Nail Care Tips: చలికాలంలో గోళ్లు పెళుసుగా మారి విరిగిపోతున్నాయా? అయితే ఈ సింపుల్ టిప్స్‌తో కాపాడుకోండి
చలికాలంలో చాలామంది ముఖారవిందం గురించి పట్టించుకుంటాం. చేతులు, కాళ్లను నిర్లక్ష్యం చేస్తుంటాం. ఈక్రమంలో చాలామంది గోళ్లు బలహీనంగా మారి చాలా త్వరగా విరిగిపోతుంటాయి.

ఇతర సీజన్లతో పోల్చుకుంటే చలికాలంలో అందం, ఆరోగ్యం పరంగా పలు సమస్యలు తలెత్తుతుంటాయి. ఇందులో భాగంగా చాలామందికి గోళ్లు విరిగిపోతుంటాయి. అలాగే చాలా సార్లు గోళ్ల చుట్టూ చర్మం కూడా చాలా పొడిగా ఉంటుంది . ఇలా జరగడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఎక్కువగా వేడి నీటిని ఉపయోగించడం, చర్మం పొడిబారడం, ఎక్కువ నెయిల్ పెయింట్ ఉపయోగించడం, చల్లని గాలిలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల గోర్లు విరిగిపోతాయి. కొన్నిసార్లు గోళ్ల మధ్యలో పగుళ్లు కూడా ఏర్పడుతాయి. ఇక పొడి చర్మం తొలగించినప్పుడు చాలా బాధాకరంగా ఉంటుంది. అందుకే చలికాలంతో గోళ్ల ఆరోగ్యం పట్ల ప్రత్యేక జాగ్రత్త తీసుకోవాలంటున్నారు నిపుణులు. ఇక చలికాలంలో చాలామంది ముఖారవిందం గురించి పట్టించుకుంటాం. చేతులు, కాళ్లను నిర్లక్ష్యం చేస్తుంటాం. ఈక్రమంలో చాలామంది గోళ్లు బలహీనంగా మారి చాలా త్వరగా విరిగిపోతుంటాయి. అందువల్ల పడుకునే ముందు చేతులను కడుక్కోవడం, వాటికి మంచి మాయిశ్చరైజర్ రాయడం చాలా ముఖ్యం. అలాగే నాణ్యమైన హ్యాండ్ క్రీమ్‌ను అప్లై చేయాలి. ఇది కాకుండా మీరు పెట్రోలియం జెల్లీని కూడా ఉపయోగించవచ్చు.
గ్లోవ్స్‌తో రక్షణ..
చల్లని గాలి నుండి చేతులు రక్షించుకోవడం ముఖ్యం. చేతులు చల్లటి గాలికి గురైనట్లయితే, అవి పొడిగా, నిర్జీవంగా మారడమే కాకుండా, మన చేతిగోళ్లను బలహీనపరుస్తాయి. ఈ కారణంగా గోర్లు త్వరగా విరిగిపోతాయి. కాబట్టి చల్లని వాతావరణంలో చేతులను జాగ్రత్తగా చూసుకోవాలి. చేతులు, గోళ్లను రక్షించడానికి గ్లోవ్స్ ఉపయోగించాలి. ఇది గోళ్లకు తక్కువ నష్టం కలిగిస్తుంది.
పోషకాహారం
గోళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే వాటికి సరైన పోషకాహారం కూడా అవసరం. మీ ఆహారంలో కాల్షియం, విటమిన్లు, ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారాలను చేర్చకోవాలి. ఇది మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే మీ గోళ్లను బలోపేతం చేస్తుంది. అలాగే తగినంత నీరు తాగాలి. సరిపడా నీరు తీసుకోకపోవడం వల్ల కూడా గోర్లు కూడా దెబ్బతింటాయి.




మర్దనతో..
చలికాలంలో వేడి నీటిని తీసుకోవడం వల్ల చర్మం పొడిబారడంతోపాటు గోళ్లు కూడా బలహీనపడతాయి. ఇది వాటిని మరింత విరిగిపోయేలా చేస్తుంది. ఇలాంటి సందర్భాల్లో గోళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే స్నానానికి ముందు గోళ్లకు మసాజ్ చేయడం చాలా ముఖ్యం. ఇందుకోసం బాదం నూనె లేదా కొబ్బరి నూనెను ఉపయోగించవచ్చు. స్నానం చేసే ముందు ఈ నూనెతో గోళ్లను మసాజ్ చేయండి
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి