AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kitchen Hacks: వర్షాకాలంలో మహిళలు పనిని ఈజీ చేసే వంటింటి చిట్కాలు మీ కోసం..

నేటి మహిళలు ఓ వైపు ఇంటి ఇల్లాలుగా మరోవైపు ఉద్యోగిగా ద్విపాత్రాభినయం చేయాల్సిన పరిస్థితులున్నాయి. దీంతో రోజువారీ ఇంటి పనులు చేస్తున్న సమయంలోనే చాలా మంది మహిళలు ఇతర విషయాలను కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. లేదంటే సమయం సరిపోదు. ఇంట్లో ఉన్న పప్పులు, ఉప్పులు చెడిపోకుండా నిల్వ ఉంచుకోవాలి. ప్రిడ్జ్ నుంచి వాసన రాకుండా చూసుకోవాలి.. ఇలా అనేక రకాల పనులపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఈ నేపధ్యంలో మహిళలకు కొన్ని రకాల చిట్కాలను పాటిస్తే మీ పనులు సులభంగా పూర్తి చేసుకోవచ్చు.

Kitchen Hacks: వర్షాకాలంలో మహిళలు పనిని ఈజీ చేసే వంటింటి చిట్కాలు మీ కోసం..
Kitchen Hacks
Surya Kala
|

Updated on: Aug 07, 2025 | 12:52 PM

Share

ప్రతి స్త్రీ ఇంటి పనుల్లో నిష్ణాతులు రాలు. అయితే చాలా సార్లు పనులు చేస్తున్న సమయంలో అనేక సమస్యలు తలెత్తుతాయి, ఫ్రిజ్ దుర్వాసన రావడం లేదా ఏదైనా వస్తువు పాడైపోవడం ఉండటం వంటివి. ముఖ్యంగా వర్షాకాలంలో వంటగదిలో ఇలాంటి సమస్యలు చాలా వస్తాయి. ఇది వాటిని ఎదుర్కోవడంలో శారీరక , మానసిక అలసటను పెంచుతాయి. అయితే కొన్ని చిట్కాలతో రోజువారీ పనిలో ఈ సమస్యలన్నింటినీ క్షణాల్లో పరిష్కరించగలవు. బట్టలు జాగ్రత్తగా చూసుకోవడం నుంచి ఇల్లు లేదా వంటగదిని శుభ్రం చేయడం వరకు కొంచెం ప్రణాళిక, కొంచెం తెలివితేటలు అవసరం. ఈ రోజు మహిళలు పని సులభం చేసే 5 చిట్కాల గురించి తెలుసుకుందాం.

నేటి కిచెన్స్ ఆధునికంగా మారిపోయాయి. పప్పులు, మసాలాలు రుబ్బడం దగ్గర నుంచి రోటీ తయారు చేయడం వరకు పనిని చాలా ఈజీ చేసే వస్తువులు అనేకం ఉన్నాయి. అయితే కొన్ని రకాల సింపుల్ చిట్కాలను పాటించడం వలన సమయం, శక్తి ఆదా అవుతాయి. కొన్ని సింపుల్ టిప్స్ తో ఇంటి పని సమయంలో వచ్చే సమస్యలకు చెక్ పెట్టవచ్చు. అప్పుడు మిగిలిన మీ సమయంలో ఇతర పనులు చేసుకోవచ్చు. లేదా ఫ్యామిలీతో సంతోషంగా గడపవచ్చు.

ఫ్రిజ్ దుర్వాసన వస్తుంటే కొన్నిసార్లు వర్షాకాలంలో విద్యుత్ లేకుండా, ఫ్రిజ్ తలుపులు ఎక్కువసేపు మూసి ఉన్నా లేదా తేమ కారణంగా ప్రిడ్జ్ లో పెట్టిన కూరగాయలు , పండ్లు వంటివి చెడిపొతే ఫ్రిజ్ దుర్వాసన రావడం ప్రారంభమవుతుంది. దీనిని వదిలించుకోవడానికి ఒక గిన్నెలో ఉప్పు నింపి ఫ్రిజ్ తలుపు మూలలో ఉంచండి. ఇది ప్రిడ్జ్ నుంచి వచ్చే వాసనను ఆపుతుంది. ఎక్కువ వాసన వస్తుంటే ఉప్పుకు బేకింగ్ సోడా వేసి, నిమ్మకాయను ముక్కలుగా కోసి ఫ్రిజ్‌లో ఉంచడం కూడా ఫలితం ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మసాలాలు, చక్కెర, పప్పులు వర్షాకాలంలో వంటగదిలో ఉంచే వస్తువులు తేమ పడతాయి. ముఖ్యంగా చక్కెర, ఉప్పు, ధాన్యాలు తడిగా ఉంటాయి. పప్పుధాన్యాలు, బియ్యం, గోధుమలు మొదలైన వాటిలో పురుగులు పడతాయి. కనుక వీటిని గాలి చొరబడని కంటైనర్లలో ఉంచండి. బియ్యం, చక్కెరలో లవంగాలను వేయండి. ఇది కీటకాలు, చీమలను దూరంగా ఉంచుతుంది. ఉప్పు వేసిన పాత్రలో ఒక వస్త్రంలో బియ్యం కట్టి.. దానిని వేయండి. చక్కెర నుంచి తేమను తొలగించడానికి సిలికా జెల్ ప్యాకెట్లను ఉపయోగించవచ్చు. అదేవిధంగా, దీనిని మసాలాలు నిల్వ చేసే పోపుల పెట్టెలలో కూడా సిలికా జెల్ ప్యాకెట్లను వేయవచ్చు.

మాడిన గిన్నెలను ఎలా శుభ్రం చేయాలంటే వంట గదిలో పనులు చేస్తున్న సమయంలో ఒకొక్కసారి చేతులు జారి ఆ వస్తువులు నేల మీద పడతాయి. అటువంటి సమయంలో ఆ ప్రాంతాన్ని ఐస్ తో శుభ్రం చేయండి. తక్కువ సమయంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా నేల శుభ్రం అవుతుంది. దీనితో పాటు మాడిపోయిన గిన్నెలను శుభ్రం చేయాలంటే.. ఆ పాత్రలో బేకింగ్ సోడా, నిమ్మరసం, వెనిగర్, కొద్దిగా నీరు వేసి 5 నిమిషాలు మరిగించండి. ఇది గొప్ప హ్యాక్.

బట్టల వాసనను వదిలించుకోండి: వర్షం కారణంగా బట్టలలో తేమ ఉండి వింత వాసన ఉంటే.. వాటిని సూర్యకాంతి తగిలే విధంగా ఆరబెట్టాలి. దీనితో పాటు ఒక బకెట్ నీటిలో కొద్దిగా వెనిగర్ వేసి, బట్టలను కొంతసేపు నానబెట్టి ఆపై వాటిని డ్రయ్యర్ లో వేసి ఆరబెట్టండి. ఈ విధంగా చేస్తే బట్టలు తాజా సువాసనను పొందుతాయి. దీనికి నిమ్మరసం జోడిస్తే మరింత మెరుగైన ఫలితాలు వస్తాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)