AP Mega DSC Exams 2025: ఏపీ మెగా డీఎస్సీకి సర్వం సిద్ధం.. సెంటర్స్ లో ఈ రూల్స్ పాటించాల్సిందే..!
ఈ మెగా డీఎస్సీలో భాగంగా మొత్తం 16వేల 347 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందుకోసం 3లక్షల 35వేల 401 మంది అప్లయ్ చేసుకోగా అన్ని పోస్టులకు కలిపి 5లక్షల 77వేల 417 మంది అప్లై చేసుకున్నారు. ఇక, హాల్ టికెట్‌లో తప్పులు ఉంటే అభ్యర్థులు భయపడాల్సిన అవసరం లేదు. పరీక్ష కేంద్రాల వద్దే వాటిని సరి చేసుకునే అవకాశం ఉంది.

ఏపీ మెగా డీఎస్సీ పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధం చేసింది ప్రభుత్వం. ఇవాళ్టి నుంచి ఈ పరీక్షలు ప్రారంభమయ్యి జూలై 6వ తేదీ వరకు కొనసాగుతాయి. నెల రోజులపాటు జరుగనున్న ఈ పరీక్షలను రోజుకు రెండు సెషన్ల వారీగా పూర్తి చేయనున్నారు. మొత్తం 154 కేంద్రాల్లో ఈ మెగా డీఎస్సీ పరీక్షలను జరుగనున్నాయి. ఏపీ డీఎస్సీ పరీక్షల కోసం తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా ప్రాంతాలలో కూడా పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.
ఈ మెగా డీఎస్సీలో భాగంగా మొత్తం 16వేల 347 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందుకోసం 3లక్షల 35వేల 401 మంది అప్లయ్ చేసుకోగా అన్ని పోస్టులకు కలిపి 5లక్షల 77వేల 417 మంది అప్లై చేసుకున్నారు. ఇక, హాల్ టికెట్‌లో తప్పులు ఉంటే అభ్యర్థులు భయపడాల్సిన అవసరం లేదు. పరీక్ష కేంద్రాల వద్దే వాటిని సరి చేసుకునే అవకాశం ఉంది.
ఆన్‌లైన్ విధానం ద్వారా అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు. విద్యార్థులు నిమిషం ఆలస్యంగా వచ్చినా లోపలికి అనుమతించబోమని విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు. నిమిషం రూల్ దృష్టిలో పెట్టుకుని అభ్యర్థులు ముందుగానే ఎగ్జామ్ సెంటర్లకు వెళ్లటం ఉత్తమం.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..