కొబ్బరి నీళ్లతో జుట్టు సమస్యలకు చెక్!
చాలా మంది జుట్టు పొడిబారడం నుంచి ఉపశమనం పొందడానికి క్రమం తప్పకుండా కొబ్బరి నూనెను రాసుకుంటారు. అయితే కొబ్బరి నూనెలోనే కాదు, నీటిలో కూడా జుట్టుకు మేలు చేసే పదార్థాలు ఉన్నాయని బ్యూటీ నిపుణులు అంటున్నారు. ఇది జుట్టు, చర్మంపై మ్యాజిక్ లాగా పనిచేస్తుందట. అంతేకాదు, ముఖం మీద వృద్ధాప్య ఛాయలు లేదా మొటిమల మచ్చలు ఉంటే కొబ్బరి నీళ్లలో దూదిని ముంచి ముఖాన్ని తుడవాలి.
ఇలా ఒక నెల పాటు చేస్తే, మచ్చలు పూర్తిగా మాయమవుతాయని నిపుణులు అంటున్నారు. జిడ్డు లేదా పొడి చర్మం సమస్యకు కూడా కొబ్బరి నీళ్లు భలేగా పనిచేస్తాయి. ఏ రకమైన చర్మానికైనా ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. మొటిమలు వచ్చే అవకాశం ఉన్నవారు కొబ్బరి నీళ్లలో దూదిని నానబెట్టి, అప్పుడప్పుడు దానితో ముఖం తుడుచుకోవాలి. ఇలా తరచూ చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. వర్షాకాలంలో చాలా మంది జుట్టు రాలడంతో బాధపడుతుంటారు. కొబ్బరి నీళ్లను కొద్దిగా వేడి చేసి, తలపై మసాజ్ చేసుకోవాలి. ఇలా చేస్తే చాలా త్వరగానే సమస్య నుంచి బయటపడతారని నిపుణులు అంటున్నారు. లేదంటే షాంపూ చేసిన తర్వాత కొబ్బరి నీళ్లతో జుట్టును కడిగినా ప్రయోజనం ఉంటుంది. ఇది జుట్టును మెరిసేలా చేయడమే కాకుండా, చుండ్రు సమస్యను కూడా తొలగిస్తుంది.కొబ్బరి నీళ్ళను శనగపిండితో కలిపి ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవాలి. అందులో కొంచెం తేనె కూడా కలపవచ్చు. ఈ ఫేస్ ప్యాక్ ఎండలో కమిలిపోయిన చర్మాన్ని తిరిగి కాంతివంతం చేయడానికి అద్భుతంగా పనిచేస్తుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:

ఒకే ఒక్క క్లూతో ట్రావెల్ బ్యాగులో డెడ్‌బాడీ మిస్టరీ వీడింది వీడియ

రైతు వేషంలో పోలీసులు.. తర్వాత ఏమైదంటే? వీడియో

వార్నీ.. ఇదేం బిజినెస్ రా అయ్యా వీడియో

దృశ్యం సినిమాను తలపించేలా వరుస చోరీలు వీడియో

వామ్మో .. ఎంత పని చేసిందీ కోతి.. రూ. 20 లక్షల విలువైన పర్సు చోరీ

కడుపునొప్పితో ఆస్పత్రికి మహిళ.. టెస్టులు చేయగా..

చేపలు వేటకు వెళ్లిన జాలర్లు.. సముద్రంలో తెలియాడుతున్నది చూసి
