AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijayawada: సాధారణ వాహన తనిఖీలు.. బైక్స్‌పై అనుమానాస్పదంగా యువకులు.. చెక్ చేయగా

విజయవాడలోని రామవరప్పాడు రింగ్ దగ్గర పోలీసులు చేపట్టిన తనిఖీల్లో 33 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ రవాణా చేస్తున్న ముగ్గురు వ్యక్తులు అరెస్ట్ కాగా, వారి నుండి సెల్ ఫోన్లు, వాహనాలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఢిల్లీకి చెందిన రింకు నుండి డ్రగ్స్ కొరియర్ల ద్వారా దిగుమతి చేసుకున్నట్లు విచారణలో తేలింది.

Vijayawada: సాధారణ వాహన తనిఖీలు.. బైక్స్‌పై అనుమానాస్పదంగా యువకులు.. చెక్ చేయగా
Vijayawada
Ram Naramaneni
|

Updated on: Jun 05, 2025 | 7:00 PM

Share

విజయవాడలో మరోసారి డ్రగ్స్ కలకలం మొదలైంది. బుధవారం రాత్రి నిర్వహించిన పోలీసు తనిఖీల్లో అనూహ్యంగా 33 గ్రాముల ఎండీఎంఏ బయటపడింది. డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న.. పోలీసులు వారి నుండి సెల్ ఫోన్లు, వాహనాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు డ్రగ్స్ మూలాలు కనుగొనే ప్రయత్నాలు చేస్తున్నారు.

విజయవాడలోని రామవరప్పాడు రింగ్ దగ్గర అక్రమంగా డ్రగ్స్ రవాణా చేస్తున్న వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి డ్రగ్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. రామవరప్పాడు ఫ్లై ఓవర్ వైపు నుండి విజయవాడ వైపు అనుమానాస్పదంగా వెళుతున్న రెండు వాహనాలను తనిఖీ చేశారు. ఓ ఇనుప పెట్టెలో వైట్ కలర్ క్రిస్టల్ MDMA డ్రగ్స్ ప్యాకెట్లు రెండు, పర్పుల్ కలర్ క్రిస్టల్ ఎండీఎంఏ డ్రగ్స్ ప్యాకెట్ ఒకటి, రెడ్ కలర్ క్రిస్టల్ ఎండీఎంఏ అడ్రస్ ప్యాకెట్ ఒకటి మొత్తం సుమారు 33 గ్రాముల డ్రగ్స్ లభించాయి. రెండు బైకులతో పాటు ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు 7 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.

నూజివీడుకు చెందిన మనోహర్ ద్వారా ఢిల్లీకి చెందిన రింకు నుండి ట్రాక్ ఆన్, డీటీడీసీ కొరియర్ల ద్వారా దిగుమతి చేసుకున్నట్లు విచారణలో తెలిసింది. డ్రగ్స్ సరఫరా చేస్తున్న వారిలో సనత్ నగర్ కు చెందిన తిరుమలశెట్టి జీవన్ కుమార్, టీచర్స్ కాలనీకి చెందిన బొంతు నితీశ్ కుమార్, యనమలకుదురుకు చెందిన తరుణ్ ప్రసాద్‌లు ఉన్నారు.

పోలీసులు కేసు గురించి చెప్పిన వివరాలు దిగువన చూడండి.. 

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..  

సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే
గ్రీక్ యోగర్ట్ వర్సెస్ వే ప్రోటీన్.. తమన్నా ట్రైనర్ చెప్పేదిదే?
గ్రీక్ యోగర్ట్ వర్సెస్ వే ప్రోటీన్.. తమన్నా ట్రైనర్ చెప్పేదిదే?