Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆడుకుంటూ కింద పడ్డ బాలుడు.. మెదడులోకి చొచ్చుకెళ్లిన మేకు.. తర్వాత..

ఆడుకుంటూ కింద పడ్డ బాలుడు.. మెదడులోకి చొచ్చుకెళ్లిన మేకు.. తర్వాత..

Phani CH

|

Updated on: Jun 06, 2025 | 6:07 PM

లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ వైద్యులు అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా చేసి, 7 ఏళ్ల బాలుడి మెదడు నుంచి 8 సెంటీమీటర్ల ఇనుప మేకును తొలగించారు. ఈ శస్త్రచికిత్స దాదాపు 10 గంటలపాటు సాగింది. ప్రస్తుతం ఈ ఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని బలరాంపుర్ జిల్లాలోని నవాజ్‌పుర్ గ్రామానికి చెందిన బాలుడు, మే 15న ఆడుకుంటూ పొరబాటును కిందపడిపోయాడు.

దాంతో అతని మెడలోకి మేకు దూసుకెళ్లింది. అది అక్కడినుంచి మెదడులోకి వెళ్లి అక్కడే కూరుకుపోయింది. కుటుంబ సభ్యులు మొదట అతడిని బలరాంపుర్ జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుండి అతడిని లక్నోలోని KGMU ట్రామా సెంటర్‌కు తరలించారు. అక్కడ డాక్టర్ సమర్, డాక్టర్ అశుతోష్, బాలుడిని పరిశీలించారు. మేకు మెదడులోకి వెళ్లిందని, అయితే రక్తనాళాలకు ఎలాంటి డ్యామేజ్ చేయలేదని గుర్తించారు. ఈ కేసు చాలా క్లిష్టమైనదని, బాలుడి ప్రాణాలే ప్రమాదంలో ఉన్నాయని వారికి అర్థమైంది. న్యూరోసర్జరీ, ENT నిపుణులతో కలిసి సమావేశమై శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించారు. ఆ రాత్రే 10 గంటల సమయంలో సర్జరీ మొదలుపెట్టారు. ఐదుగురు వైద్యుల బృందం ఈ చికిత్సలో పాల్గొన్నారు. విజయవంతంగా శస్త్రచికిత్స పూర్తిచేసి డాక్టర్లు ఈ ఘటన ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిలుస్తుందని, ప్రభుత్వ వైద్య సేవలపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచుతుందని తెలిపారు. ప్రస్తుతం బాలుడి ఆరోగ్యం నిలకడగా ఉందని, వైద్య పర్యవేక్షణలో ఉన్నాడని తెలిపారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చోరీ కేసులో అరెస్టయిన వ్యక్తి… అతని కథ విని షాకయిన పోలీసులు

సైబర్ క్రైమ్‌లో మీ డబ్బు పోయిందా? తిరిగి పొందాలంటే ఇదే మార్గం