Better Nails : అందమైన గోళ్ల కోసం ఆహారం ఇదే.. ఈ టిప్స్‌తో గోళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోండిలా..
ముఖ్యంగా ఆడవాళ్లు వివిధ రకాల నెయిల్ పాలిష్‌లతో పాటు నెయిల్ ఎక్స్‌టెన్షన్లతో గోళ్లను అందంగా చేసుకుంటూ ఉంటారు. ఫ్యాషన్ ఫీల్డ్‌లో ఉన్నవారైతే గోళ్లను మరింత ఆకర్షణీయంగా ఉంచుకుంటూ ఉంటారు. అయితే మనకు గోళ్లు పెరిగేకొద్దీ ఎందుకు సులభంగా విరిగిపోతాయి లేదా పెళుసుగా కనిపిస్తాయి.

శరీరంలో ప్రతి భాగానికి ఏదో ఓ ప్రత్యేకత ఉంటుంది. ముఖ్యంగా మన గోళ్లలో కనిపించేది కేవలం మృతకణాలే అయినప్పటికీ వాటితో ఆడుకుంటూ ఆనందిస్తాం. చాలా మంది గోళ్లు పెంచుకోడానికి ఇష్టపడతారు. ముఖ్యంగా ఆడవాళ్లు వివిధ రకాల నెయిల్ పాలిష్‌లతో పాటు నెయిల్ ఎక్స్‌టెన్షన్లతో గోళ్లను అందంగా చేసుకుంటూ ఉంటారు. ఫ్యాషన్ ఫీల్డ్‌లో ఉన్నవారైతే గోళ్లను మరింత ఆకర్షణీయంగా ఉంచుకుంటూ ఉంటారు. అయితే మనకు గోళ్లు పెరిగేకొద్దీ ఎందుకు సులభంగా విరిగిపోతాయి లేదా పెళుసుగా కనిపిస్తాయి. దీంతో అవి ఎక్కడ ఇరిగిపోతయో? అని మదనపడుతూ ఉంటాం. ఇతర శరీర భాగాల మాదిరిగానే మీ గోళ్లకు సరైన పోషకాహారం అందించడం కూడా అంతే అవసరం. పెళుసుగా, లేతగా కనిపించే గోళ్లను నివారించడానికి బయోటిన్ అధికంగా ఉండే ఆహారాలను నిపుణులు చెబుతున్నారు. బయోటిన్ అనేది బి విటమిన్. ఇది ఆరోగ్యకరమైన చర్మం, జుట్టు, గోళ్లను నిర్వహించడానికి ఉపయోగపడుతుంది. ఇది సరైన కణాల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. గోరు పెరుగుదలకు అవసరమైన ప్రోటీన్-బిల్డింగ్ అమైనో ఆమ్లాల సంశ్లేషణలో సహాయపడుతుంది. గోళ్ల ఆఱోగ్యం మెరుగుపర్చడానికి ఉపయోగపడే బయోటిన్-రిచ్ ఫుడ్స్ పై ఓ లుక్కేద్దాం.
గుడ్లు
గుడ్లు అధిక-నాణ్యత ప్రోటీన్ మూలం అని మనందరికీ తెలుసు. వ్యాయామం చేసేవారు, బలమైన కండరాలు పెరగడానికి ప్రయత్నించేవారు బరువు తగ్గేవారు కూడా గుడ్లను ఇష్టపడతారు. గుడ్లు బయోటిన్‌కు గొప్ప మూలం. ఓ పెద్ద గుడ్డులో 10 ఎంసీజీ బయోటిన్ ఉంటుంది. కాబట్టి ప్రతిరోజూ గుడ్లను తీసుకోవడం చాలా మంచిది.
బాదం
ప్రతి రోజు బాదంపప్పు తినడం వల్ల మీ జ్ఞాపకశక్తి పెరుగుతుంది. బాదంపప్పులో ప్రొటీన్లు, ఫైబర్, మినరల్స్ అధికంగా ఉంటాయి. ఇందులో కూడా బయోటిన్, విటమిన్ ఈ ఉంటాయి. బలమైన గోళ్లను పెంపొందించడానికి బాదంపప్పు తినడం చాలా మంచిది. ఔన్సు బాదంపప్పులో 1.5 ఎంసీజీ బయోటిన్ ఉంటుంది.



చిలకడదుంపలు
బయోటిన్ పుష్కలంగా ఉండే మరో అద్భుతమైన ఆహారం చిలకడదుంప. చిలకడ దుంపల్లో విటమిన్ ఏ, ఫైబర్ వంటి పోషకాలు ఉంటాయి. ఒక మధ్య తరహా చిలగడదుంపలో దాదాపు 2.4 ఎంసీజీ బయోటిన్ ఉంటుంది. కాబట్టి అందమైన గోళ్లకు బయోటిన్ అందించడానికి చిలకడ దుంప తినడం ఉత్తమమైన మార్గం
బచ్చలికూర
బచ్చలికూరలో అనేక పోషక లక్షణాలుంటాయి. బచ్చలికూర అంటే బయోటిన్‌కు మంచి మూలం, అలాగే ఐరన్, విటమిన్ సి వంటి ఇతర పోషకాలు అధికంగా ఉంటాయి. ఒక కప్పు పచ్చి బచ్చలికూరలో 0.5 ఎంసీజీ బయోటిన్ ఉంటుంది.
అవకాడో
అవకాడోలో ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, బయోటిన్ అధికంగా ఉంటాయి. అవకాడోలో దాదాపు 2 ఎంసీజీ బయోటిన్ ఉంటుంది. అవకాడోలో శరీరానికి అవసరమయ్యే విటమిన్లు, ఖనిజాలు చాలా ఉంటాయి. ఇవి లేత, బలహీనమైన గోళ్లను ఎదుర్కోవడానికి ఉపయోగపడతాయి. చర్మ సంరక్షణ, జుట్టు ఆరోగ్యం పెంపొందిచడానికి కూడా అవకాడో చాలా మంచి ఎంపిక.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి