AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Natural Pigeon Repellent: బాల్కనీలో పావురాలు తిష్ట వేశాయా.. దుమ్ము దుర్వాసనం నుంచి ఉపశమం కోసం ఈ మొక్కలు పెంచుకోండి..

పావురాలు అందమైన పక్షులే.. అయితే ఇంటి పరిశరాలలో ముఖ్యంగా బాల్కనీలో పావురాలు రెట్టలు ధూళిని వ్యాపింపజేయడం.. వాటి నుంచి వచ్చే దుర్వాసన ఇబ్బంది కలిగిస్తుంది. ఈ పావురాల రెట్టల వలన అనేక ఆరోగ్య సమస్యలు కూడా కలుగుతాయని తెలిసిందే. అటువంటి పరిస్థితిలో.. పావురాలు బాల్కనీలోకి రాకుండా ఉండేందుకు.. కొన్ని మొక్కలను పెంచుకోవచ్చు. ఈ మొక్కలు పావురాల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

Natural Pigeon Repellent: బాల్కనీలో పావురాలు తిష్ట వేశాయా.. దుమ్ము దుర్వాసనం నుంచి ఉపశమం కోసం ఈ మొక్కలు పెంచుకోండి..
Natural Pigeon Repellent
Surya Kala
|

Updated on: Jun 06, 2025 | 5:46 PM

Share

బాల్కనీ అనేది ఇంట్లోని ఒక భాగం. ఇక్కడ మొక్కలు పెంచుకోవడం ఆహ్లాదకరమైన వాతావరణంలో కూర్చుని ప్రశాంతంగా గడపడానికి.. సాయంత్రం టీ తాగడానికి ఇష్టపడతారు. అందుకనే తరచుగా బాల్కనీని అందంగా అలంకరించడానికి చాలా ఇష్టపడతారు. బాల్కనీలోకి పావురాలు రావడం మొదలు పెట్టినప్పుడు.. అక్కడ దుమ్ము, ధూళి చేరుకుంటుంది. అంతేకాదు పావురాల రెట్టలతో దుర్వాసన కారణంగా అక్కడ కూర్చోవాలని అనిపించదు. అటువంటి పరిస్థితిలో.. పావురాలను లేదా మరే ఇతర పక్షికి హాని కలగకుండా వాటిని ఎలా బాల్కనీలోకి రాకుండా చేయాలా అని ఆలోచిస్తారు.

పావురాలు బాల్కనీలోకి రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే

చాలా మంది పావురాల వల్ల ఇబ్బంది పడుతుండటంతో వలలు ఏర్పాటు చేసుకుంటారు. అదే సమయంలో.. కొంతమంది వలలు ఏర్పాటు చేసుకోవడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఇది బాల్కనీ అందాన్ని తగ్గిస్తుంది. అటువంటి పరిస్థితిలో పావురాల రెట్టల, నుంచి పావురాల కూతలను వదిలించుకోవడానికి కొన్ని మొక్కలను బాల్కనీలోని పెంచుకోవచ్చు. ముఖ్యంగా ఈ మూడు మొక్కలను పెంచుకోవడం వలన పావురాల రాక నుంచిఉపశమనం పొందవచ్చు. ఆ మొక్కలు ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం.

రోజ్మేరీ

మీ బాల్కనీ పావురాల రెట్టల నుంచి దూరంగా .. శుభ్రంగా ఉండాలంటే.. బాల్కనీలో రోజ్మేరీ మొక్కను పెంచుకోండి. పుదీనా కుటుంబానికి చెందిన రోజ్ మేరీ మొక్క సువాసన చాలా ఘాటుగా, బలంగా ఉంటుంది. ఈ మొక్క నుంచి వెలువడే వాసన కారణంగా బాల్కనీలోకి రావడం మానేస్తాయి. దీంతో పావురాల బెడద ఉండదు.

ఇవి కూడా చదవండి

లావెండర్

బాల్కనీలో ఫ్యామిలీ పెట్టేసి.. తమ రెట్టలతో బల్కనీని అపరిశుభ్రనికి కేరావ్ అడ్రస్ గా మార్చేసిన పావురాల నుంచి ఉపశమనం కోసం లావెండర్ మొక్క కూడా పెంచుకోవచ్చు. ఇది కూడా పుదీనా కుటుంబానికి చెందినదే. కనుక ఈ లావెండర్ నుంచి వచ్చే మంచి వాసన మనల్ని కట్టుకున్నా.. ఆ స్మెల్ పావురాలకు ఇష్టం ఉండదు. కనుక తరచుగా పావురాలు మీ బాల్కనీని తరచుగా సందర్శిస్తుంటే.. లావెండర్ మొక్కను పెంచుకోండి.

నిమ్మకాయ

నిమ్మ సువాసన పావురాలను మాత్రమే కాకుండా ఈగలు మరియు దోమలను కూడా దూరంగా ఉంచుతుంది. దీని సువాసన చాలా బలంగా ఉంటుంది. ఈ నిమ్మ మొక్కను బాల్కనీలో నాటడం ద్వారా పావురాల కూత నుంచి ఉపశమనం పొందవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)