AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fruits for Hemoglobin: రక్త హీనత సమస్యా.. ఈ పండ్లు తింటే బాగా రక్తం పడుతుంది!

ప్రస్తుతం మారిన ఆహారపు అలవాట్లు, జీవన శైలి విధానం వల్ల అనేక సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. వాటిల్లో చాలా మంది ఐరన్ లోపంతో ఇబ్బంది పడుతున్నారు. ఐరన్ లోపం ఉందంటే.. శరీరంలో రక్తం అనేది చాలా తక్కువ మోతాదులో ఉంటుంది. బాడీలో రక్తం తక్కువగా ఉంటే అలసట, నీరసంగా, గుండె వేగంగా కొట్టుకోవడం, ఏ పనీ చేయాలని పించకపోవడం, కొద్దిగా పని చేసినా త్వరగా నీరస పడిపోవడం వంటి సమస్యలు కనిపిస్తాయి. ఈ సమస్యలు కనిపించాయంటే..

Fruits for Hemoglobin: రక్త హీనత సమస్యా.. ఈ పండ్లు తింటే బాగా రక్తం పడుతుంది!
Fruits For Hemoglobin
Chinni Enni
|

Updated on: Feb 21, 2024 | 5:07 PM

Share

ప్రస్తుతం మారిన ఆహారపు అలవాట్లు, జీవన శైలి విధానం వల్ల అనేక సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. వాటిల్లో చాలా మంది ఐరన్ లోపంతో ఇబ్బంది పడుతున్నారు. ఐరన్ లోపం ఉందంటే.. శరీరంలో రక్తం అనేది చాలా తక్కువ మోతాదులో ఉంటుంది. బాడీలో రక్తం తక్కువగా ఉంటే అలసట, నీరసంగా, గుండె వేగంగా కొట్టుకోవడం, ఏ పనీ చేయాలని పించకపోవడం, కొద్దిగా పని చేసినా త్వరగా నీరస పడిపోవడం వంటి సమస్యలు కనిపిస్తాయి. ఈ సమస్యలు కనిపించాయంటే వెంటనే బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి. ఇంకొందరిలో కాళ్లూ, చేతులూ లాగడం, బాడీ పెయిన్స్, కళ్లు తిరగడం వంటివి కూడా కనిపిస్తాయి. రక్తం తక్కువగా ఉంటే అస్సలు ఆలస్యం చేయకూడదు. రక్తాన్ని పెంచే ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి. రక్తాన్ని పెంచడంలో ఈ ఆహారాలు బాగా హెల్ప్ చేస్తాయి. అవేంటో ఇప్పుడు చూసేయండి.

యాపిల్స్:

ప్రతిరోజూ ఒక యాపిల్ తింటే ఎన్నో వ్యాధులకు చెక్ పెట్టొచ్చు. ముఖ్యంగా గుండె సమస్యలు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా ఉంటాయి. అలాగే ప్రతి రోజూ యాపిల్ తింటే రక్త హీనత సమస్యను కూడా కంట్రోల్ చేయడవచ్చు.

అరటి పండ్లు:

రోజుకో అరటి పండు తిన్నా కూడా రక్తం పడుతుంది. చిన్న పిల్లలకు ఉదయం, సాయంత్రం అరటి పండు ఇవ్వడం వల్ల వారు బలంగా, దృఢంగా తయారవుతారు. ఇందులో ఉండే విటమిన్ సి.. ఇనుము శోషణను మెరుగు పరచుకోవడానికి అరటి పండు సహాయ పడుతుంది.

ఇవి కూడా చదవండి

పుచ్చకాయ:

పుచ్చకాయతో కేవలం శరీరం హైడ్రేట్‌గా మారడమే కాకుండా.. రక్త హీనత సమస్య కూడా అదుపు అవుతుంది. పుచ్చకాయ ఇనుము శోషణను మెరుగు పరచి.. రక్తం స్థాయిలు పెరిగేలా చేస్తుంది. కాబట్టి పుచ్చకాయ దొరికిన కాలంలో పుష్కలంగా తీసుకోండి.

స్ట్రాబెర్రీలు:

టేస్టీ టేస్టీ స్ట్రాబెర్రీలు తిన్న కూడా శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి. స్ట్రాబెర్రీల్లో విటమిన్ సి అధికంగా లభిస్తుంది. ఈ బెర్రీలు హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడానికి కూడా సహాయ పడతాయి.

దానిమ్మ పండు:

దానిమ్మ పండులో ఉండే విటమిన్ సి కూడా శరీరంలో ఐరన్ శోషణను పెంచుతుంది. ఈ పండు తింటే రక్తం పెరగడమే కాకుండా ఎన్నో అనారోగ్య సమస్యలు మాయం అవుతాయి. అలాగే నారిజం పండ్లు, ద్రాక్షలో కూడా విటమిన్ సి అధికంగా ఉంటాయి. ఇవి కూడా శరీరంలో ఐరన్ శోషణను పెంచుతాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా నిపుణులను సంప్రదించడం మేలు.