చుట్టుముట్టిన అడవి పందులు.. దిమ్మదిరిగే షాకిచ్చిన చిరుత
నాన్నా... పందులే గుంపులుగా వస్తాయ్... సింహం..సింగిల్‌గా వస్తుంది... ఇది ఓ సినిమాలోని డైలాగ్. హీరోని విలన్లు చుట్టుముట్టినప్పుడు చెప్పే డైలాగ్. సరిగ్గా ఇలాంటి సిట్యువేషనే ఎదురైంది ఓ చిరుత పులికి. కొన్ని అడవిపందులు చిరుతను రౌండప్ చేశాయి. వాటినుంచి తప్పించుకొని చిరుత చెట్టెక్కింది. అయినా అవి చిరుతను వదల్లేదు. చెట్టును చుట్టుముట్టాయి.. అయితే చిరుత అడవిపందులకు భయపడలేదు సరికదా.. అదిరిపోయే షాకిచ్చింది.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇలాంటి సీన్ మీరు ఎప్పుడూ చూసి ఉండరు. సహజంగా అడవిలో సింహం, పులి, చిరుత వంటి బలమైన జంతువులను… బలహీన జంతువులు గుంపులుగా ఉండి ఎదుర్కొంటూ ఉంటాయి. ఇలాంటి దృశ్యాలు మీరు చూసే ఉంటారు. ఇక్కడ కూడా అదే జరిగింది. ఓ చిరుతను అడవి పందులు టార్గెట్ చేశాయి. అడవి పందుల గుంపు చుట్టుముట్టడంతో.. చిరుత చెట్టు ఎక్కింది. అయినప్పటికీ చిరుతలో ఎలాంటి ఆందోళన లేదు. ఎందుకంటే అలాంటి 100 పందులు ఉన్నా.. చిరుత ఈజీగా అక్కడి నుంచి తప్పించుకోగలదు. అందుకే అది ప్రశాంతంగా, దృష్టిని ఒక పందిపైనే కేంద్రీకరించి ఉంచింది. హఠాత్తుగా చిరుత వాయువేగంతో కిందకు దూకింది. క్షణాల్లోనే ఒక పందిని నోటకరచుకొని అంతే వేగంతో తిరిగి చెట్టు ఎక్కేసింది. ఇదంతా రెప్పపాటు కాలంలో జరిగిపోయింది. ఊహించని ఈ షాక్‌తో అడవిపందులు బిత్తరపోయాయి. అక్కడినుంచి పారిపోయాయి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా భయపడకుండా సమయస్పూర్తితో వ్యవహరించడం చిరుతల ప్రత్యేకత. చుట్టూ ఉన్న పందుల సంఖ్య ఎంతైనా చిరుత తన సమర్ధతను చాటుకుంది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు తమదైనశైలిలో కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆడుకుంటూ కింద పడ్డ బాలుడు.. మెదడులోకి చొచ్చుకెళ్లిన మేకు.. తర్వాత..
చోరీ కేసులో అరెస్టయిన వ్యక్తి… అతని కథ విని షాకయిన పోలీసులు
సైబర్ క్రైమ్‌లో మీ డబ్బు పోయిందా? తిరిగి పొందాలంటే ఇదే మార్గం
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

