చోరీ కేసులో అరెస్టయిన వ్యక్తి… అతని కథ విని షాకయిన పోలీసులు
ప్రస్తుత కాలంలో ఒక్క భార్య, పిల్లలను పోషించడమే కష్టంగా భావిస్తుంటే.. ఓ వ్యక్తి ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. ముగ్గురు భార్యలకు ముగ్గురేసి పిల్లలు.. ఇంత వరకూ బాగానే ఉంది.. ఇప్పుడే అసలు కథ మొదలైంది. ఈ ముగ్గురు భార్యల ముద్దుల భర్తకు వారి పోషణ భారంగా మారింది. కూలిచేసి సంపాదించింది సరిపోకపోవడంతో ఈజీ మనీకోసం చోరీలు మొదలు పెట్టాడు.
ఎట్టకేలకు పోలీసులకు చిక్కి జైలుపాలయ్యాడు. ఈ ఘటన బెంగళూరులో జరిగింది. బెంగళూరుకు చెందిన బాబా జాన్ అనే వ్యక్తికి ముగ్గురు భార్యలు ఉన్నారు. వీరికి మొత్తం తొమ్మిది మంది సంతానం. ఈ మూడు కుటుంబాలను అతను బెంగళూరు, చిక్కబళ్లాపుర, శ్రీరంగం పట్టణాల్లో వేర్వేరుగా ఉంచి, తరచూ వారి వద్దకు వెళ్లి వస్తుండేవాడు. మొదట్లో కూలి పనులు చేస్తూ జీవనం సాగించే బాబా జాన్‌కు, ఇంత పెద్ద కుటుంబాన్ని పోషించడం రోజురోజుకూ కష్టంగా మారింది. సంపాదన సరిపోకపోవడంతో, సులభంగా డబ్బు సంపాదించే మార్గంగా దొంగతనాలను ఎంచుకున్నాడు. కొంతకాలంగా వివిధ ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న బాబా జాన్‌ను ఎట్టకేలకు గురువారం ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు పట్టుకున్నారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా, తన నేరాలకు వెనుక ఉన్న కారణాన్ని వివరించాడు. ముగ్గురు భార్యలు, తొమ్మిది మంది పిల్లల పోషణ భారం కావడంతోనే ఈ దారి పట్టినట్లు అంగీకరించాడు. నిందితుడి నుంచి పోలీసులు 188 గ్రాముల బంగారం, 550 గ్రాముల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సైబర్ క్రైమ్‌లో మీ డబ్బు పోయిందా? తిరిగి పొందాలంటే ఇదే మార్గం
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

