AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెళ్లి వేడుకలో సినిమా పాటలకు బదులుగా హరినామ సంకీర్తన.. ఆకట్టుకుంటున్న వీడియో..

మారిన కాలంతో పాటు భారతీయ వివాహ వేడుకల్లో కూడా మార్పులు వచ్చాయి. . పాశ్చాత్య సంస్కృతిని ముంచెత్తుతోంది. సన్నాయి బదులుగా డీజే లకు చోటు దక్కింది. వివాహ ఆచారాలను తమ సౌలభ్యానికి అనుగుణంగా మార్చుకుంటున్నట్లు చూడవచ్చు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వివాహం అందరి దృష్టిని ఆకర్షించింది. పెళ్ళిలో ఆర్కెస్ట్రా కార్యక్రమంలో ఒక గాయకుడు సినిమా పాటలకు బదులుగా హరినామ సంకీర్తన పాడారు. ఈ అరుదైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది

పెళ్లి వేడుకలో సినిమా పాటలకు బదులుగా హరినామ సంకీర్తన.. ఆకట్టుకుంటున్న వీడియో..
Wedding Video Viral
Surya Kala
|

Updated on: Jun 06, 2025 | 7:51 PM

Share

వివాహం అనేది ఒక ప్రత్యేకమైన వేడుక. కుటుంబ సభ్యులు, స్నేహితులు అందరూ కలిసి పాటలు పాడుతూ, నృత్యం చేస్తూ, సరదాగా గడుపుతూ ఈ వివాహ వేడుకను జరుపుకుంటారు. ఇప్పటికీ సంగీత్, మెహందీ మొదలైన పాశ్చాత్య సంస్కృతిని అనుసరించి వివాహాలలో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అంతేకాదు ఇప్పుడు పెళ్లి అంటే ఆర్కెస్ట్రా తప్పనిసరిగా ఉండాల్సిందే. ఈ కార్యక్రమంలో రకరకాల సినిమా పాటలు .. దానికి పెద్దలు, పిల్లలు అనే తేడా లేకుండా డ్యాన్స్. అయితే ఇప్పుడు వైరల్ అయిన ఒక వీడియోలో ఒక గాయకుడు సినిమా పాటలకు బదులుగా హరినామ సంకీర్తనను అద్భుతంగా పాడాడు. వివాహ వేడుకకు హాజరైన అతిథులు, బంధువులు కూడా తమ గొంతుని జత చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నెటిజన్ల ను ఆకట్టుకుంటుంది.

ఈ వీడియో జగదీష్ పుట్టూర్ అనే ఖాతాలో షేర్ చేయబడింది. ఈ వీడియో మనం సనాతన ధర్మ సంస్కృతిని కాపాడుకోవాలి. భావితరాలకు అందించాలని చెబుతుంది. ఈరోజు చి. సచిన్ శెట్టి, దిశా శెట్టిల వివాహ వేడుక జరిగింది. హరినామ సంకీర్తన ఎంత అందంగా ఉంది. ఇది నూతన వధూవరులకు.. వధూవరుల బంధువులు,స్నేహితుల నుంచి లభించిన ఆశీర్వాదం లాంటిది. మన వివాహం వేడుకల్లోనే కాదు, ఇతర కార్యక్రమాలలో ఇటువంటి ఆచార కార్యక్రమాలు నిర్వహించాలి. మనం పెద్దలం.. చిన్నవారు అనుసరించేలా చేయాలి. అప్పుడే ఈ సంప్రదాయాన్ని మన తరువాతి తరం పిల్లలకు అందించగలం అని చెప్పారు.

వైరల్ వీడియోను ఇక్కడ చూడండి.

ఇవి కూడా చదవండి

వైరల్ అవుతున్న ఈ వీడియోలో వివాహ వేడుకలో ఆర్కెస్ట్రా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఒక గాయకుడు సినిమా పాటలకు బదులుగా తన అద్భుతమైన స్వరంలో హరినామ కీర్తనను ఆలపించాడు. వివాహానికి వచ్చిన అతిథులు, బంధువులు చప్పట్లు కొడుతూ గాయకులతో చేరి వేడుకను మరింత అందంగా మార్చారు. ఈ వీడియో 3.7K వ్యూస్ ను సొంతం చేసుకోగా.. నెటిజన్ల ప్రశంసల ను కూడా అందుకుంటుంది.

ఈ వీడియో పై రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. “అందరికీ మంచి, ఆదర్శప్రాయమైన కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన వారికి అభినందనలు. దేవుడు ఆ నూతన వధువరులను ఆశీర్వదించుగాక. నూతన వధూవరులకు శుభాకాంక్షలు. జీవితం బంగారుమయం కావాలి” అని ఒకరు వ్యాఖ్యానించారు. మరొకరు, “మీరు చాలా అద్భుతమైన గాయకులు. ఇంత మార్పుని చూసి నేను సంతోషంగా ఉన్నాను” అని అన్నారు. మరొకరు, “మీరు మంచి సందేశం ఇచ్చారు, అభినందనలు” అని వ్యాఖ్యానించారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ
చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..
చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!