Summer Hair Care: వేసవిలో వేధించే జుట్టు సమస్యలు..! ఈ మూడు నూనెలతో మీ కేశాలను సంరక్షించుకోండి..

ఎక్కువసార్లు తలస్నానం చేయడం వల్ల కూడా జుట్టు పాడయ్యే అవకాశం ఉంది. దీని వల్ల జుట్టు గడ్డిలా మారుతుంది. వారానికి రెండు లేదా మూడు సార్లు తలస్నానం చేస్తే సరిపోతుంది. అందుకే వేసవి కాలంలో తలస్నానం, జుట్టుకు నూనె రాయడంపై ప్రత్యేక దృష్టి పెట్టండి. కానీ, కొబ్బరి నూనెకు బదులుగా, కొన్ని ప్రత్యేక నూనెలతో మీ జుట్టును బలోపేతం చేయండి. వేసవిలో ఏ నూనెలు మీ జుట్టుకు బలం, మెరుపు, మృదుత్వాన్ని ఇస్తాయో ఇక్కడ తెలుసుకోండి..

Summer Hair Care: వేసవిలో వేధించే జుట్టు సమస్యలు..! ఈ మూడు నూనెలతో మీ కేశాలను సంరక్షించుకోండి..
Summer Hair Care
Follow us
Jyothi Gadda

|

Updated on: Feb 21, 2024 | 3:27 PM

వేసవి కాలంలో చర్మ ఆరోగ్యమే కాదు, జుట్టు ఆరోగ్యం కూడా పాడవుతుంది. చెమట కారణంగా జుట్టు పొడిబారి నిర్జీవంగా కనిపించడం ప్రారంభిస్తుంది. అలాగే వేసవి కాలంలో బద్ధకం కారణంగా తరచూ తలస్నానం అంటే చాలా మంది వెనుకాడతారు. ఇలా చేస్తే దుమ్ము, కాలుష్యం జుట్టు రాలడానికి కారణమవుతుంది. అలాగే, కొంతమంది ఎండ వేడి తట్టుకోలేక, రోజూ తలస్నానం చేస్తూ ఉంటారు. దీనివల్ల జుట్టులోని తేమ, నూనెలు తొలగిపోతాయి. ఎక్కువసార్లు తలస్నానం చేయడం వల్ల కూడా జుట్టు పాడయ్యే అవకాశం ఉంది. దీని వల్ల జుట్టు గడ్డిలా మారుతుంది. వారానికి రెండు లేదా మూడు సార్లు తలస్నానం చేస్తే సరిపోతుంది. అందుకే వేసవి కాలంలో తలస్నానం, జుట్టుకు నూనె రాయడంపై ప్రత్యేక దృష్టి పెట్టండి. కానీ, కొబ్బరి నూనెకు బదులుగా, కొన్ని ప్రత్యేక నూనెలతో మీ జుట్టును బలోపేతం చేయండి. వేసవిలో ఏ నూనెలు మీ జుట్టుకు బలం, మెరుపు, మృదుత్వాన్ని ఇస్తాయో ఇక్కడ తెలుసుకోండి..

మస్టర్డ్ ఆయిల్..

నేటికీ గ్రామాలు, చిన్న పట్టణాలలో నివసించే ప్రజలు తమ జుట్టుకు ఆవాల నూనెను ఉపయోగిస్తారు. ఇది యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది తలకు సంబంధించిన అన్ని రకాల ఇన్ఫెక్షన్లను దూరం చేస్తుంది. చిన్నవయసులోనే మీ జుట్టు నెరిసిపోతుంటే ఆవనూనె మాత్రమే రాయండి.

ఇవి కూడా చదవండి

నువ్వుల నూనె..

నువ్వుల నూనె జుట్టుకు చాలా ఆరోగ్యకరమైనది. ఇందులో విటమిన్లు సమృద్ధిగా ఉండటమే కాకుండా, ఇది యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంది. ఇది పొడిబారిన, నిర్జీవమైన జుట్టుకు జీవం పోస్తుంది. రాత్రి పడుకునే ముందు ఈ నూనెను రాసుకోండి. క్రమం తప్పకుండా ఇలా చేస్తూ ఉంటే.. మీ జుట్టు త్వరలోనే నల్లగా మారటం మీరే చూస్తారు.

ఆలివ్ ఆయిల్..

ఆలివ్ ఆయిల్ చర్మం, జుట్టుకు మంచిది. మీకు పొడవాటి, గిరజాల జుట్టు కావాలంటే.. ఈ నూనెను ఉపయోగించండి. ఇది జుట్టు నిర్వహణను సులభతరం చేస్తుంది. ఇందులోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ జుట్టుకు పోషణను అందిస్తాయి.

చివరగా.. తలకు నూనెను అప్లై చేసేముందు.. గోరువెచ్చని నూనె మాత్రమే ఉపయోగించండి.. ఇది మీ జుట్టుకు అద్భుతాలు చేస్తుంది. జుట్టును తేమగా, హెల్తీగా మారుస్తుంది. చిట్లిపోయిన జుట్టును చికిత్స చేయడానికి సహాయపడుతుంది. అవోకాడో, కొబ్బరి, ఆలివ్‌, బాదం ఈ నూనెలలో ఏదైనా దాన్ని.. వేడి చేసి మీ తలకు అప్లై చేసి మసాజ్‌ చేయండి. గంట ఆగిన తర్వాత తలస్నానం చేయండి. అలా చేస్తే జుట్టు కుదుళ్లు బలంగా అవుతాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?