AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాత్రి పూట చపాతీ తింటున్నారా..? ఈ సైడ్ ఎఫెక్ట్స్ తప్పక తెలుసుకోండి..!

చపాతీ తినడానికి ఒక ప్రత్యేక సమయం ఉంది. చపాతీల్లో క్యాలరీలు, కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. రాత్రిపూట చపాతీ తింటే జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి రాత్రిపూట చపాతీ తినకూడదు. అలాగే మధ్యాహ్నం పూట చపాతీ తినడం శరీరానికి మేలు చేస్తుంది. అలాగే రోజూ టైమ్‌ ప్రకారం రాత్రివేళ చపాతీలు తినాలి.

రాత్రి పూట చపాతీ తింటున్నారా..? ఈ సైడ్ ఎఫెక్ట్స్ తప్పక తెలుసుకోండి..!
Eat Chapati At Night
Jyothi Gadda
|

Updated on: Feb 21, 2024 | 5:00 PM

Share

భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఆహారాలలో చపాతీ ఒకటి. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి మూడు పూటలు చపాతీ తినే వారు కూడా ఉన్నారు. అయితే, రాత్రి పూట అన్నం తినడానికి ఇష్టపడని వారు చపాతీకే మొదటి ప్రాధాన్యత ఇస్తారు. రాత్రిపూట అన్నం కాకుండా చపాతీ తింటే శరీరానికి మంచిదని చాలా మంది చెబుతుంటారు. అయితే పరిస్థితులు అలా ఉండవని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. రాత్రిపూట చపాతీ తినడం శరీరానికి మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి రాత్రిపూట చపాతీ తింటే ఎలాంటి సమస్యలు వస్తాయో ఇక్కడ తెలుసుకుందాం..

చాలా మంది తమ ఆహారంలో గోధుమ పిండితో చేసిన చపాతీకే ప్రాధాన్యతనిస్తారు.. ఒక సాధారణ చపాతీలో 120 కేలరీలు ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఉదయం పూట మహిళలు రెండు చపాతీలు, పురుషులు మూడు చపాతీలు మాత్రమే తినాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. రాత్రి భోజన సమయంలో మీరు మీ అవసరాన్ని బట్టి తినవచ్చు. అయితే 3 లేదా 4 చపాతీల కంటే ఎక్కువ తింటే జీర్ణ సమస్యలు వస్తాయి. అయితే, బరువు తగ్గాలని ప్రయత్నించే వారు చపాతీని తగ్గించుకోవాలి. గోధుమ చపాతీ తినడం వల్ల శరీరంలో కార్బోహైడ్రేట్లు, గ్లూటెన్ పరిమాణం పెరిగి కొవ్వు పేరుకుపోతుంది. చపాతీ శరీరానికి శక్తిని ఇస్తుంది.. కాబట్టి పూర్తిగా వదులుకునే బదులు తగ్గించడం మంచిది.

అలాగే చపాతీ ఎక్కువగా తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ఇది అధిక రక్తపోటు సమస్యకు దారి తీస్తుంది. రాత్రిపూట చపాతీ తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. మధుమేహం, పిసిఒడితో బాధపడుతున్న రోగులకు రాత్రిపూట చపాతీ తినడం పెద్ద సమస్యగా మారుతుంది. రోటీ రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతుంది. ఇది ఇన్సులిన్ ఉత్పత్తిని ప్రభావితం చేస్తుంది. రక్తంలో చక్కెర పెరుగుదల శరీరంలోని ఇతర భాగాలపై ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది.

ఇవి కూడా చదవండి

చపాతీ తినడానికి ఒక ప్రత్యేక సమయం ఉంది. చపాతీల్లో క్యాలరీలు, కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. రాత్రిపూట చపాతీ తింటే జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. రాత్రిపూట చపాతీలు తినడం వల్ల శరీరంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. కాబట్టి రాత్రిపూట చపాతీ తినకూడదు. అలాగే మధ్యాహ్నం పూట చపాతీ తినడం శరీరానికి మేలు చేస్తుంది. అలాగే రోజూ టైమ్‌ ప్రకారం రాత్రివేళ చపాతీలు తినాలి. రాత్రి 7 తర్వాత 10లోపే తింటే ఎంతో ఆరోగ్యం అంటున్నారు నిపుణులు. ఉదయం వేళ కూడా చపాతీలు తంటే మంచిదే.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి
సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి
ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది
ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది
హైదరాబాద్‌ వాటర్‌ బోర్డులో ఉద్యోగాలు.. అక్టోబర్ 17 వరకే ఛాన్స్
హైదరాబాద్‌ వాటర్‌ బోర్డులో ఉద్యోగాలు.. అక్టోబర్ 17 వరకే ఛాన్స్
షాలినీనే టార్గెట్ చేసిన కొత్త కంటెస్టెంట్లు!
షాలినీనే టార్గెట్ చేసిన కొత్త కంటెస్టెంట్లు!
తెలుగురాష్ట్రాల్లో ఈ రోజు వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
తెలుగురాష్ట్రాల్లో ఈ రోజు వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
అలర్ట్.. ఈ వారంలో బ్యాంక్ సెలవులు ఇవే..
అలర్ట్.. ఈ వారంలో బ్యాంక్ సెలవులు ఇవే..
రూ.5 కోట్ల లంచం డిమాండ్‌.. పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ అరెస్ట్‌!
రూ.5 కోట్ల లంచం డిమాండ్‌.. పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ అరెస్ట్‌!
మేషం నుంచి మీనం వరకు.. సోమవారం ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు?
మేషం నుంచి మీనం వరకు.. సోమవారం ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు?
'నాలో వారికి ఏం నచ్చిందో తెలియదు' బిచ్చగాడికి 21 మంది భార్యలు!
'నాలో వారికి ఏం నచ్చిందో తెలియదు' బిచ్చగాడికి 21 మంది భార్యలు!