AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఐదేళ్లుగా డస్ట్‌బిన్ వాడని కుటుంబం.. ఎలా మేనేజ్‌ చేస్తున్నారంటే

ఐదేళ్లుగా డస్ట్‌బిన్ వాడని కుటుంబం.. ఎలా మేనేజ్‌ చేస్తున్నారంటే

Phani CH
|

Updated on: Jun 06, 2025 | 6:29 PM

Share

ఐదేళ్లుగా ముంబయిలోని ఓ కుటుంబం అసలు డస్ట్‌బిన్ వాడటం లేదు. అందరి ఇళ్లూ చెత్తా చెదారంతో చిందర వందరగా ఉంటే సోనికా భాసిన్ ఇల్లు మాత్రం నీట్‌గా కనిపిస్తుంది. అందరిలా సోనికా ఇంట్లో కూరగాయల వ్యర్థాలు పోగవుతాయి. ఆకుకూరలు.. వాటి నుంచి వచ్చే రసాలు.. చాయ్‌పత్తీ అన్నీ ఉంటాయి. మొదట్లో వీటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం వీలుకాకపోయేది.

ఎవరి పనుల మీద వాళ్లు బిజీగా ఉండేవాళ్లు. తినడం.. వేస్టేజ్‌నంతా ఓ టబ్బులోనో.. లేదా సింక్‌లోనో పడేసి వెళ్లేవారు. వెళ్లేటప్పుడు ఎలాగూ డోర్ పెట్టేసి వెళ్తారు కాబట్టీ.. ఆ వ్యర్థాల చుట్టూ దోమలు.. ఈగలు తిరిగేవి. కంపుకొట్టేది. చెత్తవల్లే ఈ సమస్యలన్నీ గ్రహించి దీనికొక పరిష్కారం ఆలోచించారు. ఇంట్లోకి ఎంటరవగానే పచ్చని మొక్కలు స్వాగతం పలుకుతుంటాయి. హాల్‌లో నుంచి వంటగదిలోకి రాగానే అక్కడొక పెద్ద కంటైనర్ కనిపిస్తుంది. అది కూరగాయల తొక్కలు..వంటగదిలో మిగిలిన వ్యర్థాలను సేకరిస్తుంది. సాయంత్రానికి ఈ వ్యర్థాలన్నీ బాల్కనీలోని మట్టి కంపోస్టులో చేరతాయి. ఈ కంపోస్టును తోటకు ఎరువుగా వాడతారు. తోటెక్కడిది అంటారా.? వంటగది వ్యర్థాలతో ఆమె తులసి.. పుదీనా.. టమాటో.. నిమ్మ.. కరివేపాకు వంటి మినీ గార్డెన్‌ బాల్కనీలో ఏర్పాటు చేశారు. వంటగది వ్యర్థాలతో పంటలు పండించి.. మళ్లీ ఆ పంటలను వంటకు ఉపయోగిస్తారన్నమాట. కిచెన్ వ్యర్థాలతో పాటు ఇతర వ్యర్థాలు.. చెత్తను సమర్థవంతంగా నిర్వహిస్తోంది సోనికా. ప్లాస్టిక్.. కాగితం.. కార్డ్‌బోర్డ్.. అల్యూమినియం.. గాజు.. ఇ- వ్యర్థాలను సేకరించడానికి ఆమె ఒక ప్రత్యేకమైన సంచిని తయారుచేసింది. ప్రతీ రెండు వారాలకు.. “5- ఆర్ సైకిల్” అనే రీసైక్లింగ్ పద్ధతి ద్వారా ఈ వ్యర్థాలను తరలిస్తారు. తడి.. పొడి వ్యర్థాలతో పాటు రిజెక్ట్ వ్యర్థాలను కూడా సమర్థవంతంగా నిర్వహిస్తోంది సోనికా. రిజెక్ట్ వ్యర్థాలంటే.. శానటరీ ప్యాడ్స్.. డైపర్స్ వంటి రీసైకిల్ చేయలేని.. కంపోస్ట్ చేయలేని వస్తువులన్నమాట.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

క్లౌడ్ సక్ తో మేఘంలోకి వెళ్లిన పారాగ్లైడర్‌.. భయానక అనుభవం ఎలా ఉందంటే

పులితో సెల్ఫీకి ట్రై చేశాడు.. ఇంతలోనే షాక్

ఇంట్లో.. పక్షి గూడు కడితే శుభమా.. అశుభమా ??

చుట్టుముట్టిన అడవి పందులు.. దిమ్మదిరిగే షాకిచ్చిన చిరుత

ఆడుకుంటూ కింద పడ్డ బాలుడు.. మెదడులోకి చొచ్చుకెళ్లిన మేకు.. తర్వాత..