AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇదెక్కడి మాస్‌ రా మావా.. హెల్మెట్‌కు బదులు పాలక్యాన్‌ మూత.. కట్‌చేస్తే.. పెట్రోల్‌ బంకు సీజ్‌! ఎందుకో తెలుసా!

మధ్యప్రదేశ్‌లోని వింత ఘటన వెలుగుచూసింది. ఇటీవల ఇండోర్‌ జిల్లాలో ప్రభుత్వం తీసుకొచ్చిన.. నో హెల్మెట్‌.. నో పెట్రోల్‌ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఒక వాహనదారులు చేసిన పని నేటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. బైక్‌లో ఇందనం పోసుకునేందుకు పెట్రోల్‌బంక్‌ వచ్చిన ఒక వాహనదారుడు, హెల్మెట్‌ లేకపోవడంతో తలకు పాలక్యాన్‌ మూత పెట్టుకొని వచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇదెక్కడి మాస్‌ రా మావా.. హెల్మెట్‌కు బదులు పాలక్యాన్‌ మూత.. కట్‌చేస్తే.. పెట్రోల్‌ బంకు సీజ్‌! ఎందుకో తెలుసా!
New Trend (1)
Anand T
|

Updated on: Aug 07, 2025 | 2:15 PM

Share

రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ఇండోర్‌ జిల్లాలో ఆగస్ట్ 1వ లేదీని నుంచి నోపెట్రోల్, నో హెల్మెట్‌ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఈ నిబంధనలు అమలు చేయని వారిపై కఠిన చర్యలు తీసుకుంటానని ప్రకటించింది. అయితే ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఒక వాహనదారులు చేసిన పని ప్రస్తుతం నెటిజన్లను ఆశ్చర్యపరుస్తుంది. బైక్‌ పెట్రోల్‌ పోసుకోవడానికి వచ్చిన ఒక వాహనదారులు తన దగ్గర హెల్మెట్‌ లేకపోవడంతో.. తన పాలక్యాన్‌ మూతను తీసుకొని హెల్మెట్‌లా నెత్తిపై పెట్టుకున్నాడు.

అలాగే పెట్రోల్‌ బంక్‌లోకి వెళ్లాడు. అయితే అతని నెత్తిపై ఉన్నది పాలక్యాన్‌ మూత అని గమనించకుండా సదరు పెట్రోల్‌ బంక్‌ సిబ్బంది అతనికి పెట్రోల్‌ పోసి పంపించేశారు. అయితే ఇక్కడే ఉన్న కొందరు ఇందుకు సంబంధించిన దృశ్యాలను వీడియో తీసి సోషల్‌ మీడియాలో అప్‌లోడ్ చేశారు. దీంతో వీడియో కాస్తా వైరల్‌గా మారి ఉన్నతాధికారుల దృష్టికి చేరింది. ఈ వైరల్‌ వీడియోపై స్పందించిన అధికారులు ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి హెల్మెట్‌లేని వాహనదారుడికి పెట్రోల్‌ పోసినందుకు సదరు పెట్రోల్‌ బంక్‌పై చర్యలు తీసుకున్నారు. ఆ పెట్రోల్‌ బంక్‌ను కొన్ని రోజుల పాటు సీజ్‌ చేశారు.

కాగా ఈ నెల ఒకటవ లేదీ నుంచి మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో .. ఈ నో హెల్మెట్‌, నో పెట్రోల్‌ విధానం అమల్లోకి వచ్చింది. జిల్లా వ్యాప్తంగా హెల్మెట్‌లేని వాహనదారులకు పెట్రోల్‌ బంక్‌లలో ఇంధనం పోసేందుకు నిర్వహాకులు నిరాకరిస్తున్నారు. అయితే ప్రభుత్వ ఆదేశాలు పాటించని పెట్రోల్‌ బంక్‌లు, అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా నిబంధనలను ఉల్లంఘించిన వారికి ఏడాది జలు శిక్షతో పాటు రూ.5వేల జరిమానా విధిస్తున్నారు.

వీడియో చూడండి..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..