AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రకృతి ఒడిలో పరుగులు పెట్టనున్న అత్యాధునిక హో హో డబుల్ డెక్కర్ బస్సులు

ప్రకృతి అందాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉండే విశాఖను ఇప్పుడు హో హో బస్సులు పలకరించనున్నాయి. అత్యాధునిక సౌకర్యాలతో ఉండే హో హో డబుల్ డెక్కర్ బస్సులు ఇప్పుడు పర్యాటకులకు మరింత ఆహ్లాదాన్ని పంచేందుకు సిద్ధంగా ఉన్నాయి. త్వరలోనే ఈ బస్సులు రోడ్లపై పరుగులు తీయనున్నాయి. విదేశాల్లో ప్రాచుర్యం పొందిన ఈ బస్సులు ఇప్పుడు వైజాగ్ బీచ్ రోడ్‌లో సేవలు అందించనున్నాయి.

ప్రకృతి ఒడిలో పరుగులు పెట్టనున్న అత్యాధునిక హో హో డబుల్ డెక్కర్ బస్సులు
Vizag Beach
Maqdood Husain Khaja
| Edited By: Balaraju Goud|

Updated on: Jun 05, 2025 | 8:47 PM

Share

ప్రకృతి అందాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉండే విశాఖను ఇప్పుడు హో హో బస్సులు పలకరించనున్నాయి. అత్యాధునిక సౌకర్యాలతో ఉండే హో హో డబుల్ డెక్కర్ బస్సులు ఇప్పుడు పర్యాటకులకు మరింత ఆహ్లాదాన్ని పంచేందుకు సిద్ధంగా ఉన్నాయి. త్వరలోనే ఈ బస్సులు రోడ్లపై పరుగులు తీయనున్నాయి. విదేశాల్లో ప్రాచుర్యం పొందిన ఈ బస్సులు ఇప్పుడు వైజాగ్ బీచ్ రోడ్‌లో సేవలు అందించనున్నాయి.

సుందరమైన సాగర తీరం.. ఆహ్లాదకరమైన వాతావరణం.. ఎత్తయిన పచ్చటి కొండలు.. మనసు దోచుకునే పర్యాటక ప్రాంతాలు.. విశాఖ సొంతం. ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరు వైజాగ్. ఒకపక్క సాగర తీరం అందాలు.. మరోపక్క పచ్చదనం పరిచినట్లు కనిపించే పర్వత శ్రేణులు. కైలాసగిరి సొగసులు.. అలనాటి బౌద్ధరామాలు.. ఒకటేంటి..? ఇటువంటి ప్రదేశాలు.. విశాఖ వచ్చే పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. అలాంటి ప్రకృతి సౌందర్యాన్ని వినూత్నంగా చూసే అవకాశం, హో హో డబుల్ డెక్కర్‌ బస్సులతో కలగనుంది. తొలిసారిగా డబుల్‌ డెక్కర్ బస్సుల నుంచి విశాఖ ప్రకృతి అందాలు చూసేందుకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా ఇప్పటికే ఓ బస్సు విశాఖకు చేరుకుంది.

ఈ డబుల్ డెక్కర్ బస్సులను విదేశాల్లో హో హో అని పిలుస్తారు. అంటే “హాప్‌ ఆన్‌ హాప్‌”. లండన్, ప్యారిస్, న్యూయార్క్, ఏథెన్స్ రోమ్, టోక్యో, బార్సిలోనా, పట్టాయా లాంటి ప్రముఖ నగరాల్లో టూరిస్టుల కోసం ఈ బస్సులను నడుపుతున్నారు. ఇక మన దేశంలో ఢిల్లీ, ముంబై, గోవా, బెంగళూరు వంటి పర్యాటక ప్రధాన నగరాల్లో కూడా ఇవి టూరిస్టులకు అందుబాటులో ఉన్నాయి. ఆల్రడీ విశాఖకు చేరుకున్న హో హో బస్సును, సింహాచలం ఎలక్ట్రికల్ బస్సులు నిర్వహించే గోశాల దగ్గర ఉంచారు. ఈ బస్సును చూసేందుకు జనం క్యూ కడుతున్నారు. దాంతో సెల్ఫీలు తీసుకుంటున్నారు.

Double Deccar Bus

Double Deccar Bus

ఈ హో హో బస్సులో రెండు అంతస్తులు ఉంటాయి. చుట్టూ అద్దాలు ఉంటాయి. కొన్నింటిలో ఓపెన్‌ టాప్‌ ఉంటుంది. ఈ బస్సుల్లో టూరిస్టులు.. ఆర్కే బీచ్ నుంచి తెన్నేటి పార్క్‌, కైలాసగిరి, రుషికొండ మీదుగా తొట్లకొండకు చేరుకుని, అక్కడ నుంచి భీమిలి బీచ్ వరకు వెళ్లి వెనక్కి వచ్చేలా రూట్‌ను సిద్ధం చేస్తున్నారు. ఈ బస్సుల్లో గైడ్లు కూడా ఉంటారు. స్థానిక విశేషాలను టూరిస్టులకు వివరిస్తారు. అయితే ఈ బస్సులు ఎంత వేగంగా అందుబాటులోకి వస్తాయా అని స్థానికులు ఎదురు చూస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..