పులితో సెల్ఫీకి ట్రై చేశాడు.. ఇంతలోనే షాక్
పులిని దూరం నుంచి చూడాలంటే చూడు.. చనువు ఇచ్చింది కదా అని దాని జూలు పట్టుకొని లాగితే..చూస్తూ ఊరుకుంటుందా…? అదేదో సినిమాలో పవన్ కల్యాణ్ డైలాగ్ అనుకుంటున్నారా? డైలాగ్ మాటేమోగానీ, పులితో సెల్ఫీకి ట్రై చేస్తే ముఖం వాచిపోయేలా చాచి కొట్టింది. థాయ్‌లాండ్ పర్యటనకు వెళ్లిన ఓ భారతీయుడికి ఎదురైన షాకింగ్ అనుభవం ఇది.
థాయ్‌లాండ్‌లో ఫేమస్ టైగర్ కింగ్‌డమ్ లో పులి భారతీయ పర్యాటకుడిపై దాడి చేసింది. ఈ ఘటనలో సదరు టూరిస్ట్‌కు గాయాలయ్యాయి. భారత్‌కు చెందిన ఓ యువకుడు థాయ్‌లాండ్‌లోని పుకెట్ దీవుల పర్యటనకు వెళ్ళాడు. అక్కడి ఫేమస్ టైగర్ కింగ్‌డమ్‌ను సందర్శించాడు. అక్కడ పులితో కలిసి కాసేపు సరదాగా తిరిగాడు. ఒక చేత్తో పులి మెడకు చుట్టిన గొలుసు పట్టుకుని మరో చేత్తో దాన్ని నిమురుతూ వాకింగ్ చేశాడు. అది కూడా టూరిస్టుకు సహకరిస్తూ నడిచింది. ఈ క్రమంలో దాంతో సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించాడు. పులి పక్కన కూర్చోని సెల్ఫీ తీసుకోబోయాడు. ఈ క్రమంలో అది ఒక్కసారిగా గాండ్రించింది. ట్రైనర్ ఎదుటే అతడిపై పంజా విసిరింది. అప్పటి వరకు శాంతంగా ఉన్న పులి ఒక్కసారిగా ఆగ్రహానికి గురైంది. ఊహించని ఈ ఘటనతో ఆ టూరిస్ట్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. పులి దాడిలో అతడికి గాయాలైనట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. వీడియోపై నెటిజన్స్ రకరకాలుగా పోస్టులు పెడుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇంట్లో.. పక్షి గూడు కడితే శుభమా.. అశుభమా ??
చుట్టుముట్టిన అడవి పందులు.. దిమ్మదిరిగే షాకిచ్చిన చిరుత
ఆడుకుంటూ కింద పడ్డ బాలుడు.. మెదడులోకి చొచ్చుకెళ్లిన మేకు.. తర్వాత..
చోరీ కేసులో అరెస్టయిన వ్యక్తి… అతని కథ విని షాకయిన పోలీసులు
సైబర్ క్రైమ్‌లో మీ డబ్బు పోయిందా? తిరిగి పొందాలంటే ఇదే మార్గం
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

