళ్ల నొప్పులు లేదా ఎముక బలహీనత వంటి ఇబ్బందులు ఉంటే.. అప్పుడు ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం చాలా ముఖ్యమైనది. కనుక గుడ్ల కంటే ఎక్కువ ప్రోటీన్‌ను అందించి.. ఎముకలను బలంగా చేసే పోషకాహార కూరగాయల గురించి తెలుసుకుందాం.

బ్రోకలీ బ్రోకలీని సూపర్ ఫుడ్ గా పరిగణిస్తారు. ఇందులో యాంటీఆక్సిడెంట్లు , ఫైబర్ మాత్రమే కాదు ప్రోటీన్ కూడా పుష్కలంగా ఉంటుంది. 100 గ్రాముల బ్రోకలీలో దాదాపు 2.5 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. ఎముకలను బలోపేతం చేయడానికి అవసరమైన విటమిన్ కె , కాల్షియం కూడా ఇందులో పుష్కలంగా ఉన్నాయి. కనుక దీనిని తినే ఆహారంలో చేర్చుకోండి.

ఇవి కూడా చదవండి

పచ్చి బఠానీలు ఒక కప్పు ఉడికించిన పచ్చి బఠానీలలో దాదాపు 8.58 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇది గుడ్డు కంటే ఎక్కువ. దీనితో పాటు పచ్చి బఠానీలు విటమిన్ సి, ఐరన్ , ఫైబర్ లకు మంచి మూలం. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడమే కాదు.. ఎముకలను బలోపేతం చేయడంలో కూడా సహాయపడుతుంది.

పాలకూర పాలకూర ఐరెన్ అధికంగా ఉండే మంచి వనరుగా పరిగణించబడుతుంది. అయితే ఇందులో అధిక మొత్తంలో ప్రోటీన్ కూడా ఉంది. ఒక కప్పు వండిన పాలకూరలో దాదాపు 6 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇందులో ఉండే విటమిన్లు A, C , K ఎముకలు, చర్మానికి ప్రయోజనకరంగా ఉంటాయి.

బ్రస్సెల్స్ మొలకలు చిన్న క్యాబేజీలా కనిపించే బ్రస్సెల్స్ మొలకలు పోషకాలతో నిండి ఉన్నాయి. వీటిలో 100 గ్రాములకు దాదాపు 3.4 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. అవి ఎముకల బలాన్ని పెంచడంలో మంటను తగ్గించడంలో, శరీరాన్ని నిర్విషీకరణ చేయడంలో సహాయపడతాయి.

గ్రీన్ బీన్స్ గ్రీన్ బీన్స్ రుచికరంగా ఉండటమే కాదు పోషకాలతో నిండి ఉంటుంది. హెల్త్‌లైన్ ప్రకారం ఒక కప్పు తరిగిన బీన్స్‌లో దాదాపు 2.7 గ్రాముల ఫైబర్ ఉంటుంది. దీనితో పాటు, ఒక కప్పు గ్రీన్ బీన్స్‌లో దాదాపు 2 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఈ బీన్స్ కాల్షియం, పొటాషియం ,ఫైబర్ మంచి మూలం. ఇవి ఎముకలు, జీర్ణక్రియ రెండింటికీ ప్రయోజనకరంగా ఉంటాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)