- Telugu News Photo Gallery Which Dry Fruits should be soaked and which should not be soaked know the details
Dry Fruits: ఏ డ్రై ఫ్రూట్స్‌ను నానబెట్టాలి, ఏది నానబెట్టకూడదు.. ముఖ్యమైన విషయం ఇప్పుడే తెలుసుకోండి..!
Dry Fruits: ఏ డ్రై ఫ్రూట్స్‌ను నానబెట్టాలి, ఏది నానబెట్టకూడదు.. ముఖ్యమైన విషయం ఇప్పుడే తెలుసుకోండి..!
Updated on: Apr 22, 2022 | 6:30 AM

నిపుణుల అభిప్రాయం ప్రకారం, చాలా వరకు ఎండిన పండ్లు వేడిగా ఉంటాయి. వాటిని నేరుగా తినడం వల్ల జీర్ణ వ్యవస్థకు హానీ జరుగుతుంది. కొన్ని డ్రై ఫ్రూట్స్‌ను నానబెట్టడం వల్ల అవి సులభంగా జీర్ణమవుతాయి. వాటిని నానబెట్టడానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోండి..

బాదం: నానబెట్టి తినగలిగే డ్రై ఫ్రూట్స్‌లో బాదం కూడా ఉంది. బాదం వేడి చేస్తుంది. దీనిని నేరుగా తినడం వల్ల కడుపు నొప్పి వస్తుంది. బాదం పప్పు చర్మంలో టానిన్లు ఉంటాయి. ఇవి జీర్ణం కావడం కష్టం.

ఎండు ద్రాక్ష: డ్రై ఫ్రూట్స్‌లో ఒకటైన ఎండు ద్రాక్షను పుడ్, తీపి పదార్థాలతో ఇష్టంగా తింటారు. కానీ నానబెట్టి తినడం వల్ల దీని ప్రయోజనాలు రెట్టింపు అవుతాయి. నిత్యం ఎండుద్రాక్ష నీటిని తాగడం వల్ల చర్మం మెరిసిపోతుంది.

జీడిపప్పు: నానబెట్టకూడని డ్రై ఫ్రూట్స్‌లో జీడిపప్పు కూడా ఉంది. ఇది చాలా మృదువైన డ్రై ఫ్రూట్. నానబెట్టిన తర్వాత దాని రుచి మొత్తం పోతుంది. జీడిపప్పును నేరుగా తినడం మంచిది.