Nail Care Tips: చలికాలంలో పదే పదే గోళ్లు విరిగిపోతున్నాయా? అయితే ఈ సింపుల్ టిప్స్ మీకోసమే
వేడి నీటిని ఎక్కువగా ఉపయోగించడం, చర్మం పొడిబారడం, నెయిల్ పెయింట్ ఎక్కువగా ఉపయోగించడం, అలాగే చల్లని గాలిలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం, చాలా వేడి నీటిని ఉపయోగించడం .. ఇలా గోర్ల ఆరోగ్యం దెబ్బతీనడానికి చాలా కారణాలున్నాయి.

శీతాకాలంలో, చాలా మంది గోర్లు పదేపదే విరిగిపోతుంటాయి. అదే సమయంలో, గోర్ల చుట్టూ చర్మం కూడా చాలా పొడిగా మారుతుంది. ఇలా జరగడానికి చాలా కారణాలు ఉండవచ్చు. వేడి నీటిని ఎక్కువగా ఉపయోగించడం, చర్మం పొడిబారడం, నెయిల్ పెయింట్ ఎక్కువగా ఉపయోగించడం, అలాగే చల్లని గాలిలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం, చాలా వేడి నీటిని ఉపయోగించడం .. ఇలా గోర్ల ఆరోగ్యం దెబ్బతీనడానికి చాలా కారణాలున్నాయి. కొన్నిసార్లు గోరు మధ్యలో పగుళ్లు కూడా కనిపిస్తాయి. అదే సమయంలో, పొడి చర్మం తొలగించబడినప్పుడు చాలా నొప్పి కూడా ఉంటుంది. ఇటువంటి పరిస్థితిలో, గోళ్లను సరిగ్గా చూసుకోవడం చాలా ముఖ్యం. మరి చలికాలంలో గోళ్లకు సరైన సంరక్షణ కోసం ఎలాంటి చిట్కాలు పాటించాలో తెలుసుకుందాం రండి.
మాయిశ్చరైజర్
చలికాలంలో ముఖ సంరక్షణపైనే ఎక్కువగా దృష్టిసారిస్తారు. చేతుల సంరక్షణ గురించి అసలు పట్టించుకోరు. దీంతో గోళ్లు బలహీనంగా మారతాయి. ఫలితంగా గోర్లు చాలా త్వరగా విరిగిపోతాయి. దీనిని నివారించేందుకు రాత్రి పడుకునే ముందు చేతులు శుభ్రం చేసుకోవాలి. అలాగే మాయిశ్చరైజర్ ఉపయోగించడం చాలా ముఖ్యం. ఇవి కాకుండా పెట్రోలియం జెల్లీని కూడా ఉపయోగించవచ్చు.
హ్యాండ్ గ్లోవ్స్
చల్లని గాలి నుండి చేతులను రక్షించుకోవడం చాలా ముఖ్యం. చల్లటి గాలుతో చేతులు పొడిబారి నిర్జీవంగా మారడమే కాకుండా గోళ్లు బలహీనంగా మారతాయి. దీని కారణంగా గోర్లు చాలా త్వరగా విరిగిపోతాయి. అటువంటి పరిస్థితిలో, చల్లని గాలి నుండి మీ చేతులను సురక్షితంగా ఉంచడం చాలా ముఖ్యం. చలి నుండి చేతులు, గోళ్ళను రక్షించడానికి హ్యాండ్ గ్లోవ్స్ ధరించండి.




ఆరోగ్యకరమైన ఆహారం
గోళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే సరైన పోషకాహారం తీసుకోవడం కూడా చాలా అవసరం. క్యాల్షియం, విటమిన్లు, ప్రొటీన్లు పుష్కలంగా ఉండే ఆహారాన్ని మెనులో చేర్చుకోండి. ఇవి గోళ్లను బలంగా ఉంచడంలో మీకు సహాయపడుతాయి. తద్వారా గోర్లు విరిగిపోకుండా కాపాడుకోవచ్చు. అలాగే తగినంత నీరు తాగాలి.
నూనెతో మసాజ్
చలికాలంలో వేడి నీటిని ఎక్కువగా వాడటం వల్ల చర్మం పొడిబారడంతోపాటు గోళ్లు బలహీనంగా మారతాయి. ఈ కారణంగా, గోళ్లు మళ్లీ మళ్లీ విరిగిపోతుంటాయి. అందుకే గోర్లు ఆరోగ్యంగా ఉండటానికి స్నానానికి ముందు గోళ్లను మసాజ్ చేయడం చాలా ముఖ్యం. ఇందుకోసం బాదం నూనె లేదా కొబ్బరి నూనెను ఉపయోగించవచ్చు. స్నానానికి ముందు ఈ నూనెతో మీ గోళ్లను కొంతసేపు మసాజ్ చేస్తే గోళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి