AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fitness tips: ఆరోగ్యం, ఫిట్‌నెస్ అంటూ తెగ వ్యాయామం చేస్తున్నారా.. ఎన్ని సమస్యలకు వెల్కమ్ చెబుతున్నారో తెలుసా

బరువు తగ్గడానికి, శరీరం ఫిట్‌గా ఉంచుకోవడానికి ప్రజలు వ్యాయామం చేస్తారు. అయితే కొంత మంది ఇంట్లోనే వ్యాయామం చేస్తే.. మరికొందరు జిమ్‌కు వెళతారు. అయితే వ్యాయామం చేయడానికి కూడా కొన్ని నియమాలున్నాయి. ఎక్కువగా వ్యాయామం చేస్తే.. అది ఆరోగ్యానికి ప్రయోజనానికి బదులుగా హాని కలిగిస్తుంది. అతిగా వ్యాయామం చేయడం వల్ల కలిగే నష్టాలను గురించి నిపుణుల చెప్పారు. అవి ఏమిటంటే..

Fitness tips: ఆరోగ్యం, ఫిట్‌నెస్ అంటూ తెగ వ్యాయామం చేస్తున్నారా.. ఎన్ని సమస్యలకు వెల్కమ్ చెబుతున్నారో తెలుసా
Over Workout Side Effects
Surya Kala
|

Updated on: Jun 05, 2025 | 8:09 PM

Share

కరోనా తర్వాత ప్రజలు తమ ఆరోగ్యం గురించి శ్రద్ధ పెట్టడం మొదలు పెట్టారు. ఫిట్‌గా ఉండటానికి, ఆరోగ్యంగా ఉండడానికి సమతుల్య ఆహారాన్ని తీసుకుంటున్నారు. అదే సమయంలో కొంతమంది వ్యాయామం చేస్తున్నారు. ఇది శరీరాన్ని నిర్మించడంలో, బరువు తగ్గడంలో సహాయపడుతుంది. అయితే క్రమం తప్పకుండా వ్యాయామాలు చేస్తేనే ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది. వ్యాయామం చేసేవారు ఎల్లప్పుడూ చురుకుగా ఉంటారు. క్ర

అయితే ప్రస్తుతం యువత ఫిట్‌నెస్ పైనే కాదు బాడీ బిల్డింగ్ వైపు శ్రద్ధ పెడుతున్నరు. దీంతో చాలా సార్లు శీఘ్ర ఫలితాలను పొందాలనే కోరికతో అధికంగా పనిచేయడం ప్రారంభిస్తున్నారు. చాలా మంది బడీ బిడ్లింగ్ లేదా బరువు తగ్గాలనే మక్కువలో అవసరమైన దానికంటే ఎక్కువ వ్యాయామం చేస్తున్నారు. అయితే ఇది వారి ఆరోగ్యంపై కూడా చెడు ప్రభావాన్ని చూపుతుంది. ప్రయోజనానికి బదులుగా వ్యక్తికి కూడా హాని కలిగించవచ్చు. కనుక నిపుణులు అధికంగా వ్యాయామం చేస్తుంటే ఎలా ఆరోగ్యానికి ఎలా హానికరమో అనేక విషయాలను చెప్పారు.

అతిగా వ్యాయామం చేయడం వల్ల కలిగే నష్టాలు

ఇవి కూడా చదవండి

ఢిల్లీలోని అపోలో స్పెక్ట్రా హాస్పిటల్‌లోని ఇంటర్నల్ మెడిసిన్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ సంచయన్ రాయ్ మాట్లాడుతూ ఎక్కువగా వ్యాయామం చేసినప్పుడు శరీరం కోలుకోవడానికి సరైన సమయం లభించదు, దీనివల్ల కండరాల వాపు, బలహీనత, అలసట , గాయం అయ్యే ప్రమాదం పెరుగుతుంది. ఇది మాత్రమే కాదు అతిగా వ్యాయామం చేయడం వల్ల హార్మోన్ల అసమతుల్యత కూడా సంభవించవచ్చు, ఇది నిద్రలేమి, చిరాకు , అసాధారణ హృదయ స్పందన రేటు వంటి సమస్యలను కలిగిస్తుంది. ఇప్పటికే ఏదైనా వ్యాధి ఉన్నవారికి అతిగా వ్యాయామం చేయడం మరింత ప్రమాదకరం.

ఈ విషయాలను గుర్తుంచుకోండి

శరీరాన్ని సరిగ్గా హైడ్రేట్ గా ఉంచుకోవడం, సరైన ఆహారం తీసుకోవడంతో పాటు వ్యాయామం చేసేటప్పుడు తగినంత నిద్రపోవడం చాలా ముఖ్యం. ఈ విషయాలపై జాగ్రత్త తీసుకోకపోతే వ్యాయామం శరీరానికి హాని కలిగిస్తుంది. కండరాలు మరమ్మత్తు, పెరుగుదలకు తగినంత ప్రోటీన్, విశ్రాంతి అవసరం. లేకుంటే అవి బలహీనంగా మారవచ్చు.

ఎవరైనా నిరంతరం అలసిపోతున్నా.. హృదయ స్పందన రేటు పెరుగుతున్నా లేదా నిద్ర లేమి సమస్య ఎదురైనా అతిగా వ్యాయామం చేస్తున్నారనడానికి సంకేతాలు కావచ్చు. అలాంటి సందర్భంలో వెంటనే వైద్యుడిని లేదా ఫిట్‌నెస్ ట్రైనర్‌ను సంప్రదించండి. అలాగే నిపుణుడితో మాట్లాడి సరైన పద్ధతిలో వ్యాయామం చేసే సమయాన్ని నిర్ణయించుకోవాలి.

ఒక సాధారణ వ్యక్తి రోజుకు 45 నిమిషాల నుంచి 1 గంట వరకు వ్యాయామం చేస్తే సరిపోతుంది. ఎవరైనా అథ్లెట్ లేదా ప్రొఫెషనల్ బాడీబిల్డర్ కాకుండా రోజుకు 2 నుంచి 3 గంటలు వ్యాయామం చేయడం వల్ల శరీరానికి ప్రయోజనం ఉండదు సరికదా.. హాని జరగవచ్చు.

వ్యాయామం అంటే శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం. ప్రతి ఒక్కరి శరీర అవసరాలు భిన్నంగా ఉంటాయి. కనుక ఇంటర్నెట్ లేదా ఇతరులను చూసి వ్యాయామ పద్ధతిని అవలంబించకండి. క్రమంగా మీ శక్తిని పెంచుకోండి. వారంలో ఒకటి నుంచి రెండు రోజులు శరీరానికి పూర్తి విశ్రాంతి ఇవ్వండి. తద్వారా మీ శరీరం విశ్రాంతి పొందుతుంది. ఆరోగ్యంగా ఉంటారు

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..