AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mars Transit: మరికొన్ని గంటల్లో సింహరాశిలోకి కుజుడు.. మొత్తం 12రాశులపై ప్రభావం.. పరిహారాలు ఏమిటంటే..

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మరికొన్ని గంటల్లో కుజుడు తన రాశిని మార్చుకోనున్నాడు. ఈ మార్పు ప్రభావం అన్ని రాశులపై పడనుంది. కొన్ని రాశులకు వృత్తి , ఆర్థిక ప్రయోజనాలను ఇస్తుంది. అయితే ఈ కుజ సంచారం వలన కొన్ని రాశులకు చెందిన వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. తగిన పరిహారాలు చేయాలి. ఇలా చేయడం వలన కుజుని సంచారంతో అపార లాభాలను పొందుతారు.

Mars Transit: మరికొన్ని గంటల్లో సింహరాశిలోకి కుజుడు.. మొత్తం 12రాశులపై ప్రభావం.. పరిహారాలు ఏమిటంటే..
Mars Transit In Leo
Surya Kala
|

Updated on: Jun 06, 2025 | 3:34 PM

Share

నవగ్రహాలలో కుజ గ్రహానికి ప్రత్యేక స్థానం ఉంది. కుజుడిని ధైర్యం, శౌర్యం మరియు శక్తికి చిహ్నంగా భావిస్తారు. ఈ కుజుడు మరికొన్ని గంటల్లో సింహరాశిలోకి అడుగు పెట్టనున్నాడు. ఈ కుజ సంచారము జూన్ 7వ తేదీ, 2025న తెల్లవారుజామున 2:10 గంటలకు జరుగుతుంది. ఇదే రాశిలో జూలై 28 వరకు ఉండనున్నాడు. ఈ సంచారం వలన అన్ని రాశులపై ప్రభావం చూపిస్తుంది. అంతేకాదు జాతకంలోని ప్రత్యేక గృహాలను ప్రభావితం చేస్తుంది. తాత్కాలికంగా మంగళిక యోగాను కూడా సక్రియం చేస్తుంది.

ఎవరైనా వివాహం చేసుకోవాలని ఆలోచిస్తున్నా.. లేదా ఇప్పటికే వివాహం చేసుకున్నా.. మీది, మీ భాగస్వామి జాతకంలో కుజ గ్రహం స్థానాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాలి. అయితే కుజ సంచారం వలన ఏ రాశిపై ఎలాంటి ప్రభావం చూపుతుంది.. దానిని నివారించడానికి లేదా ప్రయోజనాలను పొందడానికి ఏ చర్యలు తీసుకోవాలో తెలుసుకుందాం..

  1. మేషరాశి కుజుడు ఐదవ ఇంట్లో ఉంటాడు. ఈ ఇల్లు పిల్లలు, తెలివితేటలు,ప్రేమకు సంబంధించినది. ఈ రాశివారు పిల్లల వలన ఆనందాన్ని పొందుతారు. మేధో వికాసం జరుగుతుంది. వైవాహిక జీవితం మధురంగా ​​ఉంటుంది. పరిహారం : రాత్రి సమయంలో మీ తల దగ్గర నీరు ఉంచుకొండి. చిన్న పిల్లలకు పాలు ఇవ్వండి.
  2. వృషభ రాశి ఇల్లు, ఆస్తి, తల్లికి సంబంధించిన నాల్గవ ఇంట్లోకి కుజుడు ప్రవేశిస్తాడు. ఇల్లు, వాహనం కొనుగోలు చేయాలనుకునేవారి కోరిక ఫలిస్తుంది. అయితే వీరికి తాత్కాలిక మంగళ దోషం కూడా ఏర్పడుతుంది. పరిహారం : ఉదయం నిద్రలేచిన తర్వాత మర్రి చెట్టుకి తీపి పాలు సమర్పించండి.
  3. ఇవి కూడా చదవండి
  4. మిథున రాశి మూడవ ఇంట్లో సంచారము వీరికి ధైర్యాన్ని, తోబుట్టువులతో సంబంధాన్ని బలోపేతం చేస్తుంది. మీరు శక్తితో నిండి ఉంటారు. అంతేకాదు ఈ రాశికి చెందిన వ్యక్తులు అత్తమామల నుంచి ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. పరిహారం : మంగళవారం హనుమంతుడి ఆలయంలో పప్పుధాన్యాలు , బెల్లం నైవేద్యం పెట్టండి.
  5. కర్కాటక రాశి రెండవ ఇంట్లో కుజుడు సంచారము వలన వీరికి ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయి. అయితే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. సోదరులతో మంచి సంబంధాలు కొనసాగించండి. పరిహారం : ఉదయం ఇంటి పెద్దవారైన మహిళనుంచి ఆశీర్వాదం తీసుకోండి.
  6. సింహ రాశి కుజుడు వీరి లగ్న (మొదటి) ఇంట్లో ఉంటాడు. కనుక ఈ రాశివారు కెరీర్‌లో ప్రయోజనం పొందుతారు. అయితే ఈ కుజ సంచారము వీరికి తాత్కాలికంగా మంగళకరం చేస్తుంది. పరిహారం : ఆలయంలో కర్పూరం లేదా పెరుగు దానం చేయండి.
  7. కన్య రాశి పన్నెండవ ఇంట్లో సంచారము ఖర్చులు పెరుగుతాయి. విదేశీ సంబంధాలను పెంచుతుంది. మీరు లైంగిక ఆనందం పొందుతారు. అయితే మంగళ దోషం పట్ల జాగ్రత్తగా ఉండండి. పరిహారం : హనుమాన్ ఆలయంలో స్వీట్లు నైవేద్యం పెట్టి ప్రసాదాన్ని పంచి పెట్టండి.
  8. తులా రాశి పదకొండవ ఇంట్లో కుజుడు మీ కోరికలను నెరవేరుస్తాడు. ఆర్థిక ప్రయోజనాలను తెస్తాడు. తల్లిదండ్రులు కూడా ప్రయోజనం పొందుతారు. పరిహారం : అవసరమైన వారికి బట్టలు దానం చేయండి.
  9. వృశ్చిక రాశి పదవ ఇంట్లో కుజుడు ఉండటం వలన కెరీర్ కు ఊతం లభిస్తుంది. తండ్రి పరిస్థితి మెరుగుపడుతుంది. ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్నవారికి ప్రమోషన్ లభిస్తుంది. పరిహారం : పాలు మరిగేటప్పుడు పాత్ర నుంచి పాలు బయటకు పోనివ్వకండి. పిల్లలు లేని వారికి సహాయం చేయండి.
  10. ధనుస్సు రాశి తొమ్మిదవ ఇంట్లో కుజుడు ఉండటం వల్ల వీరి అదృష్టం బలపడుతుంది. వీరికి సోదరుడి నుండి మీకు మద్దతు లభిస్తుంది. ఉన్నత పదవిని సాధించడం సాధ్యమవుతుంది.\ పరిహారం : సోదరులకు సహాయం చేయండి.
  11. మకర రాశి: ఎనిమిదవ ఇంట్లో సంచారము దాచిన అడ్డంకులను కలిగిస్తుంది. వాహనం నడుపుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి. తాత్కాలికంగా మంగళిక యోగం ఏర్పడుతుంది. పరిహారం : ఆలయంలో పప్పుధాన్యాలను దానం చేయండి.
  12. కుంభ రాశి ఏడవ ఇంట్లో కుజుడు ఉండటం వలన వైవాహిక జీవితంలో స్వల్ప ఆటంకాలు ఏర్పడవచ్చు. మంగళ దోషం తాత్కాలికంగా తొలగిపోతుంది. పరిహారం : అత్త లేదా సోదరికి ఎరుపు రంగు దుస్తులు బహుమతిగా ఇవ్వండి. చిన్నారులకు స్వీట్లు పంచండి.
  13. మీన రాశి ఆరవ ఇంట్లో కుజుడు ఉండటం వలన వీరు శత్రువులపై విజయం సాధిస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది. పరిహారం : మంగళవారం మీ సోదరుడికి బహుమతి ఇవ్వండి. స్నేహితులకు ఉప్పు ఉన్న వస్తువులను ఇవ్వడం శుభప్రదం

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు