మాడిన గిన్నెల మరకలు, జిడ్డు పోవడంలేదా.. ? ఇలా చేస్తే కొత్తవిలా మెరుస్తాయి.. ట్రై చేయండి..

అలాంటి పాత్రలను శుభ్రం చేయడం అంత సులభం కాదు. దీని కోసం, మీరు స్టీల్ స్క్రబ్‌తో గట్టిగా రుద్దాల్సి వస్తుంది. కానీ, ఈ కష్టాలకు చెక్‌ పెట్టేందుకు... ఈ రోజు మనం కొన్ని చిట్కాలను తెలుసుకుందాం..వీటి సహాయంతో మీరు డార్క్ స్పాట్‌లను సులభంగా తొలగించుకోవచ్చు.

మాడిన గిన్నెల మరకలు, జిడ్డు పోవడంలేదా.. ? ఇలా చేస్తే కొత్తవిలా మెరుస్తాయి.. ట్రై చేయండి..
Dishes It Will Shine
Follow us

|

Updated on: Jan 31, 2023 | 9:35 AM

ప్రతి ఇంట్లో వంటకోసం కడాయిలను వాడుతుంటారు. కానీ, అందులో రుచికరమైన ఆహారాన్ని వండిన తర్వాత కడాయి మాడిన తీరు చూస్తే.. భయం వేస్తుంది. కొన్ని సందర్భాల్లో కడాయిలు, మురికిగా, జిడ్డుగా ఉన్న దిగువ భాగంలో అంటుకుంటుంది. అలాగే, ఇది క్రమంగా నల్లగా మారుతుంది. రాను రాను కడాయి అడుగు భాగం జిడ్డుతో మందంగా మారిపోయి.. ఆహారం ఆలస్యంగా ఉడకడం ప్రారంభిస్తుంది. అలాంటి పాత్రలను శుభ్రం చేయడం అంత సులభం కాదు. దీని కోసం, మీరు స్టీల్ స్క్రబ్‌తో గట్టిగా రుద్దాల్సి వస్తుంది. కానీ, ఈ కష్టాలకు చెక్‌ పెట్టేందుకు… ఈ రోజు మనం కొన్ని చిట్కాలను తెలుసుకుందాం..వీటి సహాయంతో మీరు  మీ ఇంట్లోని జిడ్డు గిన్నెలను సులభంగా మెరిపించుకోవచ్చు.

మాడిపోయిన గిన్నెలు, కడాయిలను ఈజీగా శుభ్రం చేయడానికి చిట్కాలు..

1. ముందుగా గ్యాస్ స్టవ్ మీద వేడిచేసిన పాన్ పెట్టి అందులో నీళ్లు పోసి బాగా మరిగించాలి.

ఇవి కూడా చదవండి

2. ఇప్పుడు దానికి 2 స్పూన్ల డిటర్జెంట్ కలపండి. అదే మొత్తంలో డిష్ వాష్ లిక్విడ్ కలపండి. ఇప్పుడు దానికి ఒక చెంచా ఉప్పు, 2 చెంచాల నిమ్మరసం కలపండి.

3. ఇప్పుడు మళ్లీ ఆ నీటిని దాదాపు 10 నిమిషాలు ఎక్కువ మంట మీద మరిగించాలి. ఇలా చేయడం వల్ల జిడ్డు, నూనె, మురికి, ధూళి తొలగిపోతాయి.

4. ఇప్పుడు జాగ్రత్తగా మరొక పాత్రలో పాన్ నుండి వేడినీటిని తీసి, పాన్ వెనుక భాగాన్ని అందులో ముంచండి.

5. పాన్ వెనుక భాగాన్ని అదే విధంగా సుమారు 15 నిమిషాలు ముంచండి. ఇది మొండి మురికిని తేలిక చేస్తుంది.

6. ఇప్పుడు పాన్‌లో 2 చెంచాల బేకింగ్ పౌడర్, డిటర్జెంట్ వేసి బాగా కలపాలి.

7. ఇప్పుడు స్క్రబ్ లేదా సాండ్ పేపర్ సహాయంతో పాన్ ను బాగా కడగాలి.

8. ఇప్పుడు పాన్ ను వేడి నీళ్లతో బాగా కడిగి కాటన్ క్లాత్ తో తుడవాలి.

9. ఇంకా కొంత నలుపు మిగిలి ఉంటే, ఇదే విధంగా మరోమారు ట్రై చేయండి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..