- Telugu News Photo Gallery Spiritual photos Chanakya Niti Take care of these things bad times will not come in life know the details
Chanakya Niti: ఈ విషయాలపై ప్రత్యేక శ్రద్ధ పెడితే జీవితంలో బ్యాడ్ టైమ్ అనేదే రాదు..!
ఆచార్య చాణక్యుడి విధానాలు నేటికీ అనుసరణీయమైనవి ఉద్ఘాటించి చెప్పొచ్చు. మనిషి జీవితంలో ఎన్నో సమస్యలను ఎదురవుతాయి. వాటిని ఎదుర్కొని ముందుకు సాగాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఆచార్య చాణక్యుడు జీవితంలో ఎదురయ్యే సమస్యల నుండి బయటపడటానికి పరిష్కారం కూడా చెప్పాడు.
Updated on: Apr 22, 2022 | 1:37 PM


ప్రతికూల ఆలోచనను నివారించండి: మీ ఆలోచన మీ చర్యలను ప్రభావితం చేస్తుంది. అందువల్ల ప్రతికూల ఆలోచనలతో ఉండే వ్యక్తులు జీవితంలో విజయం సాధించలేరు. చాణక్య నీతి ప్రకారం ఒక వ్యక్తి విజయంలో సానుకూలత ప్రత్యేక సహకారాన్ని కలిగిస్తుంది. కాబట్టి పాజిటివ్ థింకింగ్ తో పని చేసి జీవితంలో విజయం సాధించండి.

ఆచార్య చాణక్యుడి ప్రకారం.. అవసరం ఉన్నవారికి దానం చేయాలి. దీంతో లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఎప్పుడూ ఉంటుంది. పేదరికం నుండి బయటపడటానికి దానం చేయండి. దీనివల్ల పుణ్యం లభిస్తుంది. దీని వల్ల భవిష్యత్తులో మీరు ఎలాంటి ఆర్థిక నష్టాన్ని ఎదుర్కోరు.

ఆచార్య చాణక్యుడు ప్రకారం.. మీ ప్రవర్తన మర్యాదగా ఉండాలి. ఎదుటి వ్యక్తితో మర్యాదగా మాట్లాడండి. దీంతో ప్రజల్లో మీ గౌరవం పెరుగుతుంది. ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో దుఃఖాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం రాదు. మత విశ్వాసాల ప్రకారం.. ఒక వ్యక్తి తన చర్యల కారణంగానే, తనకు ఆనందం, దుఃఖం కలుగుతాయి.

ఆచార్య చాణక్యుడు నీతిశాస్త్రంలో మనిషి జీవితానికి సంబంధించిన అనేక విషయాలను ప్రస్తావించాడు. దీంతోపాటు మంచి, చెడులకు అనేక అంశాలపై నీతి శాస్త్రంలో బోధించాడు. అయితే.. ఓ మనిషి కొన్ని అలవాట్లను వెంటనే మానుకోవాలని.. లేకపోతే చాలా నష్టాలు అనుభవించాల్సి ఉంటుందని హెచ్చరించాడు. ఇలా చేయడం వల్ల జీవితంలో విజయం సాధించవచ్చని పేర్కొన్నాడు.
