AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mouthwash: మౌత్‌వాష్‌ వాడకం నిజంగా ప్రాణాంతకమా? రోజూ వాడితే ఏమవుతుందీ..

మౌత్ వాష్ నోటిని శుభ్రం చేయడానికి ఉపయోగించే ద్రవం. ఇందులో యాంటీ బాక్టీరియల్ ఏజెంట్లు, ఫ్లోరైడ్, ఫ్లేవరింగ్ ఆయిల్స్ వంటి వివిధ పదార్థాలు ఉంటాయి. నోటిలోని బ్యాక్టీరియాను తగ్గించడం, దుర్వాసనను తొలగించడం, కొన్నిసార్లు దంతాలను కావిటీస్ నుంచి రక్షించడం దీని ఉద్దేశ్యం. కానీ కొందరు దీనిని..

Mouthwash: మౌత్‌వాష్‌ వాడకం నిజంగా ప్రాణాంతకమా? రోజూ వాడితే ఏమవుతుందీ..
Is Mouthwash Bad For Your Health
Srilakshmi C
|

Updated on: Oct 02, 2025 | 8:57 PM

Share

ఇటీవలి కాలంలో మౌత్ వాష్‌ల వాడకం పెరిగింది. మౌత్ వాష్ నోటిని శుభ్రం చేయడానికి ఉపయోగించే ద్రవం. ఇందులో యాంటీ బాక్టీరియల్ ఏజెంట్లు, ఫ్లోరైడ్, ఫ్లేవరింగ్ ఆయిల్స్ వంటి వివిధ పదార్థాలు ఉంటాయి. నోటిలోని బ్యాక్టీరియాను తగ్గించడం, దుర్వాసనను తొలగించడం, కొన్నిసార్లు దంతాలను కావిటీస్ నుంచి రక్షించడం దీని ఉద్దేశ్యం. జనాలు దీనిని ఉపయోగించడానికి చాలా కారణాలు ఉన్నాయి. కానీ ప్రతిరోజూ మౌత్ వాష్ ఉపయోగించడం అందరికీ అవసరం లేదని నిపుణులు అంటున్నారు. ఆరోగ్యకరమైన వ్యక్తి ఒక రోజుకు రెండుసార్లు సరిగ్గా పళ్ళు తోముకుంటే సరిపోతుంది. దీనికితోడు ఫ్లాస్సింగ్, దంతవైద్యుడిని క్రమం తప్పకుండా సందర్శించడం వంటివి మంచి అలవాట్లు. అయినప్పటికీ మౌత్ వాష్ వాడకం అవసరమా? అసలు దీన్ని ప్రతిరోజూ ఉపయోగించవచ్చా? ఈ సందేహాలకు సమాధానాలు ఇక్కడ తెలుసుకుందాం..

మౌత్ వాష్ వల్ల కలిగే ప్రయోజనాలు

  • నోటి దుర్వాసన నుంచి ఉపశమనం: మౌత్ వాష్ తక్షణ తాజాదనాన్ని అందిస్తుంది. నోటి దుర్వాసనను తగ్గిస్తుంది.
  • బ్యాక్టీరియాను తగ్గిస్తుంది: యాంటీ బాక్టీరియల్ మౌత్ వాష్ కొంత సమయం వరకు బ్యాక్టీరియా పెరుగుదలను తగ్గిస్తుంది.
  • ఆరోగ్యకరమైన చిగుళ్ళను నిర్వహించడం: కొన్ని మౌత్ వాష్‌లు చిగుళ్ల వాపు, రక్తస్రావం తగ్గించడంలో సహాయపడతాయి.
  • కావిటీస్ నుంచి రక్షణ: ఫ్లోరైడ్ మౌత్ వాష్ కావిటీస్ ను నివారించడంలో సహాయపడుతుంది.

రోజువారీ ఉపయోగం వల్ల కలిగే ప్రతికూలతలు ఇవే..

నోరు పొడిబారడం

చాలా మౌత్ వాష్ లలో ఆల్కహాల్ ఉంటుంది. ఇది లాలాజలాన్ని తగ్గిస్తుంది. నోటిని పొడిబారిస్తుంది. తక్కువ లాలాజలం బ్యాక్టీరియా పెరుగుదల అవకాశాన్ని పెంచుతుంది. ప్రతి ఒక్కరి నోటిలో మంచి, చెడు బ్యాక్టీరియా రెండూ ఉంటాయి. రోజువారీ మౌత్ వాష్ వాడకం వల్ల మంచి బ్యాక్టీరియా కూడా నశిస్తుంది.

కృత్రిమ తాజాదనం

నోటి దుర్వాసనను వదిలించుకోవడానికి మీరూ మౌత్ వాష్ ఉపయోగిస్తే అది తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే ఇస్తుందని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే నిజమైన సమస్య కడుపు, చిగుళ్ళు, దంతాలలో ఉండవచ్చు.

ఇవి కూడా చదవండి

దంతాలు, నోటి అలెర్జీలు

మౌత్ వాష్ ను తరచుగా వాడటం వల్ల చాలా మందిలో చికాకు, నోటి పూత, అలెర్జీలు వస్తాయి.

మౌత్ వాష్ ఎవరు వినియోగించాలి?

నోటిని శుభ్రంగా ఉంచుకోవడానికి క్రమం తప్పకుండా బ్రష్ చేయడం, ఫ్లాసింగ్ చేయడం చాలా అవసరం. మౌత్ వాష్ అనేది ఒక అనుబంధ చర్య మాత్రమే. ఇది తప్పనిసరి కాదు. తరచుగా చిగుళ్ల పూత, నిరంతర దుర్వాసన, తీవ్రమైన ప్లేక్ ఉంటే వైద్యులు కొన్నిసార్లు మౌత్ వాష్‌ను ఉపయోగించమని సిఫార్సు చేస్తారు. అప్పుడు మాత్రమే దానిని ఉపయోగించాలి. వైద్యులు సిఫార్సు చేసిన వ్యవధి వరకు మాత్రమే మౌత్ వాష్ ఉపయోగించాలి. నోట్లో 20 నుంచి 30 సెకన్ల పాటు పుక్కిలించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మింగకూడదు. చిన్న పిల్లలకు మౌత్ వాష్ ఇవ్వకూడదు. వీలైతే ఆల్కహాల్ లేని మౌత్ వాష్ ఉపయోగించడం మంచిది.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి
ఇకపై ఆధార్ కార్డు అవసరం లేదు.. కొత్త ఆధార్ యాప్.. ప్రత్యేకత ఏంటి?
ఇకపై ఆధార్ కార్డు అవసరం లేదు.. కొత్త ఆధార్ యాప్.. ప్రత్యేకత ఏంటి?