Winter Health: చలికాలంలో గోర్లు పొడిబారుతున్నాయా.. ఇలా చేస్తే మిలమిల మెరిసిపోతాయి.. ఓ సారి ట్రై చేసేయండి..
చలికాలంలో ఆరోగ్యంగా ఉండటం చాలా ముఖ్యం. జలుబు, దగ్గు వేధిస్తుంటాయి. అంతే కాకుండా చల్లని గాలులు చర్మాన్ని దెబ్బతీస్తాయి. దీంతో చర్మకణాలు నిగారింపు కోల్పోయి.. పాలిపోయినట్లు కనిపిస్తుంటాయి....

చలికాలంలో ఆరోగ్యంగా ఉండటం చాలా ముఖ్యం. జలుబు, దగ్గు వేధిస్తుంటాయి. అంతే కాకుండా చల్లని గాలులు చర్మాన్ని దెబ్బతీస్తాయి. దీంతో చర్మకణాలు నిగారింపు కోల్పోయి.. పాలిపోయినట్లు కనిపిస్తుంటాయి. చాలా మంది ఇదే సమస్యగా భావిస్తుంటారు. అందుకు రకరకాల లోషన్స్ రాసుకుంటుంటారు. కానీ చలికాలంలో చర్మం మాత్రమే కాకుండా కాళ్లు, చేతులు, వేళ్లు కూడా దెబ్బతింటుంటాయి. ముఖ్యంగా వేళ్లకు చివరలో ఉండే.. గోళ్లు విరిగిపోవడం, వంకర్లు తిరగడం వంటి ఇబ్బందులు ఎదురవుతుంటాయి. కాబట్టి వాటి పల్ల శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. శీతాకాలంలో గోర్ల సంరక్షణ నిపుణులు కొన్ని సూచనలు ఇస్తున్నారు. అవేంటంటే..
ఒక టేబుల్ స్పూన్ ఆముదం, బాదం నూనెను ఓ గిన్నెలో తీసుకోవాలి. వాటికి కొద్దిగా హ్యాండ్ క్రీమ్ కలపాలి. ఆ మిశ్రమాన్ని గోళ్లపై రాసుకుని 15 నుంచి 20 నిమిషాలు ఉంచాలి. ఇలా చేయడం వల్ల గోళ్లు తేమను సంతరించుకుని నిగారింపు పొందుతాయి. ఉష్ణోగ్రత తగ్గినప్పుడు గోళ్లు తేమను కోల్పోతాయి. పొడిగా మారి, పెళుసుగా తయారై విరిగిపోతాయి. ఈ పరిస్థితి రాకుండా ఉండేందుకు గోళ్లను హైడ్రేట్ గా ఉంచాలి. నాణ్యమైన హ్యాండ్ లోషన్‌ను ఉపయోగించాలి. గోరుకు మసాజ్ చేసి దానితో పూత వేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. చేతులతో పని చేస్తున్నప్పుడు.. గోళ్లను రక్షించడానికి గ్లౌజులు వేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా గోర్లు పొడిబారకుండా ఉంటాయి.
గోళ్లకు నెయిల్ పెయింటింగ్ వేసే ముందు ఆల్కహాల్ లేదా నెయిల్ పాలిష్ రిమూవర్‌తో శుభ్రం చేసుకోవాలి. గోళ్లు పగుళ్లు లేకుండా చూసుకోవాలి. బయటకు వెళ్లేటప్పుడు స్కార్ఫులు వేసుకోవాలి. చలికాలాన్ని తట్టుకునేలా గోళ్లు దృఢంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఆకుకూరలు, అవకాడోలు, వాల్‌నట్‌లు, చిక్‌పీస్ వంటి ఆహారాలు గోళ్లను బలోపేతం చేస్తాయి.




మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి…