Khatu Shyam Ji Temple: పాండవుల వారసుడు తలకి రాజస్తాన్ లో పూజలు.. దేహాన్ని ఎక్కడ పూజిస్తారో తెలుసా..
ఖాతు శ్యామ్ జీ హిందువుల నమ్మకం ప్రకారం ద్వాపరయుగానికి సంబంధించిన వ్యక్తి. పాండవుల వారసుడు. ఖాతు శ్యామ్ జీ పూర్వం బార్బరిక్ అని పిలిచేవారు. భీముని మనవడు, ఘటోత్కచుని ముగ్గురు కుమారులలో పెద్దవాడు. కురుక్షేత్ర యుద్ధానికి ముందు చేసిన గొప్ప త్యాగానికి సంతోషించి శ్రీ కృష్ణుడు ద్వాపర యుగం అంతమై.. కలియుగం మొదలైన సమయంలో బార్పరిక్ ..శ్యామ్ పేరుతో పూజించబడతాడని వరం ఇచ్చాడు. అయితే ఓడిపోయిన వారికి మద్దతునిచ్చే బాబా ఖాతు శ్యామ్ జీ ఆలయం రాజస్థాన్‌లోని సికార్‌లో ఉంది. ఇక్కడ బాబా తల పూజించబడుతుంది. అయితే ఖాతు శ్యామ్ జీ శరీరాన్ని ఎక్కడ పూజిస్తారో మీకు తెలుసా?

ఖాతు శ్యామ్ జీ ఆలయం మహాభారత కాలానికి సంబంధించినది. అతను మహాబలవంతుడైన భీముని మనవడు. ఘటోత్కచుని కుమారుడు. అతని పేరు బార్బారిక్. తన బాల్యంలోనే శక్తి దేవిని పూజించాడని.. అమ్మవారిని ప్రసన్నం చేసుకుని అభేద్యమైన బాణాలను పొందాడని.. దీంతో బార్బారిక్ బనాధారి అని పిలువబడ్డాడని చెబుతారు. శ్రీ ఖతు శ్యామ్ జీ భారతదేశంలోని రాజస్థాన్ రాష్ట్రంలోని సికార్ జిల్లాలో ఉన్నఒక ప్రసిద్ధ గ్రామం. ఇక్కడ ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఖాతు శ్యామ్ జీ దేవాలయం. ఈ ఆలయం సుమారు 1000 సంవత్సరాల పురాతనమైనది. 1720లో అభయ్ సింగ్ జీచే పునర్నిర్మించబడింది. ఖాతు శ్యామ్ జీ దర్శనం కోసం భక్తులు సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తారు. ఈ ఆలయంలో బాబా తల మాత్రమే ఉంది. అయితే భారతదేశంలో ఆయన శరీరాన్ని కూడా పూర్తి భక్తితో పూజించే ఒక ప్రదేశం ఉంది. ఆ ఆలయం ఎక్కడ ఉందో తెలుసుకుందాం..
ఖాతు శ్యామ్ జీ మొండెం ఎక్కడ ఉంది?
హర్యానాలోని హిస్సార్ జిల్లాలోని సియాహద్వా అనే చిన్న గ్రామంలో బార్బారిక్ మృతదేహానికి పూజలు చేస్తున్నారు. ఇక్కడ అతని మొండెం పూజించబడుతుంది. బార్బరిక్ తన తలను దానం చేసిన ప్రదేశం ఇదేనని చెబుతారు. ఇది ఖాతు శ్యామ్ జీ ఆలయం పేరుతో ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయాన్ని సందర్శించడానికి భక్తులు భారీ సంఖ్యలో వస్తారు. ఈ ఆలయాన్ని సందర్శించడం ద్వారా భక్తుల అన్ని కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు.
ఓడిపోయే వారికి మద్దతు?
బార్బరిక్ చాలా శక్తివంతమైన యోధుడు. మహాభారత యుద్ధంలో పాల్గొనాలనే తన కోరికను తన తల్లి అహిల్వతికి వ్యక్తం చేశాడు. తల్లి అనుమతి ఇచ్చిన తర్వాత యుద్ధంలో ఎవరికి మద్దతు ఇవ్వాలి అని అతను ఆమెను అడిగాడు? అప్పుడు బార్బారిక్ తల్లి, పాండవుల పక్షం బలహీనంగా ఉందని భావించి.. ఓడిపోతున్న వారికి నువ్వు మద్దతుగా నిలబడాలని బార్బారిక్‌తో చెప్పింది.
తన తల్లికి మాట ఇచ్చిన తర్వాత.. బార్బారిక్ యుద్ధభూమి వైపు బయలుదేరాడు. బార్బరిక్ శక్తులు, అతని ప్రతిజ్ఞ గురించి శ్రీకృష్ణుడికి తెలుసు. అంతేకాదు ఓడిపోయే వారికి మద్దతునివ్వడం అంటే.. కౌరవులలు కనుక వారికి బార్బరిక్ మద్దతునిస్తే పాండవులు గెలవడం కష్టమని శ్రీ కృష్ణుడికి తెలుసు.
తన తలను దానం చేసిన బార్బరిక్
బార్బరిక్ ఈ యుద్ధంలో పాల్గొనడానికి వస్తున్నాడని శ్రీకృష్ణుడు తెలుసుకున్న తర్వాత యుద్ధంలో ఓడిపోయే పక్షానికి బార్బరిక్ మద్దతు ఇస్తాడని తెలిసి ఆందోళన చెందాడు. అప్పుడు శ్రీ కృష్ణుడు తన దౌత్యం ద్వారా బార్బరిక్ ను తన తలని దానంగా కోరగా బార్బరిక్ తన కత్తిని తీసి శ్రీ కృష్ణుడికి తన తలను అర్పించాడు. బార్బరిక్ త్యాగాన్ని చూసి చలించిన శ్రీ కృష్ణుడు కలియుగంలో బార్బరిక్‌ను తన పేరు మీద ఖాతు శ్యామ్ గా పూజలను అందుకుంటాడని వరం ఇచ్చాడు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు