AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Uttarkashi Glacier Burst: ధరాలి విషాదం వెనుక అసలు కారణం ఇదే.. వాతావరణ శాస్త్రవేత్త ఏమి చెప్పారంటే

ఉత్తరాఖండ్ లోని ఉత్తరకాశీ జిల్లాలో హర్సిల్ సమీపంలో ఉన్న అందమైన ధరాలి గ్రామం. ఇక్కడ జరిగిన విపత్తుకు కారణం మేఘాల విస్ఫోటనం కాదని వాతావరణ శాఖ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సీనియర్ జియాలజిస్ట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్పీ సతి ..ఖీర్ గంగా నది పరివాహక ప్రాంతంలో విరిగిపడిన కొండచరియల శిథిలాలు గ్రామాన్ని ఎలా నాశనం చేశాయో చెప్పారు. ప్రొఫెసర్ చెప్పిన ఈ విపత్తుకు గల కారణాన్ని తెలుసుకుందాం...

Uttarkashi Glacier Burst: ధరాలి విషాదం వెనుక అసలు కారణం ఇదే..  వాతావరణ శాస్త్రవేత్త ఏమి చెప్పారంటే
Uttarkashi Glacier
Surya Kala
|

Updated on: Aug 07, 2025 | 9:44 AM

Share

ప్రాణాలను కాపాడాలనే ఆశతో ఉత్తరకాశిలోని ధరాలి గ్రామంలో మహా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఉత్తరకాశిలో వాతావరణం కూడా ఇప్పుడు రెస్క్యూ సిబ్బందికి సహకరించడం ప్రారంభించింది. వాతావరణం అనుకూలంగా ఉండటంతో గురువారం ఉదయం నుండే రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభమైంది. అయితే ఈ మొత్తం రెస్క్యూ ఇప్పుడు హెలికాప్టర్ సేవపై ఆధారపడి ఉంది. బాధిత ప్రజలను తరలించే ఆపరేషన్ కొనసాగుతోంది. 11 మంది సైనికులు సహా 13 మందిని విమానంలో తరలించారు. అయితే ఈ విషాదం ఎందుకు జరిగిందో వాతావరణ శాస్త్రవేత్త వివరించారు.

వాతావరణ శాఖ డైరెక్టర్ డాక్టర్ విక్రమ్ సింగ్ ప్రకారం.. మంగళవారం రోజంతా కేవలం 2.7 మి.మీ వర్షం మాత్రమే కురిసింది. ఇది సాధారణం. అయినప్పటికీ విధ్వంసం సంభవించింది. దీనికి ప్రధాన కారణం శ్రీఖండ్ పర్వతంపై వేలాడుతున్న హిమానీనదాలు కావచ్చని అన్నారు. ఇదే విషయంపై సీనియర్ జియాలజిస్ట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్.పి. సతి మాట్లాడుతూ ఈ విపత్తు వాతావరణానికి సంబంధించినది కాదని భౌగోళిక, వాతావరణ మార్పులకు సంబంధించినదని చెప్పారు.

విరిగిపోయిన హిమానీనదం పెద్ద భాగం

ఇవి కూడా చదవండి

ట్రాన్స్ హిమాలయాలలో ఉష్ణోగ్రత నిరంతరం పెరగడం వల్ల.. పైన ఉన్న వేలాడుతున్న హిమానీనదాలు కరుగుతున్నాయి. ఈ హిమానీనదాలు ఏటవాలులలోనే ఉంటాయి. శ్రీఖండ్ పర్వతంపై కూడా ఇటువంటి హిమానీనదాలు ఉన్నాయి. వర్షం, తేమ కారణంగా హిమానీనదంలో ఎక్కువ భాగం విరిగి పడిపోయే అవకాశం ఉంది. ఇది ముందుకు కదిలి పైన ఉన్న 2-3 సరస్సులను విచ్ఛిన్నం చేస్తుంది. అందుకే పర్వతం ముక్కలు అంత వేగంతో ప్రవహించి ధరాలికి చేరుకున్నాయని ప్రొఫెసర్ డాక్టర్ ఎస్.పి. సతి చెప్పారు.

నిరంతరం కొనసాగుతోన్న సహాయక చర్యలు

సంఘటన జరిగిన ప్రదేశంలో టన్నుల కొద్దీ శిథిలాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. నిరంతర కురిసిన వర్షంలోనే ఐటీబీపీ, ఆర్మీ మరియు ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ఈ శిధిలాలలో కూరుకుపోయిన వ్యక్తుల కోసం వెతుకుతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో మనాలో సంభవించిన హిమపాతంలో సహాయక చర్యలలో సహాయపడిన ఆర్మీ ఐబెక్స్ బ్రిగేడ్, తప్పిపోయిన వ్యక్తుల కోసం వెతకడానికి భూమిలోకి చొచ్చుకుపోయే రాడార్ , స్నిఫర్ కుక్కల సహాయం తీసుకోవడానికి సిద్ధమవుతోందని అధికారులు తెలిపారు.

400 మందిని రక్షించారు.

ధరాలి గ్రామంలో వరదల కారణంగా 30 నుంచి 50 అడుగుల వరకు శిథిలాలు పేరుకుపోయాయి. శిథిలాల కింద ఇంకా 150 మంది చిక్కుకుపోయి ఉండవచ్చని భావిస్తున్నారు. ఇప్పటివరకు 400 మందిని రక్షించారు. అలాగే తప్పిపోయిన 11 మంది ఆర్మీ సైనికులను కూడా రక్షించారు. హెలికాప్టర్ల సహాయంతో రెస్క్యూ బృందాలను ధరాలికి తరలించారు. చెడు వాతావరణం కారణంగా రెండు రోజులుగా రెస్క్యూ ఆపరేషన్‌లో చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. అయితే గురువారం ఉదయం వాతావరణం కూడా సహకరించింది. వాతావరణం అనుకూలంగా ఉండడంతో మరోసారి రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించబడింది. అయితే, హిమానీనదాలు పదేపదే విరిగిపోతున్నాయి. శిథిలాలు కూడా కిందకు వస్తున్నాయని అధికారులు చెబుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..