చేపలు నడవడం చూసారా ?? అయితే ఈ వీడియో తప్పక చూడాల్సిందే
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రోహిణీ కార్తె ముందే తొలకరి వానలు పలకరించాయి. ఆంధ్రప్రదేశ్ లో రుతుపవనాలకు తోడు అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏదేమైనా ఎండ ఉక్కపోత నుంచి రిలీఫ్ వచ్చినందుకు అంతా హ్యాపీ. కూల్ వాతావరణాన్ని జనం ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా కోనసీమకు చెందిన ఓ చేపల వీడియో వైరల్ అవుతోంది.
మనం ఆ వీడియో గురించే చెప్పుకోబోతున్నాం. వీడియోలో వర్షపు నీటితో నిండిన రోడ్డుపై చేపలు వయ్యారంగా పాక్కుంటూ వెళుతున్నాయి. ఆ రోడ్డుపై వెళుతున్న వారు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఇది ఫేక్ వీడియో కాదు. డౌట్ పడాల్సిన అవసరం లేదు. పక్కా ఒరిజినలే. అయితే నీళ్లల్లో ఈదాల్సిన చేపలు ఇలా రోడ్డు మీద పాక్కుంటూ ఎందుకు వెళ్ళాయి. మీకు తెలుసా? ప్రపంచంలో అరుదుగా కనిపించే కొన్ని చేపలకైతే కాళ్లు చేతులు ఉంటాయి. అవి నడుస్తాయి. ఆ వింతను చూద్దాం ఈ స్టోరీలో. వీడియోలో చేపలు ఇలా వలస వెళ్లడం చూడటం వింతల్లో కెల్లా వింత. అసలేం జరిగిందంటే.. బురదలోనో, చిన్న నీటి కుంటల్లోనో ఉండే చిన్న చేపలు, వర్షపు నీటి ప్రవాహానికి కుంటలు నిండి నీరు బయటికొచ్చినప్పుడు చేపలు రోడ్ల మీద కొట్టుకుపోతాయి. రోడ్డు మీద పాక్కుంటూ వెళ్లి దగ్గర్లోని మరో చెరువులోకి చేరతాయి. వీడియోలో కోనసీమలో వర్షపు నీరుతో తడిసిన రోడ్డు మీద అవి వయ్యారంగా వాటి మొప్పల సాయంతో పాక్కుంటూ వలస వెళ్లడం ఆశ్చర్యం. అక్కడి గ్రామస్తులు దీన్ని ప్రకృతి సహజమైన ప్రక్రియగా చెబుతున్నారు, వైరల్ అవుతున్న వీడియోపై కొందరు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. మన ఊరి చేపలకు హాలిడే మూడ్ వచ్చింది. పొలాల్లో కష్టపడి అలసిపోయి, ఇప్పుడు రిలాక్స్ అవ్వడానికి చెరువుకు వెళ్తున్నాయి అని కామెంట్లు పెడుతున్నారు. ఏదేమైనా, ఈ చేపల వలస మాత్రం ఠాణేలంక గ్రామస్తులకు మంచి వినోదాన్ని అందిస్తోంది. మడ్‌స్కిప్పర్స్ అని పిలిచే ఈ చేపలు కప్పల్లాగా అటు భూమిపైనా ఇటు నీటిలోనూ నివసించగలవని శాస్త్రవేత్తలు అంటున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:

‘మీ దేశానికి పో !’ యువతితో రాపిడో రైడర్.. దాడి కేసులో ట్విస్ట్

బిచ్చగాడినంటూ ఇంటికి వచ్చాడు.. ఆమె ఒంటరిగా కనిపించేసరికి..

అదనపు కట్నంగా .. కోడలిని ఏం అడిగారో తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయ్

జంబో పుట్టగొడుగును ఎప్పుడైనా చూశారా ??

డబ్బులు లెక్కపెట్టుకుంటున్న వ్యక్తి.. ఇంతలో ఊహించని ట్విస్ట్

సొర చేపకు మహిళ ముద్దులు.. తర్వాత అంతా షాక్ వీడియో

ఉదయాన్నే ఆలయానికి వెళ్లిన భక్తులు.. శివలింగంపై ఉన్నది చూసి షాక్
