Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గేటు దాటుతుండగా ట్రాక్‌పై ఇరుక్కుపోయిన ఈ-రిక్షా.. ఇంతలో

గేటు దాటుతుండగా ట్రాక్‌పై ఇరుక్కుపోయిన ఈ-రిక్షా.. ఇంతలో

Phani CH

|

Updated on: Jun 07, 2025 | 12:16 PM

రైల్వే గేట్లదగ్గర వాహనదారులు చాలా అప్రమత్తంగా ఉండాలి. గేటు వేసినప్పుడు ట్రాక్‌ దాటేందుకు ప్రయత్నించకూడదు. కానీ చాలామంది నిర్లక్ష్యంగా గేటు వేసినా రైల్వే క్రాసింగ్‌ను దాటేందుకు ప్రయత్నిస్తుంటారు. అలా వేసి ఉన్న రైల్వే గేటు దాటుతున్న ఓ ఈ రిక్షా డ్రైవర్‌తో గుంజీలు తీయించారు రైల్వే సిబ్బంది. అతను చేసిన నిర్లక్ష్యం పనికి ఈ రిక్షా ట్రాక్‌పై ఇరుక్కుపోయింది.

అక్కడే ఉన్న రైల్వే సిబ్బంది ఒకరు చూసి వెంటనే అక్కడకు వచ్చి రిక్షాను బయటకు లాగడంతో పెను ప్రమాదం తప్పింది. లఖింపూర్ ఖేరిలోని ఒక రైల్వే క్రాసింగ్ వద్ద ఈ-రిక్షా డ్రైవర్ తొందరపాటు ప్రదర్శించాడు. గేటు పడటానికి ముందు క్రాసింగ్‌ను దాటేయాలనే ఆత్రుతతో రెడ్ సిగ్నల్ ఉన్నప్పటికీ ముందుకు దూసుకెళ్లాడు. అయితే, దురదృష్టవశాత్తూ అతని ఈ-రిక్షా పట్టాల మధ్యలో ఇరుక్కుపోయింది. గేట్లు మూసుకున్న తర్వాత కూడా రిక్షా చాలాసేపు అక్కడే నిలిచిపోయింది. ఆ సమయంలో అక్కడే ఉన్న ఒక రైల్వే ఉద్యోగి ఈ ఘటనను గమనించారు. వెంటనే డ్రైవర్ వద్దకు వెళ్లి, అతని నిర్లక్ష్యపు చర్యపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రాసింగ్ కనపడలేదా? ఇంతటి ప్రమాదకరమైన పని చేయడానికి ఎంత ధైర్యం? అంటూ మందలించారు. అనంతరం, భవిష్యత్తులో ఇలాంటి తప్పు మళ్లీ చేయవద్దని హెచ్చరిస్తూ, డ్రైవర్‌తో రైల్వే ట్రాక్‌పైనే గుంజీలు తీయించారు. ఈ ఘటనను అక్కడున్న ఒక వ్యక్తి తన ఫోన్‌లో రికార్డ్ చేసి, సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వీడియో క్షణాల్లో వైరల్‌గా మారింది. ఇంతలో, ఆ మార్గంలో రావాల్సిన రైలు జంక్షన్‌ను దాటి వెళ్లిపోవడంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు. ఈ విషయం ఉత్తరప్రదేశ్ జీఆర్పీ దృష్టికి వెళ్లడంతో, లక్నోలోని జీఆర్పీ సూపరింటెండెంట్‌ను విచారణ జరపాలని ఆదేశించారు. ప్రయాణికుల ఫిర్యాదులను సోషల్ మీడియా ద్వారా స్వీకరించే రైల్వే సేవ కూడా ఈశాన్య డివిజన్‌లోని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, డివిజనల్ రైల్వే మేనేజర్‌ను అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరింది. కాగా, రైల్వే ఉద్యోగి తక్షణమే స్పందించి, బాధ్యతాయుతంగా వ్యవహరించిన తీరుపై సోషల్ మీడియా యూజర్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అతని సమయస్ఫూర్తి వల్లే ఘోర ప్రమాదం తప్పిందని పలువురు అభిప్రాయపడ్డారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పిచ్చిగా ప్రేమించాడు.. కానీ పెళ్లి వేరే అమ్మాయితో! కమల్‌ లవ్‌ స్టోరీ వైరల్

ఐదేళ్లుగా డస్ట్‌బిన్ వాడని కుటుంబం.. ఎలా మేనేజ్‌ చేస్తున్నారంటే

క్లౌడ్ సక్ తో మేఘంలోకి వెళ్లిన పారాగ్లైడర్‌.. భయానక అనుభవం ఎలా ఉందంటే

పులితో సెల్ఫీకి ట్రై చేశాడు.. ఇంతలోనే షాక్

ఇంట్లో.. పక్షి గూడు కడితే శుభమా.. అశుభమా ??