Telangana: పంక్చర్ టైర్‌లో గాలి ఎక్కిస్తుండగా పెద్ద శబ్దం.. కట్ చేస్తే.. ఆ తర్వాత సీన్ ఇది
టైర్‌కు గాలి పెడుతున్నారా..! బీ కేర్‌పుల్.. ఒక్కసారిగా భారీ శబ్దం.. ఏమి జరుగుతుందో తెలియక స్థానికులు ఉలిక్కిపడ్డారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఇలా.. ఓ సారి ఈ స్టోరీ చూసేయండి మరి. అదేంటంటే
కరకగూడెంలో పంక్చర్ షాప్‌లో ఒక్కసారిగా ట్రాక్టర్ టైర్ పేలింది. దీంతో షాప్ యజమాని సతీష్‌కు తీవ్రగాయాలు అయ్యాయి. వెంటనే హాస్పటల్‌కు తరలించారు స్థానికులు. ట్రాక్టర్ టైర్‌కు గాలి ఎక్కిస్తుండగా ఈ ఘటన జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెంలో ఓ పంచర్ షాప్‌లో టైర్ పేలి యజమాని గాయపడ్డాడు. పంచర్ షాప్ నిర్వహించే సతీష్ అనే వ్యక్తి ట్రాక్టర్‌కు గాలి ఎక్కిస్తుండగా.. ఒక్కసారిగా టైర్ పేలి సతీష్ తీవ్రగాయాల పాలయ్యాడు. క్షతగాత్రుడు కోమాలో ఉండడంతో వెంటనే అతనిని స్థానికులు స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లగా.. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి మణుగూరు.. ఆ తర్వాత భద్రాచలం హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం అతనికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. టైర్ పేలి ఓ వ్యక్తి తీవ్ర గాయాలపాలవడంతో స్థానికులు ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు. ఇలాంటి ఘటనలు కూడా జరుగుతాయా..! కేర్‌పుల్‌గా ఉండాలంటున్నారు స్థానికులు. ఎందుకు ఇలా జరిగిందని తెలియక ఆందోళన చెందుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
సంక్రాంతి రైళ్లు హౌస్‌ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు

