Soaked Food Benefits: వీటిని నానబెట్టుకుని తినకపోతే అంతే.. ఆరోగ్య సమస్యలన్నీ మీ వెంటే..!
పచ్చివి తినడం మంచిదే అయినా కొన్ని ఆహార పదార్థాలను డైరెక్ట్ తింటే ఆహార సమస్యలను కొని తెచ్చుకున్నట్లేనని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కొన్ని ఆహార పోషక విలువలను మెరుగుపరచడానికి, వాటి వేడిని తగ్గించడానికి, వాటిని నీటిలో నానబెట్టడం నిపుణులు సిఫార్సు చేస్తున్నారు.

సాధారణంగా కొన్ని ఆహార పదార్థాలు డైరెక్ట్‌గా తింటూ ఉంటాం. ముఖ్యంగా చాలా మంది పప్పు ధాన్యాలను డైరెక్ట్‌గా తింటూ ఉంటారు. పచ్చివి తినడం మంచిదే అయినా కొన్ని ఆహార పదార్థాలను డైరెక్ట్ తింటే ఆహార సమస్యలను కొని తెచ్చుకున్నట్లేనని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కొన్ని ఆహార పోషక విలువలను మెరుగుపరచడానికి, వాటి వేడిని తగ్గించడానికి, వాటిని నీటిలో నానబెట్టడం మంచిదన నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. ఇలా చేస్తే శరీరానికి అనేక ప్రయోజనాలు ఉంటాయి. వాడే ముందు రాత్రిపూట నానబెట్టిన ఆహారాన్ని తీసుకుంటే చాలా మేలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ నానబెట్టిన ఆహారాలను తినడం వల్ల ప్రయోజనాలు ఏంటో ఓ సారి తెలుసుకుందాం.
కాయధాన్యాలు, బీన్స్
కాయధాన్యాలు, బీన్స్, ఇతర ధాన్యాలు తినడానికి ముందు తప్పనిసరిగా నీటిలో నానబెట్టాలి. ఇలా చేయడం వల్ల ఫైటేట్ అని కూడా పిలువబడే ఫైటిక్ యాసిడ్ తగ్గుతుంది. ఐరన్, జింక్, కాల్షియం వంటి కొన్ని ప్రోటీన్లు, ఖనిజాలు అందిస్తుంది. కాబట్టి ఫైటిక్ యాసిడ్‌ను కొన్నిసార్లు యాంటీ న్యూట్రియంట్ అంటారు. ఈ పోషకాలను బంధించడం ద్వారా ఇది మన శరీరంలో శోషించబడే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. తద్వారా మనం వాటి ప్రయోజనాన్ని పొందలేము.
మెంతి గింజలు
మెంతి గింజలను నీటిలో నానబెట్టడం వల్ల వాటి ఫైబర్ పెరుగుతుంది. అలాగే వాటి లక్షణాలను పెంచుతుంది. నీటిలో నానిన తర్వాత సులభంగా జీర్ణమవుతుంది. దీంతో జీర్ణవ్యవస్థ కూడా ఆరోగ్యంగా ఉంటుంది.




బాదం
అవిసె గింజలు, బాదంపప్పులు వంటి వాటి నుంచి టానిన్ సమ్మేళనాన్ని నివారించాలనుకుంటే వీటిని నానబెట్టి తినడం మంచిది. వీటిని నానబెట్టి తినడం వల్ల వాటిలో ఫైబర్, పోషకాలు శరీరానికి అందుతాయి. అలాగే వాటిలో ఉండే ప్రోటీన్ కడుపులో వేడిని ఉత్పత్తి చేయకుండా సాయం చేస్తుంది.
ఎండుద్రాక్ష
నీటిలో నానబెట్టిన ఎండుద్రాక్షను తీసుకోవడం వల్ల శరీరంలో ఐరన్ పరిమాణాన్ని పెంచుతుంది. ఇలా చేయడం వల్ల దాని అందులోని ఫైబర్ శాతం పెరుగుతుంది. ఇది మలబద్ధకం, పైల్స్ ఉన్న రోగులకు ఉపశమనం ఇస్తుంది. కాబట్టి వీటిని నానబెట్టి తినడం ఉత్తమం.
మామిడిపండ్లు
మామిడి పండ్లను తినే ముందు రోజు రాత్రి నీటిలో నానబెట్టడం ద్వారా వాటి నుంచి వెలువడే వేడిని తగ్గించుకోవచ్చు. మామిడికాయల వేడికి కొందరికి దద్దుర్లు, చర్మవ్యాధులు వస్తాయి. అలాంటి వారు మామిడి పండ్లను నీటిలో నానబెట్టి తినడం వల్ల ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




