AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rock Salt: వంటల్లో రాక్ సాల్ట్ వాడితే ఆరోగ్యానికి హానికరమా..? అసలు నిజాలు ఏంటో తెలుసుకోండి..!

బీపీ కంట్రోల్‌లో ఉండాలంటే, ఉప్పుతినడం మానేయాలని డాక్టర్లు చెప్పడం మనం తరచూ వింటూ ఉంటాం. అయితే ఉప్పుకు ప్రత్యామ్నాయంగా మనం పింక్ సాల్ట్ లేదా రాక్ సాల్ట్ తింటే సరిపోతుందని చాలా మంది చెబుతుంటారు.

Rock Salt: వంటల్లో రాక్ సాల్ట్ వాడితే ఆరోగ్యానికి హానికరమా..? అసలు నిజాలు ఏంటో తెలుసుకోండి..!
Rock Salt
Madhavi
| Edited By: |

Updated on: Mar 18, 2023 | 10:37 AM

Share

బీపీ కంట్రోల్‌లో ఉండాలంటే, ఉప్పుతినడం మానేయాలని డాక్టర్లు చెప్పడం మనం తరచూ వింటూ ఉంటాం. అయితే ఉప్పుకు ప్రత్యామ్నాయంగా మనం పింక్ సాల్ట్ లేదా రాక్ సాల్ట్ తింటే సరిపోతుందని చాలా మంది చెబుతుంటారు. అయితే ఈ రాక్ సాల్ట్ ను కూడా WHO హానికరమని ప్రకటించిందని, రాతి ఉప్పు వాడితే ప్రమాదమనే వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే రాక్ సాల్ట్ నిజంగానే ఆరోగ్యానికి హానికరమా, కాదా అనే విషయాలను తెలుసుకుందాం.

డబ్ల్యూహెచ్‌ఓ వైట్ ఉప్పు వాడకాన్ని ప్రపంచం మొత్తానికి ఆందోళన కలిగించే విషయంగా అభివర్ణించింది. ప్రపంచంలోని ప్రతి వ్యక్తి ప్రతిరోజూ 10.8 గ్రాముల ఉప్పును వినియోగిస్తున్నారని, దానిని 5 గ్రాములకు తగ్గించాలని WHO తన నివేదికలో వెల్లడించింది. ఇప్పుడు వాడుతున్న ఉప్పు. ఆరోగ్యం పరంగా మంచిది కాదని తేల్చింది. మన దేశంలో తెల్ల ఉప్పును విపరీతంగా వినియోగిస్తారు. సాధారణంగా భారతదేశంలో తెల్ల ఉప్పును ఇళ్లలో అన్ని రకాల వంటల్లో ఉపయోగిస్తారు.

అయితే రాతి ఉప్పు లేదా పింక్ సాల్ట్‌ను నవరాత్రులు లాంటి పండగల వేళ ఉపవాసాల్లో ఉపయోగిస్తారు. ఉపవాసం చేసే సమయంలో రాతి ఉప్పు నిజంగా చాలా ఉపయోగపడుతుంది. సాధారణ ఉప్పుకు బదులుగా రాక్ సాల్ట్ లేదా పింకు ఉప్పును వాడాలని కొందరును సూచిస్తున్నారు అయితే రాక్ సాల్ట్ సైతం అధికంగా ఉపయోగించడం ఆరోగ్యానికి హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు అయినప్పటికీ వైట్ సాల్ట్ తో పోల్చితే రాక్ సాల్ట్ ఆరోగ్యానికి మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు మరి రాక్ సాల్ట్ ఉపయోగాలు ఏంటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం..

ఇవి కూడా చదవండి

రాక్ సాల్ట్ ఉపయోగాలు ఇవే:

-మెదడు చురుగ్గా ఉండేలా రాక్ సాల్ట్ పనిచేస్తుంది.సెరోటోనిన్, మెలటోనిన్ వంటి హార్మోన్లనుప్రేరేపించేందుకు రాక్ సాల్ట్ చాలా ఉపయోగపడుతోంది. మీ వంటకాల్లో రాక్ సాల్ట్ వాడకం వల్ల ఆందోళన నుంచి చాలా ఉపశమనం లభిస్తుంది.

– సాధారణ ఉప్పు రక్తపోటును పెంచడానికి పనిచేస్తుంది. కానీ రాక్ సాల్ట్ మాత్రం రక్తపోటును అదుపులో ఉంచుతుంది. ఇది బీపీని అదుపులో ఉంచుతుంది.

-కోవిడ్ నుండి, ప్రజలు గొంతు నొప్పి సమస్యను ఎదుర్కొంటున్నారు. గొంతులో నొప్పి లేదా వాపు కూడా ఉంది. గోరువెచ్చని నీటిలో రాళ్ల ఉప్పు వేసి పుక్కిలిస్తే గొంతుకు చాలా ఉపశమనం కలుగుతుంది.

– రాతి ఉప్పు చాలా మేలు చేస్తుంది. ఇందులో ఉండే పోషకాలు పేగులకు, ఇతర అవయవాలకు మేలు చేస్తాయి. అదే సమయంలో ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది

అయితే రాక్ సాల్ట్ లో కూడా సోడియం ఉంటుంది. కానీ వైట్ సాల్ట్ తో పోల్చితే కొద్ది మొత్తంలో తక్కువగా ఉంటుంది. రుచిపరంగా చూసినట్లయితే రాక్ సాల్ట్ రుచి బాగుంటుంది. అయినప్పటికీ రాక్ సాల్ట్ ను కూడా పరిమితంగానే వాడాలని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిస్తోంది. అయితే రాక్ సాల్ట్ తయారీ విధానంలో జాగ్రత్తగా ఉండాలని, గనుల నుంచి సేకరించే ఈ రాక్ సాల్ట్ ను శుద్ధి చేసిన అనంతరమే వాడాలని, లేకపోతే ఇందులో ఇతర మూలకాలు కలిసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..