Weight Loss: బరువు తగ్గాలనుకునే వారికి గుడ్ న్యూస్.. ఇదిగో అద్భుత చిట్కా.. రోజూ తింటే ఇక తిరుగుండదు..

అధిక బరువును అధిగమించేందుకు చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. డైట్ మెయింటేన్ చేయడం.. శారీరక వ్యాయామం చేయడం వంటివి చేస్తుంటారు. ముఖ్యంగా తీపి పదార్థాలను పక్కన పెడుతుంటారు. అయితే ఒక తీపి పదార్థం మీ బరువును అదుపు చేయడంలో సాయపడుతుందంటే నమ్మగలరా?

Weight Loss: బరువు తగ్గాలనుకునే వారికి గుడ్ న్యూస్.. ఇదిగో అద్భుత చిట్కా.. రోజూ తింటే ఇక తిరుగుండదు..
Dates
Follow us
Madhu

| Edited By: Anil kumar poka

Updated on: Jan 02, 2023 | 3:38 PM

ఊబకాయం లేదా అధిక బరువు ఇటీవల కాలంలో చాలా మందిని వేధిస్తున్న సమస్య. దానిని అధిగమించేందుకు చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. డైట్ మెయింటేన్ చేయడం.. శారీరక వ్యాయామం చేయడం వంటివి చేస్తుంటారు. ముఖ్యంగా తీపి పదార్థాలను పక్కన పెడుతుంటారు. అయితే ఒక తీపి పదార్థం మీ బరువును అదుపు చేయడంలో సాయపడుతుందంటే నమ్మగలరా? నమ్మాలండీ.. నిపుణులు చెబుతున్న సత్యం ఇది. రోజూ ఖర్జూరం తినడం ద్వారా మీ శరీర బరువు అదుపులో ఉంటుంది అని వివరిస్తున్నారు.

పోషకాలు మెండు..

మంచి పాత ఖర్జూరాలు, అంటే దానిలోకి సూపర్ స్వీట్ టేస్ట్ వచ్చేలా కొన్నేళ్లుగా దూరంగా ఉంచిన తర్వాత తీసుకుంటారు. ఇవి ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలుగా ఇటీవల నిపుణులు ఎక్కువగా సూచిస్తున్నారు. ఎక్కువగా ఉష్ణమండల ప్రాంతాలలో పెరిగే ఖర్జూరాలు రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలకు ప్రసిద్ధి చెందాయి. వీటిల్లో అధిక పొటాషియం, ఐరన్, విటమిన్లు B1, B2, A1, C కలిగి ఉంటాయి. ఫలితంగా బహుళ ఆరోగ్య ప్రయోజనాలను కలుగజేస్తాయి. అంతేకాక బరువు తగ్గడానికి కూడా సాయపడతాయి.

పీచు ఎక్కువగా ఉంటుంది.. ఖర్జూరాల్లో డైటరీ ఫైబర్‌లు ఎక్కువగా ఉంటాయి. ఫలితంగా ఇది మీ జీర్ణక్రియను ప్రభావితం చేస్తుంది. సాధారణంగా పీచుతో కూడిన ఆహారం మిమ్మల్ని ఎక్కువసేపు నిండుగా ఉంచుతాయి. ఈ ఖర్జూరంలో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండటం ద్వారా కడుపు నిండుగా ఉండి.. అల్పాహారం తీసుకోకుండా నిరోధిస్తుంది. ఈ విధంగా ఇది మీ జీర్ణక్రియను కూడా పెంచుతుంది.

ఇవి కూడా చదవండి

ప్రొటీన్లు ఎక్కువ.. ఖర్జూరంలో ప్రొటీన్లు ఎక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గడానికి బాగా సహాయపడుతుంది. అంతేకాక కండరాలను బలంగా ఉంచడంలో తోడ్పడుతుంది.

ఆరోగ్యకర కొవ్వులు.. అన్ని కొవ్వులు చెడ్డవి కావు. ఖర్జూరంలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులకు అసంతృప్త కొవ్వు ఆమ్లాలు ఒక ఉదాహరణ. ఈ ఆరోగ్యకరమైన కొవ్వులు ఊబకాయం, ఇన్సులిన్ నిరోధకత, మధుమేహం వంటి వాటిపై అద్భుతంగా పోరాడుతుంది.

పుష్కలంగా యాంటీ ఆక్సిడెంట్లు.. ఖర్జూరంలో ఆంథోసైనిన్‌లు, ఫినాలిక్‌లు, కెరోటినాయిడ్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి టాక్సిన్స్‌ను బయటకు పంపడంలో సహాయపడతాయి. జీవక్రియ, జీర్ణక్రియను పెంచుతాయి. ఇవి శరీరంలోని హానికరమైన ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతాయి. ఇవన్నీ చివరికి బరువు తగ్గడానికి దారితీస్తాయి.

యాంటీ డయాబెటిక్ లక్షణాలు.. ఖర్జూరంలో చక్కెర అధికంగా ఉన్నప్పటికీ, ఇవి మీ రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచే సహజంగా లభించే చక్కెరలు. ఖర్జూరంలో ఫ్లేవనాయిడ్లు, సపోనిన్లు , ఫినోలిక్స్ పుష్కలంగా ఉంటాయి, ఇవి శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి. ఖర్జూరం కూడా తక్కువ గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటుంది. ఫలితంగా ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి.

మితంగానే తినాలి..

ఖర్జూరాలు బహుళ ఆరోగ్య ప్రయోజనాలతో నిండి ఉన్నాయి. బరువు తగ్గడానికి గొప్పగా సాయపడతాయి. అయినప్పటికీ వీటిని మీరు మితంగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అప్పుడే వాటి నుంచి ప్రయోజనాలు పొందుగోలరని వివరిస్తున్నారు. రోజుకు నాలుగు నుండి ఆరు ఖర్జూరాలను మాత్రం తింటే చాలని చెబుతున్నారు.

గమనిక: ఈ కథనంలో పేర్కొన్న సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇలాంటి పద్ధతులు/ఆహారం/చిట్కాలు పాటించే ముందు దయచేసి వైద్య సలహా తీసుకోవడం మంచిది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం..

గురు గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు..!
గురు గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు..!
ఇక ఆ రాశుల వారికి శని నుంచి విముక్తి.. వారికి ఆర్థిక వృద్ధి
ఇక ఆ రాశుల వారికి శని నుంచి విముక్తి.. వారికి ఆర్థిక వృద్ధి
అశ్వగంధ టీ.. ఈ ఒక్క ఛాయ్ తాగితే సీజనల్ వ్యాధులు పరార్..
అశ్వగంధ టీ.. ఈ ఒక్క ఛాయ్ తాగితే సీజనల్ వ్యాధులు పరార్..
స్టోర్‌ యజమాని బంపరాఫర్‌.. ఒక్కసారిగా వందల సంఖ్యలో ఎగబడ్డ జనం...
స్టోర్‌ యజమాని బంపరాఫర్‌.. ఒక్కసారిగా వందల సంఖ్యలో ఎగబడ్డ జనం...
మెడ నొప్పితో బాధ పడుతున్నారా.. ఈ చిట్కాలతో ఈజీగా తగ్గుతుంది..
మెడ నొప్పితో బాధ పడుతున్నారా.. ఈ చిట్కాలతో ఈజీగా తగ్గుతుంది..
బాలయ్య అన్ స్టాపబుల్‌లో డాకు మహారాజ్ టీమ్..
బాలయ్య అన్ స్టాపబుల్‌లో డాకు మహారాజ్ టీమ్..
వెయిట్ లాస్ చేసే హెల్దీ బ్రేక్ ఫాస్ట్.. టేస్ట్ అదుర్స్ అంతే!
వెయిట్ లాస్ చేసే హెల్దీ బ్రేక్ ఫాస్ట్.. టేస్ట్ అదుర్స్ అంతే!
దురదతోపాటు ఈ 5 లక్షణాలు కాలేయ వ్యాధికి సంకేతం.. బీకేర్‌ఫుల్..
దురదతోపాటు ఈ 5 లక్షణాలు కాలేయ వ్యాధికి సంకేతం.. బీకేర్‌ఫుల్..
పోస్టాఫీసులో బెస్ట్‌ సేవింగ్స్‌ స్కీమ్స్‌.. వడ్డీ రేట్లు ఇవే..!
పోస్టాఫీసులో బెస్ట్‌ సేవింగ్స్‌ స్కీమ్స్‌.. వడ్డీ రేట్లు ఇవే..!
ఇంత వాయిలెంట్‌గా ఉన్నావెంట్రా.. కరెంట్ తీగల మీద బట్టలు ఆరేస్తూ
ఇంత వాయిలెంట్‌గా ఉన్నావెంట్రా.. కరెంట్ తీగల మీద బట్టలు ఆరేస్తూ
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..