AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: దంపతుల మధ్య చిన్న చిన్న విషయాలకే గొడవలా.. ఈ వాస్తు దోషాలేమో చెక్ చేసుకోండి..

వాస్తు శాస్త్రం అనేది ఒక పురాతన భారతీయ శాస్త్రం. ఇది దిశలు, శక్తుల సమతుల్యతపై ఆధారపడి ఉంది. ఇంటి నిర్మాణం, దానిలో పెట్టుకునే వస్తువుల స్థానం , దిశ ఇంట్లో నివసించే ప్రజల జీవితాలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయని వాస్తు శాస్త్రం పేర్కొంది. ఇంట్లో వాస్తు నియమాలను పాటించకపోతే ప్రతికూల శక్తి వ్యాపిస్తుంది, ఇది ఇంట్లో అశాంతి, డబ్బు నష్టం, ఆరోగ్య సమస్యలతో పాటు ఇంట్లో నివసించే వారి సంబంధాలలో కూడా సమస్యలను కలిగిస్తుంది.

Vastu Tips: దంపతుల మధ్య చిన్న చిన్న విషయాలకే గొడవలా.. ఈ వాస్తు దోషాలేమో చెక్ చేసుకోండి..
Vastu TipsImage Credit source: istock
Surya Kala
|

Updated on: Jun 05, 2025 | 5:10 PM

Share

ఇంట్లో చిన్న విషయాలకే గొడవలు పడటం తరచుగా సాధారణం అని భావిస్తారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఇలా జరగడం ఇంట్లో వాస్తు దోషానికి తీవ్రమైన సంకేతం కావచ్చు. ఎవరి ఇంట్లోనైనా చిన్న చిన్న విషయాలకే తరచుగా గొడవలు జరుగుతున్నా, కుటుంబ సభ్యుల మధ్య ఉద్రిక్తత, ఆర్థిక సమస్యలు లేదా మానసిక అశాంతి వంటి సమస్యలు వాస్తు దోషానికి సంకేతాలు కావచ్చు. ఇంట్లో సానుకూల శక్తిని వ్యాప్తి చేయడానికి, కుటుంబ జీవితంలో ఆనందం, శాంతిని నెలకొల్పడానికి వాస్తు ప్రకారం దోషాలు ఉంటే సరి చూసుకోవాలి. ఎందుకంటే ప్రతి చిన్న విషయానికి తగాదాల వెనుక ప్రధాన కారణం వాస్తు లోపాలు కావొచ్చు.

వంటగది తప్పు దిశలో ఉండటం వంటగది అగ్ని మూలకాన్ని(ఆగ్నేయ) సూచిస్తుంది. అది తప్పు దిశలో ఉంటే (ఉదాహరణకు ఈశాన్య దిశలో), కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు పెరుగుతాయి. అగ్ని మూలక అసమతుల్యత కోపం, చిరాకును పెంచుతుంది. దీని కారణంగా చిన్న విషయాలు కూడా పెద్ద పెద్ద తగాదాల రూపంలోకి మారతాయి.

బెడ్ రూమ్ తప్పుడు దిశలో ఉన్నా భార్యాభర్తల బెడ్ రూమ్ సరైన దిశలో (నైరుతి లేదా వాయువ్య) లేకుంటే లేదా చిందరవందరగా ఉంటే.. వారి సంబంధం చెడిపోవచ్చు. బెడ్ రూమ్ లోని మంచం దిశ.. దాని రంగు.. రూమ్ లో ఉంచిన వస్తువులు కూడా ముఖ్యమైనవి. విరిగిన లేదా కోణాల ఫర్నిచర్, భయానక చిత్రాలు లేదా చాలా గాడ్జెట్లు బెడ్ రూమ్ లో ప్రతికూల శక్తిని పెంచుతాయి.

ఇవి కూడా చదవండి

ప్రధాన ద్వారం లోపం ఇంటి ప్రధాన ద్వారం శక్తి ప్రవేశ ద్వారం. అది విరిగిపోయినా, మురికిగా ఉన్నా, లేదా దాని ముందు ఏదైనా అడ్డంకి ఉన్నా, ప్రతికూల శక్తి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఇది ఇంట్లో అశాంతి , ఉద్రిక్తతను పెంచుతుంది. ప్రధాన ద్వారం సరైన దిశలో లేకపోవడం కూడా దంపతుల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య వివాదాలను కలిగిస్తుంది.

టాయిలెట్ తప్పు స్థానం మరుగుదొడ్డిని రాహువు స్థానంగా పరిగణిస్తారు. అది ఇంటి ఈశాన్య మూలలో ఉంటే అది తీవ్రమైన వాస్తు దోషాలను సృష్టిస్తుంది. ఈశాన్య మూల నీటి మూలకం. ఇది దేవుని స్థానం. ఇక్కడ మరుగుదొడ్డి ఉండటం వల్ల కుటుంబంలో అనారోగ్యం, ఆర్థిక సమస్యలు, విభేదాలు ఏర్పడతాయి.

ఇంట్లో డస్ట్ బిన్ ఇంట్లో అనవసరమైన వస్తువులు, ధూళి, చిందరవందరగా ఉండడం, పనికి రాని వస్తువులు పేరుకుపోవడం ప్రతికూల శక్తిని ఆకర్షిస్తుంది. ఈ శక్తి కుటుంబ సభ్యుల మనస్సులలో భారం, నిరాశ, చిరాకును సృష్టిస్తుంది. ఇది భార్యాభర్తల మధ్య పరస్పర సమన్వయాన్ని చెడగొడుతుంది.

తప్పు రంగును ఉపయోగించడం గోడల రంగులు కూడా ఇంటి శక్తిని ప్రభావితం చేస్తాయి. ఇంట్లో చాలా ముదురు, ప్రకాశవంతమైన లేదా ప్రతికూల రంగులు (ముదురు ఎరుపు లేదా నలుపు వంటివి) అధికంగా వాడితే.. అవి ఒత్తిడిని కలిగిస్తాయి. దూకుడు స్వభావాన్ని పెంచుతాయి.

టాప్ లీకేజ్ ఇంట్లో నీరు కారడం, కుళాయి నుంచి నీరు కారడం లేదా డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం వల్ల కూడా కుటుంబంలో ఆర్థిక నష్టం , అశాంతి తలెత్తవచ్చు. నీటి సమతుల్యత సంబంధాలలో మాధుర్యాన్ని తెస్తుంది.

వాస్తు దోషాలను తొలగించి ఇంట్లో శాంతిని నెలకొల్పడానికి తీసుకోవాల్సిన చర్యలు

ఇంటిని క్రమం తప్పకుండా శుభ్రపరచడం.. ఇంటిని ఎల్లప్పుడూ శుభ్రంగా, ఇంట్లోని వస్తువులను క్రమబద్ధంగా ఉంచుకోండి. చెత్త , అనవసరమైన పనికిరాని వస్తువులను వెంటనే తీసివేయండి.

వంటగది సరైన దిశ వీలైతే వంటగదిని ఆగ్నేయ మూలలో నిర్మించడానికి ప్రయత్నించండి. ఇది సాధ్యం కాకపోతే అగ్నికి సంబంధించిన రంగులను ఉపయోగించండి. అగ్నిపెట్టి స్టవ్ వంటి వాటిని సరైన దిశలో ఉంచండి.

బెడ్ రూమ్ లో ప్రశాంతత బెడ్ రూమ్ లో తేలికైన , ప్రశాంతమైన రంగులను ఉపయోగించండి. బెడ్ ను దక్షిణం లేదా పడమర దిశలో ఉంచండి. గదిలో సానుకూల చిత్రాలను ఉంచండి, ప్రశాంతమైన వాతావరణాన్ని కొనసాగించండి.

రెస్ట్‌రూమ్ లోపాన్ని సరిచేయండి ఇలా టాయిలెట్ ఈశాన్య మూలలో ఉంటే.. వాస్తు నిపుణుడిని సంప్రదించండి. అక్కడ ఆకుపచ్చని మొక్కలను ఉంచడం ద్వారా లేదా కొన్ని వాస్తు పరికరాలను ఉపయోగించడం ద్వారా ఈ లోపాన్ని తగ్గించవచ్చు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు